Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio prepared by Mr Sreenivas Murthy
అక్కడ వుండగా పక్కనే వున్న యాదగిరి గుట్టకి కూడా పోలేని పరిస్థితి. బాబా పారాయణ బాగా చేయడం మొదలు పెట్టాను. నేను చదువుతూంటే మా ఆవిడ వింటుండేది.
అలా బాబా పారాయణం మొదలయింది దానితో పాటు విష్ణు సహస్ర నామం కూడా చదివేవాడ్ని. ఒక్కొక పద్యం రాసుకొని నేర్చుకొని మరి చదివేవాడ్ని. అలా విష్ణు సహస్రనామం కంఠతా వచ్చేసింది.
అలా చేస్తుండగా మాకు కాస్త development కనిపించసాగింది.
శంకర మఠం దగ్గర పని చేస్తున్నప్పుడు మా institute నాలుగవ అంతస్తులో వుండేది. అప్పటికి నేను ఒక లక్ష రూపాయల ముడుపు తో ఒక ఇన్సిట్యూట్ మొదలు పెట్టాను.
నాకు కొంత మంది విధ్యార్దుల తల్లిదండ్రులు ఇన్సిట్యూట్ కి కావాల్సిన వస్తువులు installment లో ఇప్పించారు.
శంకర మఠం దగ్గర పనిచేస్తున్న ఇన్సిట్యూట్ లో పరీక్షలు అయిపోగానే, నేను అక్కడికి వెళ్లి పోదామను కుంటున్నాను.
ఆ సమయంలో ఆ నాలుగో అంతస్తులోకి ఒక ముసలాయన నా దగ్గరికి వచ్చారు. లిఫ్ట్ కూడా లేదు. నాలుగంతస్తులు మెట్లు ఎక్కి వచ్చారు.
నేను ఈ పక్కగా వెడుతూ నా మనసుకి మెరుపులా అనిపించింది. అది చెబుదామని ఇలా వచ్చానన్నాడు. ఏమిటి అని అడిగాను.
“నువ్వు ఇక్కడ వుండవు ఒక పుణ్య క్షేత్రం లో వుంటావు అన్నారు.” నేను ఇక్కడ ఇప్పుడే కొత్త ఇన్సిట్యూట్ కి పెట్టుబడి పెట్టాను. ఇటువంటి పరిస్థితుల లో నేనెక్కిడికి పోతాను అన్నాను చాలా తేలికగా కొట్టి పారేస్తూ.
ఒక కాగితం తీసుకో నేను చెప్పినట్లు రాయి అన్నాడు. సరేనని కాగితం తీసుకువచ్చాను.
దాని మీద “ఓం శ్రీం హీం క్లిం వనదేవతాయనమః అని నా చేత రాయించాడు (పెద్ద పెద్ద అక్షరాల్లతో) దాని మీద పసుపు కుంకుమ వేయించాడు. అయన వట్టి చేతులతో వచ్చాడు. కానీ అరచేతిలో నుంచి ఒక గులాబి పువ్వును తీసాడు.
ఆ కాగితం పై వేసాడు. ఆ కాగితం మడిచి నా చేతికిచ్చి ఈ కాగితం నీ దగ్గర పెట్టుకో నువ్వు వేరే వూరు కనుక వెళ్ళిపోతే,
ఒకాయన వచ్చి ఇలా వచ్చేస్తానని చెప్పి వెళ్ళాడు అన్న విషయం గుర్తు చేసుకో అన్నారు. నేను కాఫీ కానీ టీ కానీ తాగుతారా అని అడిగాను.
నాకు కాఫీ కావాలి అన్నారు. నేను కాఫీ తెప్పించాను. సగం కాఫీ సాసర్ లో పోసి కప్పు నాకిచ్చి సాసర్ తో తానూ తాగాడు. సరే వస్తాను అని గుమ్మం దాటాడు.
అంతే నాకు ఆలోచన మొదలయ్యింది. ఎవరీయన నాలుగో అంతస్తుకు, మెట్లు ఎక్కుతూ వచ్చి నాకి విషయం ఎందుకు చెప్పాడు.
అయన మామూలు వాడు కాదు. బాబా యే అయివుంటాడు అన్న ఆలోచన వచ్చిన వెంటనే నేను గుమ్మం దాటాను.
ఆ సమయానికి ఒక్క అంతస్తు మెట్లు కూడా ఆ వయసు ఆయన దిగలేరు. అటువంటిది నాలుగు అంతస్తుల మెట్ల మీద లేరు.
నేను క్రిందకి వెళ్ళి ఇటు నాలుగు వీధులు అటు నాలుగు వీధులు సైకిల్ మీద వెళ్ళి మరీ గాలించాను.
నాకు ఎక్కడ ఆ ముసలాయన కనపడలేదు. “నువ్వండవు ఇక్కడ” అని ఆయనన్న మాట, పదే పదే నా మనసులో మేదల సాగింది.
The above telugu TEXT typed by : Mr. Sreenivas Murthy
Latest Miracles:
- “ఎవరైనా సరే బాబా ని పట్టుకోవాలే కానీ వేరెవరూ ఏం చెయ్యలేరు.”
- నా కంట బడటానికి నా జీవితం మారిపోటానికి బాబాయే చేసిన మిరాకిల్ ఆ ప్రకటన ఆ పేపర్ లో పడటం.–Audio
- తల పైకెత్తి చూస్తే ఆయన మరెవరో కాదు, సాక్షాత్తూ ‘శ్రీసాయిబాబా’యే!
- నా బాబా యే కేప్టెన్ రోడ్రిగుజ్ రూపంలొ వచ్చి బిడ్డనూ నన్నూ కాపాడారని—Audio
- టికెట్స్ లేని ట్రైన్ లో కూడా బెర్త్ లు ఇప్పించిన బాబా …..!
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments