“విషకీటకము నాయనా జాగ్రత” అని శ్రీ సాయి ముందుగా వెంకటేశ్వర్లుగారిని హెచ్చరించుట–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


This Audio Prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-197-2612-విషకీటకము 2:54

శ్రీ వేమూరు వెంకటేశ్వర్లుగారు 1941 లో రేపల్లెలో స్వగృహమును నిర్మించుకొని అందులో నివాసముండుచుండిరి. వీరు ప్రతి గురువారం శ్రీ సాయి సహస్రనామ పూజచేసి ధ్యానము చేయువారు.

1942 మార్చి 21 వ తేదీ రాత్రి గం.12-00 ల వరకు సాయిబాబాను స్తుతి చేయుచు కొంత సేపు ధ్యానము చేసి నిదురించినారు.

వీరు మరోరోజు తెల్లవారాక మునుపే నిదుర నుండి బాబా స్మరణతో లేచెను. ఇంతలో ఒక బుడబుక్కలవాడు భిక్షకై వాకిలి చెంత నిలిచెను.

వీరు అతనికి భిక్షనిడ “విషకీటకము నాయనా జాగ్రత” అని అనుచు హెచ్చరించుచు అతడు వెళ్ళెను.

వెంకటేశ్వర్లుగారు పటము ముందు కూరుకొని ధ్యానము చేయుచుండగా ఎదుటనున్న బాబా పటము నుండి శ్రీ సాయిబాబా స్వయముగా నడచి వచ్చి వీరి మెడలో ఒక గులాబిపుష్పముల దండ వేయుట వెంకటేశ్వర్లుగారు చూచి ఆనందించిరి. ఆరోజు రాత్రి బాబాను కీర్తించుచు వీరు నిదురించిరి.

తెల్లవారు ఝామున నాలుగు గంటల సమయమున వెంకటేశ్వర్లుగారు నిదురలోనే “బాబా” అనుచు చేతిని ప్రక్కకువైచిరి.

వారి అరచేతిలో సూది గ్రుచ్చుకున్నట్లయి నొప్పితో “బాబా” అని కేక పెట్టి వీరు లేచిరి. ఆ చేయి వచ్చినది.

మంటతో బాధపెట్టసాగెను. లాంతరు తెచ్చి అచ్చట అంతా వెదకినా ఆకుట్టినదేదో కనిపించలేదు.

వారు ఏ పరిస్థితులలో యున్నా వారి నోటినుండి వచ్చునది ‘బాబా’ అను మాటయే కాని మరేమియు రాదు. వెంకటేశ్వర్లుగారిది ఏమి అదృష్టము. మరుసటిరోజు ఉదయం గం.5-00 లకు లేచి స్నానము చేసి బాబా పటము ముందు కూర్చొని

“నా తండ్రీ! నా మెడలో పూలమాల వేసినది ఇందులకా” అని బాధపడుచుండ, శ్రీ సాయినాధుడు “అవును. రక్షరా! రక్ష” అను మాటలు వినిపించినవి.

ఆ మాటలు వినగానే ఇచ్చట యున్నది ఒట్టిపటము కాదు. అనగా ఆపటం జడమైనది కాదు.

శ్రీ సాయి బాబాయే. అనగా ఆ పటములో బాబా రూపము చలన శక్తి కలది. భౌతికరూపమెట్లో ఈ పటరూపము అంతే.

ఆ పటము నుండి వచ్చు మాటలు అనగా బాబా పలికిన పలుకులు నేను స్వయముగా విన్నాను అని వెంకటేశ్వర్లు తలచిరి.

శ్రీ ఆలూరు గోపాలరావు గారి విరచిత శ్రీ సాయి బాబా సత్ చరితము

సంపాదకీయం: సద్గురులీల (డిసెంబర్. – 2014)

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles