శ్రీసాయి సత్ చరిత్ర – తత్వం – అంతరార్ధం – 6వ.భాగం



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

శ్రీసాయి సత్ చరిత్ర – తత్వం – అంతరార్ధం – 6వ.భాగం 
మూలం: సాయి.బా.ని.స. శ్రీరావాడ గోపాలరావు
తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు
ఒక రోజున ద్వారకామాయిలో దీపాలు వెలిగించడానికి బాబా నూనె అడిగితే, వర్తకులందరూ నూనె యివ్వడానికి నిరాకారించారు.  బాబా నీటితో దీపాలు వెలిగించారు.  ఇదెలా సాధ్యమయింది?
బాబా తన యోగశక్తితోను, భగవంతునిపై నమ్మకంతోను నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్ రెండుగా విడగొట్టి దీపాలను వెలిగించగలిగారు.  ఆవిధంగా బాబా, తమ గురువు మీద భగవంతుని మీద విశ్వాసం పెంపొందేలా మార్గాన్ని సుగమం చేశారు.
రసాయన శాస్త్రప్రకారం, నీరు 900 డిగ్రీల ఉష్ణొగ్రత వద్ద, నికెల్ ఉత్ప్రేరకంగా (కెటలిస్ట్) హైడ్రోజన్, ఆక్సిజన్ గా విడిపోతుంది. నీటిలో హైడ్రోజన్ ఎక్కువగా ఉంటుంది.  అందుచేతనే బాబా అదే హైడ్రోజన్ తో దీపాలను వెలిగించారు. భగవంతుని మీద పూర్తి విశ్వాసం ఉంచాలనే సందేశాన్ని ఇవ్వాలన్నదే బాబా సంకల్పం.
 
బాబా తన అంకిత భక్తులలో ఒకరైన బీ.వీ.దేవ్ ను యిలా ప్రశ్నించారు. “గుడ్డపీలికలనెందుకు దొంగిలిస్తావు.  నేను నీకు పట్టు వస్త్రాన్ని యిద్దామని చూస్తున్నాను. బాలక్ రాం వద్దకు ఎందుకు వెళ్ళావు?” బాబా ఈవిధంగా మాట్లాడటంలోని ఆంతర్యమేమిటో చూద్దాము.
ఏప్రశ్నకయినా సరే సమాధానం కావాలంటే బాబానే స్వయముగా అడగవలెననీ యితరుల నుంచి అడిగి తెలుసుకొనుట వ్యర్ధ ప్రయత్నమని బాబా ఉద్దేశ్యము. 
నేను సాయి మార్గంలోకి వచ్చిన మొదటి రోజులలో, నాకొక వ్యక్తితో పరిచయం కలిగింది.  నేను సాయి తత్వాన్ని ప్రచారం చేయడానికి ఆయనే కారకుడు.
ఒకసారి బాబా నా కలలో కనిపించి “నేను నీకు నోట్లకట్టలనివ్వడానికి సిధ్ధంగా ఉండగా, క్రొత్తనాణాల కోసం యితరుల వెనుక ఎందుకని పరుగులు పెడతావు?” అన్నారు. ఆరోజు నుండి నాకేది కావలసి వచ్చినా సమాధానం శ్రీసాయిసత్ చరిత్ర నుండే తెలుసుకోవడం అలవాటు చేసుకొన్నాను. 
 
బాబా ద్వారకామాయిలో తనే స్వయంగా వండి అన్నదానం జరిపేవారు.  ఉడుకుతున్న అన్నం గుండిగలో చేయిపెట్టి కలుపుతూ అన్నం ఉడికినదీ లేనిదీ పరీక్షించేవారు. ఆయనకు చేయి కాలిన బాధ ఏమీ ఉండేది కాదు. కాని, ఎక్కడో దూరంలో ఉన్న ఒక కమ్మరి స్త్రీ ఒడిలో నుండి కొలిమిలో పడ్డ బిడ్దను రక్షించడానికి ధునిలోకి చేయి పెట్టిగా బాబా చేయి కాలింది – ఎందుకని?
ఆయన ఎవరి నుంచీ ఏమీ ఆశించకుండా స్వయంగా అన్నం వండి అన్నదానం చేశారు.  అందుచేతనే ఉడుకుతున్న అన్నం గుండిగలో చేయిపెట్టినా కాలలేదు.  కాని, కమ్మరి స్త్రీ ఒడిలోనున్న బిడ్డ కర్మఫలం చేత మంటల్లో పడింధి. ఒకరి కర్మఫలాన్ని ఎవరో మరొకరు అనుభవించి తీరవలసిందే. అందుచేత బిడ్డను రక్షించాలంటే ఆబిడ్డ యొక్క కర్మను తాననుభవించి బిడ్డపడవలసిన బాధను తాననుభవించారు బాబా.
తమ జీవితం ఆఖరి క్షణాలలో కొంతమంది చేత బాబా భాగవతం చదివించారు.  తాను మహాసమాధి అవుతున్న సందర్భంలో బాబా వజే చేత రామవిజయం చదివించుకొని విన్నారు.  ఎందులకీ భేదం?
పరీక్షిన్మహారాజు జీవితపు ఆఖరి ఘడియలలో ఉన్నాడు.  శుక మహాముని ఏడురోజులు భాగవతం చదివి పరీక్షిత్తుకు సద్గతి కలిగించాడు.  అదేవిధంగా బాబా  మద్రాసు నుంచి వచ్చిన సన్యాసి విజయానంద్ కి రెండు వారాలు భాగవతం చదివించి సద్గతి కలిగించారు.
బాబా వజే చేత రామవిజయం చదివించుకొని 15 అక్టోబరు, 1918 విజయదశమినాడు మహాసమాధి చెందారు.
రేపు తరువాయి బాగం….

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles