కాలువలో పడబోవు భక్తుని కాపాడుట–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్

మహరాజ్ కీ జై!!

This Audio Prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-144-2911-కాలువలో పడబోవు భక్తుని 4:04

1935 నవంబరు 20వ తేదీన తెల్లవారు జామున తెనాలిలో గుర్రపు బండిపై రైల్వే స్టేషనుకు రేపల్లె వెళ్ళుటకు వెంకటేశ్వర్లుగారు వచ్చుచుండిరి అప్పుట్లో విద్యుత్ వీధి దీపములు లేవు.

చీకటిలో బండి వచ్చుచుండ బండి వెనుక కొంత దూరము నుండి ఎవరో “ఏయ్ బండి! ఆపు ఆపు, బండీ! ఆపు ఆపు” అని కేకలు వేయుచుండెను.

రైలు వచ్చు సమయమగుచున్నందున బండివాడు జట్కా బండిని ఆపక వేగముగా పొనిచ్చుచుండెను.

దారిలో కాలువపై మూడు వంతెనలు యున్నవి. బండి మొదటి వంతెన ఎక్కినది.

ఇంతలో ఆ అరచిన అతనే బండి కుడిప్రక్క చక్రమును గట్టిగా పట్టుకొని బండివానిపై కేకలు వేయుచు “బండిని అపుమని కేకలు వెయుచున్నను బండిని ఆపలేదేమి? నీకు నా మాటలు వినిపించలేదా? నూలువాసిలో ప్రమాదము తప్పినది” అని అనెను. ఆ గుఱ్ఱపు బండికి యున్న చక్రము ప్రక్క యుండు శాయి మేకు ఊడిపోయినది.

అందువలన చక్రము చివరకు జారివచ్చి క్రిందపడిపోవుటకు సిద్దముగా యున్నది.

బండితోపాటు పాటు గుఱ్ఱము, లోపల మనుష్యులు కాలువలోపడి యుండేడివారు.

ఎందుకు యింత అజాగ్రత్త అని ఆ వ్యక్తీ బండివానిని చీవాట్లు పెట్టినాడు.

ఆది విని బండి నుండి క్రిందకు దూకి నిలచియున్న వెంకటేశ్వర్లుగారు అదంతయు చూచి, తమకు కాపాడిన వాని వంక చూచినాడు.

వ్యక్తీ ఎట్లుండెను? నెరసిన మాసిన గడ్డముతో, ముడతలు పడిన ముఖము, భుజముపై అతుకుల బొంత, మోకాలు జారని చింపిరిపంచతో యుండెను. అతను వెంకటేశ్వర్లుగారితో “బాబూ! భయము లేదు. గండము గడచినది. ఇంక నేను వెళ్ళి రానా!”

అని అనుచు ఆ వ్యక్తి ఆ చీకటిలోనే వంతెన దిగి వెళ్ళి పోయినాడు.

అప్పటి వరకు అచేతనముగా నిలిచి యున్న వెంకటేశ్వర్లుగారు అలా తన్ను రక్షించిన వ్యక్తికి కృతజ్ఞత చెప్పలేదు.

అతను ఎవరు అనువివరము తెలుసుకోనలేదు. బండిని వదలి కాలినడకన రైల్వే స్టేషనుకు వెళ్ళుచుండెను.

అప్పుడు జరిగిన సంఘటన గుర్తుకువస్తూ తన్ను రక్షించిన వ్యక్తి ఎవరు?

ఆ చీకటిలో బండి శాయిమేకు పోవుట ఎట్లు గుర్తించెను.

దూరమునుండి బండి నాపుమని కేకలిడిన వాడు వేగముగా పరుగెత్తుచున్న గుర్రపు బండిని ఎట్లు చేరగలిగి చక్రము పడకుండా చేతితో ఆపెను.

అతను సాధారణ వ్యక్తి కాదు. నా తండ్రి యైన బాబాయే అనుచు “బాబా” అని ఎలుగెత్తి కేకవేసిరి వెంకటేశ్వర్లుగారు. ఈ లీల బాబా దేహమును చలించిన 17 సంవత్సరములకు జరిగినది.

ఇచ్చట సర్వజ్ఞత్వము చీల ఊడివుండుట, సర్వవ్యాపకత్వము బండి చెంత యుండుట, బండిని పట్టిఆపు సర్వశక్తి మంతమూ బాబా చూపెను.

శ్రీ వెంకటేశ్వర్లుగారు ఆర్తభక్తుడు. బాబా యందు పరిపూర్ణమైన భక్తి కలవాడు. అలా నన్ను కాపాడుట సాయికే సాద్యము. అట్టి సాయి స్వయముగా ప్రత్యక్షమైవచ్చి రక్షించిన గుర్తించలేక పోతినే యని చింతించినాడు వెంకటేశ్వర్లుగారు,

సరస్యశరణా గతులైన వారిని బాబా వారు కోరకయే, అడుగకయే తామే స్వయముగా అదుకొనగలరని నిదర్శనము. ఈ లీల చెప్పుచున్నది.

అల నాకు తాత్యాకోతే పాటీలు గుర్రపు బండి పడకుండా బాబా ఎందుకు రక్షించలేదు.

వారి చర్యలన్నీ ఒకేపనికి ఒకే రీతిలో యుండవు. సృష్టి విధానమును పాటించుచు, సమయ సందర్బములను బట్టి తమ మహత్తును ఇట్లు బాబా చూపుదురు.

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles