Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
నా పేరు సుప్రియ. మా వారి పేరు నెహ్రు. మేము బెంగుళూరు లో వుంటామ. మా వారు HSBC బ్యాంకులో పని చేస్తారు .
మా వారికి దేవుడంటే పెద్దగా నమ్మకం లేదు. అయినా నన్ను మాత్రం దేవాలయానికి తీసుకువెడుతుండేవారు.
మా వారి స్నేహితుడు ఒకరు అమెరికాలో వుంటారు. అప్పుడప్పుడూ ఇండియాకి వచ్చి వెళుతుండేవారు .
వారు ఇండియాకి వచ్చినప్పుడు తప్పని సరిగా శిరిడి వెళ్లి బాబాను దర్శించుకోవడం వారి అలవాటు.
మాకు బాబాను చేరుకునే సమయం వచ్చింది అనుకుంటాను. ఈ సారి వాళ్ళ తోటి మమ్మల్ని రమ్మని అన్నారు.
ఏనాడూ గుడి గోపురాలకు వేళ్ళని మేము ఆలా వాళ్ళు అడగగానే వాళ్ళ మాట కాదనకుండా మావారు సరే అన్నారు.
మేము వాళ్ళతో శిరిడికి వెళ్ళాము. మేము శిరిడి వెళ్లేంత వరకు మాకు అసలు బాబా గురించి ఏమి తెలియదు.
బాబాకి గుడులు ఉంటాయి అని, హారతులు చేస్తారు అని మాత్రం తెలుసు .
అదెలాగంటే ఒకసారి మమ్మల్ని ఒక డాక్టర్ గారు వైజాగ్ తీసుకువెడుతూ రాజమండ్రికి ధవళేశ్వరానికి మధ్యలో ఒక బాబా గుడి వుంది, ఆ గుడి ముందు కారు ఆపి, రండి దర్శనం చేసుకొని వెడదాం అంటూ అయన లోపలికి వెళ్ళాడు.
మేము ఆయన్ని మొహమాటంగా అనుసరించి దండం పెట్టుకున్నాం . ఈలోపు మధ్యాహ్న హారతి సమయం అవ్వడాన హారతి మొదలయింది.
వాళ్ళేం పాడుతున్నారో ఏమిటో మాకేమి అర్థం కాలేదు. బయటకు వెళ్ళిపోదాం అనుకుంటే ఆయనతో వచ్చాము, బయటకు వెళ్ళిపోతే బాగుండదు అని అలాగే అసహనాన్ని అణుచుకుని పైకి మాత్రం నవ్వు పులుముకుని వున్నాము.
అదే మొదటిసారి బాబా అనే ఆయన్ని చూడటం. ఆనాడు తెలియదు ఆ మహానుభావుడు లేనిదే మనం లేము అనే రోజు వస్తుంది అని.
నిజానికి మా వారి స్నేహితులు ఫ్యామిలీ అంతా ఈ సారికి విదేశాలకి వెళ్ళాలి అనుకున్నారు. కానీ వారికి ధనం సర్దుబాటు కాలేదు.
వారు శిరిడీలో బాబాను దర్శించడానికి వెళుతూ మమ్మల్ని కూడా తీసుకొని వెళ్లారు.
శిరిడికి వెళ్లి బాబాను దర్శనం చేసుకొని రాగానే వారికి ఎలా కుదిరాయో ఏమో కాని డబ్బు కుదిరి వాళ్ళు అనుకున్నట్లు గానే వాళ్ళ ఫ్యామిలీ అంతా ఫ్లయిట్ ఎక్కారు.
మాకేమైందో కానీ మేము కూడా బాబా భక్తులం అయిపోయాం. ఇప్పుడెలాగయిపోయిందంటే నాకు పుట్టింటికి వెళ్లడంకంటే, ఒక పది రోజులు శిరిడీలో వుండటం చాలా ఇష్టం.
ఏమీ వద్దు ద్వారకామాయిలోనో , గురుస్థానంలోనో ఆలా కూర్చుంటే చాలు చాలా సంతోషంగా వుంటుంది .
అందరి భక్తులు లాగా హారతికి బుక్ చేసుకోవాలి అని, బాబాను ఇన్ని సార్లు దర్శనం చేసుకోవాలి అని మాకేమి ఉండదు.
బాబా సమీపంలో, ఆ పరిసరాలలో ఉండటమే గొప్ప యోగం అనిపిస్తుంది. నాకంటే మా వారికి బాబా సూక్తులు, ఆయన వచనాలు నరనరాల్లో బాగా పట్టేసాయి.
ఎంత అంటే ఇప్పుడు పిడుగు పడుతుంది అని ఎవరైనా చెబితే ఏం కాదు బాబా చూసుకుంటారులే అన్న స్థితికి చేరుకున్నారు . అన్ని బాబాయే అంటారాయన.
The above Telugu text has been typed by : Mr. Sai Krishna
Latest Miracles:
- బాబా — గొప్ప వైద్య నిపుణుడు
- శిరిడీసాయి దర్శనం.
- శిరిడి యాత్రకు బాబా ధన సహాయం
- బాబా అయోనిసంభవుడు; శిరిడి మొట్టమొదట ప్రవేశించుట
- బాబా సచ్చరిత్ర పారాయణ వల్ల తమ్ముడు తమ్ముడి జాడ తెలిసింది-4
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments