శ్రీ సాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – (16)దీనజనోధ్ధరణ (2వ.భాగం)



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

ముందు బాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి….

శ్రీ సాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – (16)దీనజనోధ్ధరణ (2వ.భాగం)

ఆంగ్లమూలం : లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి. నింబాల్కర్

తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు

ఒకసారి బాలాజీ పాటిల్ నెవాస్కర్ తన స్వగ్రామానికి తిరిగి వెళ్ళడానికి బాబాని అనుమతి కోరాడు.  సాయిబాబా “దగ్దుభావూకి జబ్బుగా ఉంది, అతని సంగతి చూసిన తరువాత వెళ్ళు” అన్నారు. దగ్దుభావు కుష్టువ్యాధితో బాధపడుతున్నాడు. బాలాజీ పాటిల్ అతని శరీరం మీద ఉన్న పుండ్లను, రసిని శుభ్రం చేసేవాడు. 

అతని శరీరం  నుండి వచ్చే క్రిములను కూడా తీసి శుభ్రంగా స్నానం చేయించేవాడు.  ఆవిధంగా కొంతకాలం సేవ చేశాడు.  ఆతరువాత దగ్దుభావూ చనిపోయాడు.  అంతా పూర్తయిన తరువాతే బాబా, బాలాజీకి స్వగ్రామం వెళ్ళడానికి అనుమతినిచ్చారు.

32వ.అధ్యాయంలో ఒక స్త్రీ, (ఆమ్గె ఇంట్లేి పేరు గోఖలే ) కాకా కేల్కర్ వద్దకు షిరిడీ వచ్చింది.  సాయిబాబా దర్శనం చేసుకొని ఆయన వద్ద మూడు రోజులు ఉపవాసంతో కూర్చోవాలని నిశ్చయించుకుంది.  అప్పుడు బాబా ఆమెతో “ఉపవాసం ఉండాలనే ఆలోచనను విరమించుకుని దాదాకేల్కర్ ఇంటికి వెళ్ళి బొబ్బట్లు చేసి, అతని పిల్లలందరికీ పెట్టి నీవు కూడా కడుపునిండా తిను” అని ఆదేశించారు.

విచిత్రమేమంటే ఆరోజు కేల్కర్ భార్య బహిష్టవడం వల్ల వంట చేయకూడని పరిస్థితి.  ఆవిధంగా బాబా ఆమెలో ఉపవాసం చేద్దామనుకున్న కోరికను తొలగించారు.  ఆ స్త్రీ బొబ్బట్లుతో వంట చేసి అందరికీ వడ్ఢించి తాను కూడా తింది.

ధనం గాని ఇతర దానాలు గాని ఎన్ని చేసినా అన్నదానానికి ఏవీ సాటిరావు.  చంద్రుడు లేకుండా నక్షత్రాలకు శోభ ఉండదు.  లాకెట్ లేకుండా హారానికి అందముండదు. (ఓ.వీ. 20)

మన దర్మశాస్త్రాలలో కూడా బీదవారికి, ఆకలిగొన్నవారికి అన్నం పెట్టి వారిని ఆదుకోమనే విషయం ప్రముఖంగా మరీ మరీ చెప్పబడింది. షడ్రుచులయిన తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదులలో ‘వరణ్’ (మంచి రుచికరమయిన మహారాష్ట్రుల వంటకం)యొక్క రుచి శ్రేష్టమయినదయితే ఆకలిగొన్న వారికి ఆకలి తీర్చడం అంతకన్నా శ్రేష్ఠమయినది.  గోపురం లేని శిఖరం శోభించదు.  కలువలు లేకుండా చెరువుకి అందం రాదు.”  (ఓ.వీ. 21).

“మధ్యాహ్నం 12 గంటలయేటప్పటికి ఎవరూ ఆకలికి తాళలేరు.  మనం ఆకలికి తట్టుకోలేనట్లె అవతలివాడు కూడా ఆకలితో ఉంటాడని ఎవడయితే అర్ధం చేసుకుంటాడొ అతడు పుణ్యాత్ముడు.”  (ఓ.వీ. 14)

“సమయా సమయాలలో అతిధులు వచ్చినపుడు వారిని అన్నదానంతో సుఖపెట్టడం గృహస్థుల ధర్మం.  అన్నం పెట్టకుండా వారిని పంపి వేయడం దుర్గతిని ఆహ్వానించుకున్నట్లే.  వస్త్రపాత్రాది దానంలో పాత్రతను చూచి ఆలోచించి ఇవ్వాలి.  కాని అన్నదానం విషయంలో ఆ ఆలోచన అవసరం లేదు.  ఇంటి ముందు ఎవరు ఎప్పుడు వచ్చినా అన్నం పెట్టకుండా వారిననాదరం చేయటం ధర్మం కాదు.”   అధ్యాయం – 38 (ఓ.వీ. 17, 18)

అందుచేత మానవులు అన్నదానం చేయాలి.  మొదట రోగులు, అశక్తులు, అంధులు, కుంటివాళ్ళు, చెవిటివాళ్ళు, పేదలు, అనాధలకి అన్నం పెట్టాలి.  ఆప్త జనులకు ఆతరువాత భోజనం పెట్టాలి.  అధ్యాయం – 38 ఓ.వి. 38

అందుచేతనే సాయిబాబా తరచుగా, ఆరుబయట పెద్ద పొయ్యిని ఏర్పాటు చేసి పెద్ద పెద్ద గుండిగలతో అన్నం వండేవారు.  బీదలకు, నిరాశ్రుయులకు అన్నదానం జరిపేవారు.  అలాగే దూర ప్రాంతాల నుండి తనను దర్శించుకోవడానికి వచ్చే వారందరికి షిరిడీలోని భక్తుల ఇండ్లలో భోజన వసతి ఏర్పాటు చేసేవారు.

లేదా షిరిడీలో తానే బిచ్చమెత్తేవారు. 1910వ.సం.తరువాత నుంచి భక్తులందరూ బాబాకు సమర్పించడానికి ఎన్నో మధురమయిన పదార్ధాలు తీసుకొని రావడం ప్రారంభించారు.  ఇక బాబాకు వంటచేసే అవసరం రాలేదు.

సాయిబాబా మానవుల మీదనే కాదు, సకల ప్రాణులయిన జంతువులు, పక్షులు, చీమలు అన్ని క్రిమికీటకాదుల మీద దయతో ఉండేవారు.  ఒకసారి ఒక చిన్న కుక్కను ఒక పిచ్చి కుక్క కరవగా అది పెద్ద కుక్కలను తరమసాగింది.  గ్రామస్థులందరూ దానిని చంపడానికి కఱ్ఱలు చేతపట్టుకొని దాని వెంట పడ్డారు. 

ఆ చిన్నకుక్క గ్రామంలోని సందులు గొందులు అన్నీ తిరుగుతూ ఆఖరికి ద్వరకామాయిలోకి వచ్చి సాయిబాబా వెనకాల దాక్కుంది.  దానిని తరుముతూ వచ్చిన గ్రామస్థులు సాయిబాబాతో ఆకుక్క పిచ్చిదని దానిని చంపుతామని చెప్పారు.  అపుడు బాబా “పిచ్చివాళ్ళల్లారా!  పొండి ఇక్కడి నుంచి.  ఈ మూగ ప్రాణిని ఎందుకని చంపుదామనుకుంటున్నారు?” అని దానిని రక్షించారు.

23వ.అధ్యాయంలో హేమాడ్ పంత్ ఈవిధంగా చెప్పారు. “అనాధలకు, రక్షణలేనివారికి సాయిబాబా మాతృప్రేమను అందించి వారి యోగక్షేమాలు చూసేవారు. శుష్కించినవారికి, దీనులకు ఎవరికయినా సరే బాబాగారి మసీదు ఒక విశ్రాంతిధామం.”  ఆయన ఆవిధంగా చెప్పడంలో ఆశ్చర్యం లేదు.  (ఓ.వీ. 110)

కుష్టురోగయిన భాగోజీ షిండే ప్రతి రోజు బాబా చేతులకి, పాదాలకి నెయ్యి రాసేవాడు.  బాబా కాళ్ళు జాపుకొని ఉన్నపుడు ఆయన భక్తులు (మగవారు, స్త్రీలు) ఆయన కాళ్ళు మర్ధనా చేసేవారు. సేవ చేయడం వల్ల వారికి మంచి ఫలితాలను ఇవ్వడానికి, ఇతరులకు సేవ చేయాలనే భావం వారికి కలిగించడానికే బాబా వారి చేత సేవ చేయించుకొనేవారు.  సాయిబాబాకు అటువంటి సేవలు అవసరం లేదు.  తను గొప్పవాడినని అందరి చేత అనిపించుకోవడానికి కూడా ఆయన తన భక్తుల చేత సేవ చేయించుకోలేదు.

అనాధలకు, దీనులకు సేవచేసే గుణాన్ని అలవరచుకోమని సాయిబాబా చెప్పిన బోధనలు ప్రశస్తమయినవి.  ఆయన దృష్టిలో ఉపవాసాలు ఉండి, వ్రతాలు చేసి, మొక్కులు మొక్కుకుని భగవంతుని పూజించేకన్నా ఈ మానవ సేవ చాలా ప్రశంసనీయమయినది.

ఈ సందర్భంగా స్వామి వివేకానంద చెప్పిన మాటలు:

“ఈప్రపంచంలో నువ్వు నీకళ్ళతో భగవంతుడిని ప్రత్యక్షంగా చూడాలనుకుంటే, దీనులకు సేవ చేసి వారి వదనంలో కనిపించే చిరునవ్వులో భగవంతుడిని చూడు.”

(తరువాతి అధ్యాయం ‘పుస్తక పఠనం’)

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

 సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “శ్రీ సాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – (16)దీనజనోధ్ధరణ (2వ.భాగం)

prathibha sainathuni

saibaba saibaba saibaba..

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles