Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
- Mir-195-2512-శ్రీ పేరూరి శర్మగారు 2:52
ఈ పేరూరి శర్మగారు ఆ డబ్బుతో పుస్తకము ముద్రించక స్వంతమునకు వాడుకొనెను.
వాస్తు పద్మాకరము ముద్రణ జరుగుటలేదు. ఏవో అడ్డంకులు వచ్చుచుండెను. తన మిత్రుడైన రావుగారికి ఈ విషయమంతయు చెప్పెను.
అప్పుడు మిత్రుడు “శ్రీ సాయి ఇచ్చిన సొమ్ము రూ.200/- లు ఎవరి సొమ్మని దిగమ్రింగితివి. బాబా ప్రుస్తకముద్రణకు 200/- లు జొన్నలగడ్డసత్యనారాయణ ఇస్తాడని చెప్పెను కదా! మరచితివా ?
ఆ తండ్రి వింత చర్యలు నీకు అంతుబట్టనివి. శ్రీ సాయిసత్యవ్రతము అచ్చుకానంతవరకు నీ వాస్తు పద్మాకరము ముద్రణకాదు.
శ్రీ సాయి తన సొమ్మును ఎవరియొద్దనైనా నిక్కచ్చిగా పుచ్చుకొనును. కనుక నీవద్దయున్న నిల్వ కాగితములోతో ఈ పుస్తకమును ముద్రించుము.
ఇది ముద్రణ అయినా తరువాత ఆ వాస్తు గ్రంధము ముద్రణ అగును” అని శ్రీ సాయి విధాన మనగా ఎట్టిదో విశదపరచినాడు రావుగారు.
శర్మగారు వెనుకాడక ముందుసాయి గ్రంధము పూర్తిచేయగా వెంటనే వాస్తు పద్మాకరము పూర్తియైనది. బాబా మాటను తూ .చ. తప్పక పాటించు వారికి ఎట్టి ఇబ్బందులుండవు .
అనుకున్నది కాకపోవుట యన్న బాబా చెప్పినమాటను పాటించకపోవుటయే . మనకు బాబా ఎట్లు చెప్పననుకొనరాదు.
ఈ గ్రంధములో చెప్పిన, చూపిన లీలలన్నీ మన సమస్యలకు పరిస్కారం కొరకే. ఈ రచనల పారాయణ ఫలితము అదే . ఈ విషయములన్నియు శ్రీ వేమూరి వెంటేశ్వర్లుగారి ద్వారా బహిర్గతమయినవి.
మొదటిలో బాబాను దూషించిన ఈ పేరూరి శర్మ గారు నేడు భక్తుల యందు మేటిభక్తుడైనాడు.
ఈ శర్మ ఎన్ని జన్మల నుండి బాబాతో యున్నవాడో? ఏమో ?
“నా యందు భక్తి కలిగి , నన్ను సేవించెడి వాడు కారణాంతరములచేత నన్ను మరచినను నేను అతనిని మరువను . విడువను . అతడు నావాడే సుమా!” అని బాబా నిక్కచ్చిగా చెప్పిన వాక్యాము అని వేమూరు వెంకటేశ్వర్లుగారు ఇచ్చట మనకు గుర్తు చేయుచున్నారు .
ఇప్పుడు బాబా భక్తులు అపార మిత్రులైరి. వారి మనోభావములను ఎప్పుడో తాను పసిగట్టినట్లు 1960 నాటికే శ్రీ సాయిభక్తులలో శ్రీ వేమూరి వెంకటేశ్వర్లుగారు చెప్పిన అప్పటి మాటలు మన అనుమానములు తీరుటకు ఒకసారి మననము చేసుకుందాము .
శ్రీ ఆలూరు గోపాలరావు గారి విరచిత శ్రీ సాయి బాబా సత్ చరితము
సంపాదకీయం: సద్గురులీల ( అక్టోబర్ – 2014)
Latest Miracles:
- పుస్తక ముద్రణకు చెప్పిన ప్రకారము బాబా ధనమును సమకూర్చిరి–Audio
- సాయి మార్గములో పెద్దలు(శ్రీ నాంపల్లి బాబా, శ్రీ రామిరెడ్డి తాత)
- శ్రీ సాయిబాబా అనుగ్రహమునకు శ్రీ భరద్వాజ గారు పాత్రులగుట–Audio
- శ్రీ సాయి దత్తావతారం మూడవ బాగం – శ్రీ పాద శ్రీ వల్లభుడు, సాయి ఒక్కరే
- శ్రీ సాయిదాసుగారు నంధ్యాలనుండి శ్రీ శైలము ట్రాన్సఫర్ లోని బాబా లీల.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments