అట్లు చేసిన శ్రీసాయిబాబా నీ కనుసన్నల మెలుగు సమయము రాగలదు అని చెప్పిరి–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్

మహరాజ్ కీ జై.

This Audio Prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-151-అట్లు చేసిన శ్రీసాయిబాబా 2:34

ఇప్పుడు పూలమ్మయను సాయి అంకిత భక్తురాలుని పరిచయము చేసుకుందాము.

ఈమె పూర్తి పేరు చుండూరు కామేశ్వరమ్మ “వీరిది గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణమునకు దగ్గర గల మునిపల్లె గ్రామము.

ఆమె తల్లిదండ్రుల చెంతయుండగా ఆల్ ఇండియా సాయిసమాజ్ అధ్యక్షులైన శ్రీ బి.వి.నరసింహ స్వామి వారు 1944లో ఆంధ్రప్రదేశ్ లో సాయితత్వ ప్రచారము చేయుచు చీరాల, బాపట్ల, రేపల్లె, తెనాలి, విజయవాడ పట్టణములకు వచ్చిరి.

ఆ సమయములో మునిపల్లె గ్రామములోని శివరామయ్య గారి ఇంటికి వచ్చిరి.

శివరామయ్య గారి కుమార్తైయే కామేశ్వరమ్మ నరసింహస్వామిగారు నిరాడంబరముగా ఎప్పుడు తన చెంత ఒక బాబా పటమును వుంచుకొనెడివారు. యిచట కుడా ఆపటమును పెట్టి సత్సంగము చేసిరి.

సత్సంగములో యున్న కామేశ్వరమ్మను శ్రీనరసింహాస్వామిగారు తదేక దృష్టితో వీక్షించి ఆ బాలికను ఆశీర్వదించి, బాబా పటమును ఒకటి బాలికకు యిచ్చి “బిడ్డా!” అని సంబోధిస్తూ ఈ పటమును తదేకముగా చూచుచుండుము.

శ్రీ సాయి నామమును తదేకముగా స్మరింపుము. ఒక అగరుబత్తిని వెలిగించి అది పూర్తియగువరకు ఆ పటము నందలి మూర్తిని ధ్యానింపుము.

అట్లు చేసిన శ్రీసాయిబాబా నీ కనుసన్నల మెలుగు సమయము రాగలదు అని చెప్పిరి.

ఇదే సాధన, నరసింహస్వామిగారు కామేశ్వరమ్మగారి మనసును బాబా యందు ఏకాగ్ర పరచుటకు సాధన చూపిరి.

ఆమె వారు చెప్పినట్లు సాధనలో సాయి అనుగ్రహమునకు పాత్రురాలైనది.

తరువాత కాలములో ఈమె బాబా అంకిత భక్తురాలై బాబా నుండి అద్బుత మహిమలను పొందినది.

సాధనలేని వారు ఇలా ముందుకు వెళ్ళలేరు. బాబా చెప్పినట్లు తీసుకో, తీసుకో అంటే ఎవరు తీసుకోవటంలేదు. తేతే అంటున్నారు అన్నట్లు యున్నది భక్తులస్థితి.

అందువలననే ఇప్పటి వారు అంకిత భక్తులుకాలేక పోవుటకు ఈ సాధనలోపమే.

ఈ విధముగా బి.వి.నరసింహస్వామి వారి ద్వారా కామేశ్వరమ్మగారు సాయినాశ్రయించుట జరిగినది.

సంపాదకీయం: సద్గురులీల ( మార్చి – 2014)

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “అట్లు చేసిన శ్రీసాయిబాబా నీ కనుసన్నల మెలుగు సమయము రాగలదు అని చెప్పిరి–Audio

సాయిరాం . చుండూరు

చుండూరు కామేశ్వరమ్మ గారి ఫొటొస్ వేసి ఉంటే బాగుండెది
సాయిరాం . చుండూరు

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles