Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
- Mir-72-1105-బాబా వాక్కుచే క్షయవ్యాధి తగ్గుట 6:18
శ్రీ వెంకటేశ్వర్లుగారు పొందిన లీలలలో బాబా దర్శనమిచ్చి కాపాడుట, కలలో చెప్పుట, తమపటము నుండి మాట్లాడి రక్షించుట తెలుసుకున్నాము.
వారు ఊదీ తప్ప మరి ఏ ఔషధము ఎరిగినవారు కాదు.
బాబా తప్ప అన్యదైవము నాశ్రయించుటయు లేదు.
1954 లో అంటే మరెప్పుడో కాదుగదా! శ్రీ వెంకటేశ్వర్లుగారు స్వయముగా గ్రంధమున తెలిపిన లీల ఇది.
వారి భార్యకు ఆరోగ్యము సరిలేక దగ్గు వస్తూ యుండినది. క్రమముగా ఎడతెరిపిలేని దగ్గుతో కూర్చుండలేని స్థితికి చేరినది ఆరోగ్యము.
ఇది చూచి వీరి మిత్రులు శ్రీ సాయిసేవ వలన మీకు కష్టములు వచ్చుచున్నావని, సాయి భక్తులు కష్టముల పాలగుచుండిరని అనసాగిరి.
పూర్వాపరాములు తెలియక, ఏదో తెలిసినట్లు ఇట్టి ఉచిత సలహాలిచ్చువారు ఎప్పుడు వుందురు.
కష్టములు ఎందుకువస్తాయి? వాటి అంతటా అవి రావు. ఎవరో తెచ్చి వీరినెత్తిన పెట్టరు. భగవంతుని పని కష్టములను కలిగించుట కాదు.
ఎవరి కష్టములకు కారణము వారే. పరులెవరు కారణము కాదు.
శస్తముల ననుసరించి గత జన్మలలో మానముచేయు పాపకార్యములే ఇందుకు కారణమగుచున్నవి.
బాబా కూడా ఈ విషయము సాయిసచ్చరిత్ర 13 వ అధ్యాయములో భీమాజిపాటిలు క్షయవ్యాధి తో బాధపడుచు బాబా వద్దకు వచ్చినప్పుడు బాబా ఆ జబ్బు వాని గతజన్మలలోని పాపకర్మల ఫలితమని కనుక అతని విషయములో జోక్యం చేసుకొననని చెప్పిరి.
అంతకు ముందు భీమాజి
“ఓ భగవంతుడా! ఇక నీవెనాకిక దిక్కు! నన్ను కాపాడు” అని ప్రార్ధించాడు.
దానికి భగవంతుడు కాదురా కారణం, నీ గత జన్మ కారణమని ఖచ్చితముగా బాబా తెలియచెప్పారు.
అట్లనే 34 వ ఆధ్యాయములో పిళ్లే నారికురుపు వ్యాధితో బాధపడుచున్నప్పుడు గతజన్మ పాపములను అనుభవించి విమోచన పొందవలెను.
మనకష్టసుఖములకు మనకర్మయే కారణము అనియు విశదముగ బాబా చెప్పిరి.
అట్లే శ్యామా మరదలు ప్లేగుచే భాదపడు లీలలో బాబా శ్యామాతో “కర్మ యొక్క మార్గము చిత్రమైనది.
నేనేమి చేయకున్నను నన్నే(అనగా భగవంతుని) సర్వమునకు(కష్టములనన్నిటికి) కారణభూతునిగా(ఈ కష్టములను పెట్టువానిగా) నెంచెదరు.
అది అదృష్టమును బట్టి (అనగా గతజన్మ లో మీరు చేసిన దాని ఫలితమును బట్టి) వచ్చును” అని అవగాహన కలిగించిరి.
శాస్తములు తెలియనివారు, మాయకు లోబడి జీవించు వారు, అజ్ఞానజనితులై అసలైన కర్మ సిద్ధాంతము తెలియక శ్రీ వేమూరి వెంకటేశ్వర్లుగారిని అన్నట్లే సాయి భక్తులు కష్టమ్ముల పాలగుచున్నారనుట అవివేకపు మాటలు.
బాబాను ఆశ్రయించిన వారికే ఎరుక.
బాబాను ఆశ్రయించిన భక్తులనెవరినైనా ఈ విషయమడుగుడు.
బాబా ఎప్పుడు అందరి మేలునే కాక్షించువారని, పెనుకష్టములను కూడా పారద్రోలుదురని, కర్మలను కూడా సంక్షయము చేసి కాపాడుదురని గంటాపదంగా చెప్పుదురు.
ఇలా అవాకులు-చెవాకులు ఆది పాపమును మూటకట్టుకొనవద్దని, సాయిభక్తులను భయభాంత్రులకు గురిచేయవద్దని మనవిచేసుకొనుచున్నాను.
ఇట్టి సలహానిచ్చువారి మాటలను ఏమాత్రము శ్రీవేమూరి వెంకటేశ్వర్లుగారు పట్టించుకొనలేదు.
వారి భార్య ఈదగ్గుతో ఎముకలగుడైనది. బరువు కూడా తగ్గినది.
డాక్టరులు ఆమెను పరీక్షించి ఆమెకు క్షయవ్యాధియని, ఊపిరితిత్తులలో ఒకటి చెడిపోయినదని చెప్పిరి.
ది 1-11-1955 వ తేది గుంటూరుకు ఆమెను తీసుకొని వెళ్ళి కుగ్లరు ఆసుపత్రిలో ఎక్సరే తీయించి, ఆమెను పిల్లల వద్దయుంచి వీరు తిరిగి రేపల్లెవచ్చిరి.
వారు ఆ రాత్రి బాబా పటము ముందు కూర్చిండి బాబాను పరిపరివిధముల ప్రార్ధించుచు, ఈవయస్సులో నన్ను ఏడ్పించవలదని నిష్ఠురములాడుచు, భార్యను కాపాడుమని అర్ధించుచు నిదురించినాడు.
ఉదయము స్నానము చేసి బాబా పటము ముందు ధ్యానములో కూర్చొనుండ
‘ఏమిట్రా! టి.బి.యా! టి .బి. అని ఎవరన్నది?” అని వారి ఎదుటయున్న పటము నుండి శ్రీసాయి బాబా చెప్పిరి.
మరుసటిరోజు ఉదయము గుంటూరు నుండి ఎక్సరే రాగా దానిని బాబా పాదముల చెంతయుంచి “బాబా! నీమాటల యొక్క నిజమిప్పుడు తెలియునులే” అని అనుచుండగా వీరి భుజముపై తాకినట్లనిపించింది.
(బాబాయ్ అట్లు తాకిరి). సుగంధముల వాసనలు ఇల్లంతయు వయాపించినవి.
(ఈవాసనలు బాబా అచ్చటయున్నట్లు గుర్తు)” వెంకటేవారలుగారు ఆ ఎక్సరేను తీసుకొని డాక్టరు వద్దకు వెళ్లిరి.
ఆ డాక్టరు ఎక్సరే చూచి ఆశ్చర్యము నొందుచు ఇందులో ఊపిరితిత్తులు బాగానే యున్నవని అనుచు, డాక్టరు వెంకటేశ్వర్లుగారి ఇంటికి వచ్చి ఆమెను పరీక్షించి ఆమె లంగ్సులో ఎట్టి దోషములేదని చెప్పిరి.
డాక్టరు ఆశ్చర్యము నొందుటేకాక” మీరు సాయిబాబా భకుట్లేయని విన్నానేకాని ఇప్పుడు ప్రత్యక్షముగా మీ భక్తుయిని చూచాను.
మీకు వీరే మందు ఎందుకు” అని చెప్పి వెళ్ళిపోయినాడు.
ఎంత అద్భుతమైన లీల అది. బాబా తన ప్రతిభను ఎట్లు చుపిరో చూచితిమి కదా!
మనము వెంకటరర్లుగారిలా ఎందుకు పరిపూర్ణముగా బాబాను ఆశ్రయించలేకపోవుచున్నాము? విచారించుకొనవలెను.
శ్రీ ఆలూరు గోపాలరావు గారి విరచిత శ్రీ సాయి బాబా సత్ చరితము
సంపాదకీయం: సద్గురులీల (డిసెంబర్. – 2014)
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- స్వామిజీ ఎట్టి ఆహారము తినునో బాబా చెప్పుట–Audio
- నాస్తికులైన సభాగారిని మృతువు నుండి బాబా కాపాడుట,తెలుగు రచయత–Audio
- గుండె ఆపరేషన్ చేసిన బాబా–Audio
- బాబా పటములో పాదముల నుండి గంగా, యమునా జలములు వచ్చుట–Audio
- అట్లు చేసిన శ్రీసాయిబాబా నీ కనుసన్నల మెలుగు సమయము రాగలదు అని చెప్పిరి–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments