అంతర్యామి, హేమాడ్ పంత్—Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!

This Audio has been Prepared By Mr Sreenivas Murthy

  1. 1-antaryami hemadpanth By Sreenivas Murthy 2:49
ఒక గురుపూర్ణిమ రోజున హేమాడ్ పంత్ సకుటుంబంగా షిరిడీకి వచ్చాడు.  రెండు రోజులలోనే అతని దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చయిపోయింది.  చేతిలో పైసా లేకుండా అయిపోయింది.
ఒకరోజు తరువాత నేను, మోరేశ్వర్ ప్రధాన్ షిరిడీ చేరుకున్నాము. ప్రధాన్ దగ్గిరకూడా తొందరలోనే డబ్బంతా ఖర్చయిపోయింది.  మరునాడు శ్రీసాయిబాబా ప్రధాన్ ని దక్షిణ అడిగారు.
“నావద్ద పైసా లేదు” అని ప్రధాన్ చెప్పారు.  అపుడు బాబా “అన్నా సాహెబ్ దగ్గరకు వెళ్ళి(హేమాడ్ పంత్) అడిగి పట్టుకురా” అన్నారు.  హేమాడ్ పంత్ వద్ద కూడా డబ్బు లేదని ప్రధాన్ కి తెలుసు.
అయినా బాబా ఆజ్ఞను తూచా తప్పక ఆచరించాలని మరొకమాట మాట్లాడకుండా ప్రధాన్ అన్నా సాహెబ్ వద్దకు వెళ్ళి డబ్బు అడిగాడు.
ప్రధాన్ తనని డబ్బు అడగగానే అన్నా సాహెబ్ ఆశ్చర్యపోయాడు.  “నా వద్ద డబ్బుందని నీకెలా తెలుసు” అని హేమాడ్ పంత్ ప్రశ్నించి, ఇపుడే బాంద్రానించి ఒక వ్యక్తి వచ్చి నాకు డబ్బు ఇచ్చాడు. అని చెప్పాడు.
ప్రధాన్ హేమాడ్ పంత్ ను కలుసుకోవాడానికి కొద్ది నిమిషాల క్రితమే జరిగిన ఈ విషయం ఎవరికీ తెలీదు. బాబా దివ్యదృష్టిలోని రహస్యం ఎవరికి  తెలుసు?
రక్షకుడు:
ఒక ముస్లిం భక్తుడు శ్రీసాయిబాబా వద్దకు వెళ్ళాడు.  ఆ వ్యక్తికి ఒక బ్రాహ్మణ మిత్రుడు ఉన్నాడు.
అతనికి మరణ శిక్షపడింది. ఆ భక్తుడు తన స్నేహితుని శిక్షనించి తప్పించమని బాబా ను వేడుకున్నాడు.
బాబా అతనిని ఆశీర్వ దిస్తూ “నాలుగు రోజులలో భగవంతుడు అతనినిని అనుగ్రహిస్తాడు” అన్నారు.  
బాబా చెప్పినట్లుగానే సరిగా నాలుగు రోజుల తరువాత ఆబ్రాహ్మణ మితృడు   అప్పీలు మీద, మరణ శిక్ష రద్దయ్యి విడుదల చేయబడ్డాడు. 
గణేశసాయి:
శ్రీచిదంబర్ గాడ్గిల్ గణేష్ మహరాజ్ భక్తుడు.  అతడు బాబా భక్తుడు కూడా. అతడు బాబాలో గణేశుడిని దర్శించేవాడు. వినాయకుని పూజించినట్లె బాబా ని కూడా పూజించాడు.
అతనిలో విఘ్నేశ్వరుని మీద ఎంత భక్తి ఉందో ధృఢపరచుకోవాలనుకున్నారు బాబా. ఒకసారి గాడ్గిల్ గారు బాబాను పూజిస్తున్నపుడు, బాబా అకస్మాత్తుగా “ఈముసలివాడు చాలా టక్కరి.
ఈ ముసలివానిని బయటకు తోలేయండి. నాఅసనం క్రింద ఎలుక ఉన్నదని చెపుతున్నాడు” అన్నారు.
శ్రీసాయిబాబా తన పూజని అంగీకరించారని తాను ఆయనని గణేశునిగా భావిస్తున్నట్లు తెలుసుకొన్నారని ఆభక్తుడు చాలా అనందించాడు.

సాయి బాబా …సాయి బాబా

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No :09704379333

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles