నా బాబా యే కేప్టెన్ రోడ్రిగుజ్ రూపంలొ వచ్చి బిడ్డనూ నన్నూ కాపాడారని—Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్

మహరాజ్ కీ జై.

This Audio Prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-145-2911-నా బాబా యే కేప్టెన్ రోడ్రిగుజ్ 3:36

నేను నా నర్సుని ఎమర్జన్సీ సర్వీసెస్ నంబరు 911 పిలవమనీ, బిడ్డని పిల్లల ఆసుపత్రికి పంపించమనీ ఆదేశించాను. కొన్ని నిముషాల తర్వాత అంబులెన్సు వచ్చింది.

సాధారణం గా రోగిని దగ్గరలోని ఆసుపత్రికి తీసికుని వెళ్లి అక్కడనుండి బిడ్డని పిల్లల ఆసుపత్రికి బదిలీ చేస్తారు.

కానీ దగ్గరలోని ఆసుపత్రిలో పిల్లల విభాగం లేదు. కానీ అంబులెన్స్ తో వచ్చిన అగ్నిమాపకాధికారి పేరు కేప్టెన్ రోడ్రిగుజ్. వారంతా వచ్చి బిడ్డని చూసారు.

బిడ్డ డయాబిటీస్ తో బాధ పడుతూ వున్నందువలన బిడ్డని వీలయినంత తొందరగా పిల్లల ఆసుపత్రికి తరలించమని కేప్టెన్ రోడ్రిగుజ్ ని కోరాను.

చాలా ఆశర్యంగా ఆయనందుకు అంగీకరించారు. బిడ్డ పరిస్తితి ఆందోళన కరంగా వుండడంతో బిడ్డని పిల్లల ఆసుపత్రికి విమానంలొ తీసికుని వెళ్లడం జరిగింది.

నేను నా కార్యాలయానికి వచ్చి తలుపులు మూసివేసి గుండేనిండుగా బాబా ముందు ఏడ్చాను.

బాబా దయకు బాబా కు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. చివరిగా నవ్వుకున్నాను, ’బాబా నాకెప్పుడూ తెలుసు నీకన్నింటిగురించీ అన్నీ తెలుసు,

కానీ నాకు నువ్వు అమెరికన్ ఇంగ్లీషు మాట్లాడగలవని తెలియదు, నువ్వు బిడ్డని ’షిప్ ద చైల్డ్’ అనే దాకా’

ఒక గంట తర్వాత నేను బిడ్డ వున్న ఆసుపత్రికి ఫోను చేసాను. కేట్ స్కాన్ మరియూ ఇతర పరీక్షలు చేసిన తర్వాత బిడ్డ ఆరోగ్యం నిలకడగా వుందని వారన్నారు.

అక్కడి డాక్టరు నన్నడిగారు ’డాక్టరు! మీరాబిడ్డకి దయాబిటిస్ అని ఎలా కనుక్కున్నారు?’ అని. ’ఓహ్ అది దైవ ప్రమేయం’ అని నేను సమాధానమిచ్చాను.

ఆమె నేను పిచ్చిదాన్నేమొ అనుకుని ఫోనుని పెట్టేసింది. ఆ తర్వాత సీనియర్ వైద్యులందరూ అదే ప్రశ్న నన్నడిగారు,

అందరికీ నా సమాధానం ’దైవ ప్రమెయమనే’. వాళ్ళు విసిగిపోయిఫోను పెట్టేసేవారు. కానీ నాకు తెలుసు బిడ్డకి రోగనిర్దారణ్ చేసింది బాబా యేనని.

చివరిగా బిడ్డని ఆసుపత్రికి తీసికుని వెళ్లిన అగ్నిమాపక శాఖకి ఫోను చేసి కేప్టెన్ రోడ్రిగుజ్ ని పిలవమనీ, బిడ్డని సకాలంలో ఆసుపత్రికి చేర్చినందుకు కృతజ్ఞతలు చెప్పాలని అడిగాను.

’మేము బిడ్డని ఆసుపత్రికి తీసికెళ్లిన మాట వాస్తవమే కానీ, కేప్టెన్ రోడ్రిగుజ్ పేరుగల ఉద్యోగెవరూ ఇక్కడలేరు’ అని వారు సమాధానమిచ్చారు.

నేను ఖచ్చితంగా ఆయన పేరుని చూసాను, చార్టులో ఆయన పేరు వ్రాసాను.

అందుకే నిర్దారించుకోవడానికి నర్సుని అడిగాను, ఆమె కూడా అతను కేప్టెన్ రోడ్రిగుజ్ నే నని చెప్పింది.

అప్పుడు నాకర్దమైంది ’నా బాబా యే కేప్టెన్ రోడ్రిగుజ్ రూపంలొ వచ్చి బిడ్డనూ నన్నూ కాపాడారని’. బిడ్డ కోలుకుని ఆసుపత్రినుండి విడుదలైన తర్వాత ఆ విషయమై ఎన్నో ప్రశంసలూ వెలువడ్డాయి,

కానీ ఈ ప్రశంసలన్నీ బాబా కే చెందాలి కదా!

విన్నీ చిట్లూరి ద్వారా వ్యక్తీకరణ.
అనువాదము, సేకరణ:
సాయిబాబా చాగంటి
csaibaba@gmail.com
whatsapp 7033779935
Voice call: 9437366096.

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles