“ఎవరైనా సరే బాబా ని పట్టుకోవాలే కానీ వేరెవరూ ఏం చెయ్యలేరు.”



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


నా పేరు సత్య ప్రసాద్. నేను ఒక పేరున్న బ్యాంకు లో మేనేజర్ గా చేసి రిటైర్ అయ్యి షిరిడి లో సెటిల్ అయ్యాను.

1984 వ సంవత్సరంలో మా అమ్మ గారు మా అన్నయ్య షిరిడి వచ్చి దర్శనం చేసుకొని “సాయి సచ్చరిత్ర” తీసుకొచ్చారు.

నేను అంతకముందు మూడు సార్లు షిరిడి వెళ్ళడానికి ప్రయత్నం చేశాను కానీ వెళ్లలేక పోయాను.

అప్పుడప్పుడు టీవీ లో వచ్చే బాబా సీరియల్స్ చూస్తుండే వాడిని (హిందీలో).  ఆ తర్వాత హిందీలో వచ్చిన ”షిరిడి కే సాయి బాబా” సినిమా చూసాను.

నేను ఆఫీస్ కి వెళ్లి వచ్చేటప్పుడు రాజమండ్రిలో దారిలో వుండే బాబా గుడికి అలవోకగా వెళ్ళేవాడిని. దర్శనం చేసుకొని బయటికి వచ్చేవాడిని.

1994 లో ఆర్ధికంగా ఏర్పడిన తీవ్రమైన ఇబ్బందుల వలన బాబా గుడికి వెళ్లి ఆలా కూర్చుంటూ ఉండేవాడిని.

మనస్థిమితం లేక మనశ్శాంతి కోల్పోయి బాబా గుడిలో అలా ఏకాంతంగా కూర్చోవడం అలవాటు అయ్యింది.

ఇలాంటి పరిస్థితుల లో చుట్టూ చుట్టాల, బంధువుల, స్నేహితుల ప్రవర్తన, చర్యలు మూలంగా ఒక విధమైన వైరాగ్యం అనిపించింది.

నేను సాయం చేశాను. వాళ్ళు ఇలా మొహం చాటేస్తున్నారు ఎందుకు నాకు మళ్ళీ సాయం కావాలంటే చేయడం లేదు అనుకునేవాడిని. ఆ తర్వాత తర్వాత నేను తెలుసుకున్నాను ప్రతిఫలం ఆశించకుండా చేసేది సాయం అని.

నేను రాజమండ్రి లో పనిచేస్తున్నప్పుడు నాతో పాటు పనిచేస్తున్నాయన వాళ్ళు పుట్టపర్తి సాయి బాబా భక్తులు.

పుట్టపర్తి నన్ను కూడా వాళ్లే టికెట్ బుక్ చేసి తీసుకు వెళ్లారు. అక్కడికి వెళ్ళాక స్వామి అందరికీ దర్శనం ఇవ్వడం కోసం బయటికి వస్తున్నారని అంటే అందరమూ ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నాము.

ఆ సమయంలో వారి వారి సమస్యలు ఒక కాగితం పైన రాసి ఆయనకీ అందిస్తే  ఆ సమస్యలకి పరిష్కారం ఆయనే చూస్తారని, అక్కడ అందరి నమ్మకం.

ఆ సంగతి నాకు తెలియదు. నేనేమీ రాయలేదు. అందరు కాగితాలు పట్టుకోని మరీ కూర్చున్నారు.

నేను ”ఏమిటవి” అని అడిగాను. నన్ను అక్కడకి తీసుకొచ్చినాయన నాకు విషయం చెప్పాడు.

నేను వెంటనే ఒక కాగితం తీసుకొని  ”నాకు సమస్యలు ఉన్నాయి. ఆ సంగతి సర్వాంతర్యామి అయిన మీకు తెలుసు అని మీ పాదరేణువు” అని రాసి, నేనా కాగితం చేత్తో పట్టుకున్నాను.

స్వామి వచ్చారు. నాకు అటు పక్కన ఇటు పక్కన ఉన్నవాళ్ళ కాగితాలు తీసుకొని వెళ్లి పోతున్నారు.

నేను చిన్నబుచ్చుకున్నాను. వెంటనే ఆయన మళ్ళీ తిరిగి వచ్చి నా చేతిలో ఉన్న కాగితం ఆయన చేతిలోకి తీసుకొని దాన్ని విప్పి కూడా చూడలేదాయన వెంటనే నా చేతిలో పెట్టేసాడు.

నేనే ఆ కాగితం విప్పి చూసుకున్నాను. అందులో ఆయన సంతకం ఉంది. నేను రాసిచ్చిన కాగితం అది. నేను రాసిందేమి లేదు అందులో. నేనది చూసి ఆశ్చర్య పోయాను. నా కళ్ళంబట నీళ్లు ధారగా కారిపోయాయి .

రాజమండ్రిలో భజనలకి వెడుతుండేవాడ్ని. షిరిడి సాయిబాబా CTRI భజన బృందం ద్వారా నేను వెడుతుండేవాడ్ని.

CTRI లో బాబా గుడిలో క్రమంగా భజనలు, బాబా హారతులు, పారాయణలు అవీ జరుగుతుండేవి.

అక్కడ ఒకాయన BSNL లొ పని చేస్తారు. ఆయన మాకు గౌరీ శంకర్ స్వామి అన్న గురువు గారిని పరిచయం చేసారు. సాయంత్రం హారతి, రాత్రి హారతి చేసేవాళ్ళం.

ఇంట్లో నా భార్య కూడా హారతులు చేస్తుండేది. పారాయణలు తనకీ అలవాటు అయింది. ఆ తర్వాత నాతో పాటు భజనలు చేసే ఆయన ఒకతను భరద్వాజ మాస్టారు గారి శిష్యుడని పరిచయం చేసారు.

ఆయన ఎక్కువగా కర్మ సిద్ధాంతం గురించి  చెబుతుండేవారు. ఎవరికైనా కర్మ ధ్వంసం అవ్వనిదే మహాత్ముల చెంతకు చేరమని ఆయన చెబుతుండేవారు.

కర్మలంటే గురుచరిత్రలో సత్య వంతుండి కథ ఎక్కువగా ఆయన చెప్పేవారు. గురుచరిత్ర పారాయణం చేయమనేవారు. ఎవరైనా సరే బాబా ని పట్టుకోవాలే కానీ వేరెవరూ ఏం చెయ్యలేరు అనేవారు.

The above miracle has been typed by: Mrs. Rajarajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles