బాబా ఆరాధన చేతబడి నిరోధిస్తుంది–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

This Audio Prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-179-1612-బాబా ఆరాధన చేతబడి నిరోధిస్తుంది 2:57

వెంకటరామన్ తన కుటుంబంతో చెన్నయ్ లోని మైలా పూర్ లో నివసించేవాడు.

అతని తండ్రి రేల్వేలో హైదరాబాద్ లో పనిచేస్తూ వుండేవాడు. కుటుంబ తగాదాల వలన వారి బందువులు వెంకటరామన్ కుటుంబానికి చేతబడి చేయడానికి కూడా వెనుకాడలేదు.

ఒకరోజు వెంకటరామన్ దగ్గరికి ఒక ముసలాయన వచ్చి ’మీ ఇంటిలో అణువణువునా వెదుకు, నీకు కొన్ని చిన్న చిన్న కాగితాలు కన్పిస్తాయి, వాటి మీద తమిళంలో ’పిల్లిశూన్యం’ అని వ్రాసివుంటుంది.

పిల్లిశూన్యం అంటే చేతబడి వశీకరణమని అర్ధం. వాటితో పాటు ఆ కాగితాలకు దగ్గరలోని శవదహనశాల నుండి భస్మం కూడా వుంటుంది.

ఆ కాగితాలను కాల్చివేసి మీ ఇంటిని ప్రతి శనివారం నీటితో శుభ్రంగా కడుగు. దేవునికి పొంగల్ పాయసం నైవేద్యంగా అర్పించు’ అని సలహా ఇచ్చి వెళ్లిపోయాడు .

అలాగే ముసలాయన చెప్పినట్లుగానే వెంకటరామన్ కి కాగితాలు కన్పించాయి, వాటిని వెంటనే కాల్చివేసాడు. ముసిలాయన సలహాని సంపూర్ణంగా పాటించాడు.
పదిరోజుల తర్వాత వెంకటరామన్ బంధువొకాయన వచ్చి అతనికి ఇరవై మామిడిపండ్లు ఇచ్చాడు.

ఆ బందువు వెళ్ళిన వెంటనే ముసలాయన మళ్ళీ ప్రత్యక్ష్యమయ్యాడు, ఈ సారి మోటారు బైకు నడుపుకుంటూ వచ్చాడు.

’ఆ మామిడిపళ్లు తినవద్దనీ, దానివలన చాలా దురదృష్టం ఎదురవుతుందని’ చెపుతూ ఆ ముసిలాయన వెంకటరామన్ ని కత్తిని తెచ్చి మామిడిపండుని కోయమన్నాడు.

కోసిన వారికి పండు మధ్యలో కొద్దిగా బూడిద ఒక మల్లెపువ్వు కన్పించాయి. వెంటనే ఆ ముసలాయన ఆ మామిడిపళ్లనన్నింటినీ విసిరి వేసాడు.

తనకు ఆకలిగా వుందనీ ఏదైనా ఆహారం వుంటే పెట్టమనీ వెంకటరామన్ ని అడిగాడు. వెంకటరామన్ అతనికి సాంబారు అన్నం, మజ్జిగ అన్నం పెట్టాడు.
కొన్నాళ్లతర్వాత వెంకటరామన్ తండ్రి వచ్చారు. అప్పుడు వెంకటరామన్ ఈ విషయమంతా వివరించాడు.

అప్పుడాయన ఆ వచ్చిన ముసలాయన పూజ్యశ్రీ బి.వి.నరసింహస్వామిగారనీ, బాబా ఆదేశంతో 13.3.1946 తేదీన వెంకటరామన్ ఉంటున్న ఇంటికి వచ్చి అక్కడున్న చేతబడి వశీకరణాన్ని తొలగించారనీ చెప్పాడు.

శ్రి బి.వి.నరసింహస్వామి సాయి ఆరాధన చేస్తూండేవారు. వీరికి బాబా ఫోటో మరియూ విభూతి ఇచ్చారు.

బాబా ఆరాధన ప్రారంభించినప్పటినుండీ వెంకటరామన్ కుటుంబం సుఖ శాంతులతో జీవించ సాగింది.
సాయిసుధ, సంపుటి: 7,భాగం: 4, సెప్టేంబరు 1946…

విన్నీ చిట్లూరి సంకలీకరించిన బాబాస్’ డివైన్ సింఫనీ గ్రంధం నుండి సేకరణ మరియూ అనువాదం
సాయిబాబా చాగంటి
csaibaba@gmail.com
whatsapp 7033779935
Voice call: 9437366086, 8270077374

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles