Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై !!
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై !!
ఒకరోజు మా టెంపుల్ లో కొంత మంది కురువ పురం వెళ్లారు.నేను వెళ్ళలేకపోయాను.
ఆ వెళ్లిన వాళ్లలో తిరిగివచ్చేటప్పుడు గోపి అనే అబ్బాయి” శ్రీ పాదశ్రీవల్లభ లీలావైభవం “ అనే బుక్ ని, అక్క నీకు దత్తుడు అంటే ఇష్టం కదా అందుకే ఈ బుక్ నీకోసం తెచ్చాను తీసుకో అని ఇచ్చాడు.
నేను వెళ్లలేకపోయిన ఇలా బుక్ రూపం లో అయినా నా దగ్గరకు వచ్చాడులే దత్తుడు అని నాకు చాల హ్యాపీ గా అనిపించింది.వెంటనే చదివేయాలి మొత్తం అనిపించింది కానీ అప్పటికే సచ్చరిత్ర చదువుతున్నాను కాబట్టి ఈ బుక్ చదవడానికి టైం లేదు.
నాకు కురువపురం గురించి తెలుసుకోవాలని ఆ బుక్ చదివితే అందులో పూర్తిగా తెలుసుకోవచ్చు అని ఆశ.ఎందుకంటె చాలాసార్లు కురువపురం గురించి అందరు చాల గొప్పగా చెప్పగా విన్నాను సో,వెంటనే చదవాలనిపించింది.
దత్తుడికి నిష్ఠగా ఉండి చదవాలి అంటారు కదా అని మళ్ళీ డౌట్.ఐన నేనేమి కోరిక కోరుకుని అది నెరవేరాలని చదవట్లేదు జస్ట్ ఆ బుక్ లో ఏముందో తెలుసుకోవడానికే కదా సో ఎలా చదివినా ఏమి కాదులే అని,ఆఫీస్ కీ బుక్ తీసుకెళ్లి ఆఫీస్ లో ఒక టైం అంటూ ఏమి లేకుండా ,టైం దొరికినప్పుడల్లా చదివే దాన్ని.ఒకరోజు చికెన్ తినాల్సివస్తే చికెన్ తిన్న తరువాత కూడా చదివా.
దత్తుడు కదా అని కొంచం భయం ఉన్నా,అప్పటికే దత్తుని తో ఉన్నా ఎక్సపీరియన్సు వల్ల,బాబా ఐన దత్తుడైన ఒకటే,దత్తుడు నా ఇంట్రెస్ట్ ని చూస్తాడు కానీ,ఎలా చదువుతున్నాను అని చూడడు అని ఒక కాంఫిడెన్స్,ఉన్న చిన్న భయం ని కూడా పక్కకు పెట్టి చదివేలా చేసింది.
బుక్ మొత్తం చదివాక, నెక్స్ట్ డే నే మా టెంపుల్ లో దత్తుని విగ్రహ ప్రతిష్ట జరిగిన డేట్ 22, బుధవారం వచ్చింది.సో నేను ఉదయమే లేచి టెంపుల్ కీ వెళ్ళాలి అని తొందరగా నిద్రపోయా.
ఎర్లీ మార్నింగ్ కలలో అది ఒక ఫారిన్ ప్లేస్ లాగా ఉంది అక్కడ ఒక ఇంట్లో ఎవరో ఒక ఆంటీ,నేను ఉన్నాం.
ఒక పండు ముసలాయన 6 ఫీట్ ఎత్తు ఉంటాడనుకుంటా.తెల్లగా, మొఖం మీద కొన్ని ముడతలు పడి ఉన్నాయి.పాయింట్ , షర్ట్ వేసుకుని ఇన్ షర్ట్ చేసాడు.చాల ఎడ్యుకేటేడ్ లాగా ఉన్నాడు తనతో పాటు ముగ్గురు ,నలుగురు ఉన్నారు.ఆ ఇంటి దగ్గరకు వచ్చారు.
గుమ్మం దగ్గర నిల్చొని ఉన్న నాతో,నేను వల్లభాపురం నుండి వస్తున్నాను.మీ నాన్న నాకు బాగా తెలుసు అన్నారు నేను ఈయనేంటి మా నాన్న పంపించారు అంటున్నాడు.మా నాన్న ఫ్రెండ్స్ అందరు నాకు తెలుసు.ఈయన ఎవరోలే అనుకోని మీరెవరో నాకు తెలియదు అంటే ,నన్ను మీ నాన్న నీకు పెళ్ళిసంబంధం చూడడానికి పంపించారు అని చెప్పారు.
ఆ ఆంటీ బయటకు వచ్చి ఏంటి?ఎవరు మీరు అని అతన్ని అడిగింది.
అతను ఆంటీ తో, ఈ అమ్మాయికి పెళ్లి మాటలు మాట్లాడడానికి నన్ను వీళ్ళ నాన్న పంపించారు అని చెప్పగానే ఆంటీ నా వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చింది.
నాకు భయమేసి,మా నాన్న ఆలా నాకు చెప్పకుండా ఇతన్ని పంపించి ఉండరు.ఇతనెవరో నాకు తెలియదు నేను ఎప్పుడు చూడలేదు.అసలు మాది వల్లభాపురమే కాదు, అని చెప్పాను.
దానికి అతను నాతో, మీ నాన్నకు నేను బాగా తెలుసు.అందుకే నన్ను ఇక్కడికి పంపి పరిస్థితులు ఎలా ఉన్నాయి.పెళ్ళికి తగిన పరిస్థితులు ఉన్నాయో,లేవో తెలుసుకుని రమ్మని పంపించారు.నేను ఇక్కడ చూసి వెళ్ళాక,ఇక్కడి పరిస్థితులు తనకి చెపుతాను, నేను వెళ్ళాక నేను చెప్పినదానిని బట్టి, తనకి నచ్చితే పెళ్ళిసంబంధం మాట్లాడడానికి అప్పుడు వస్తాడు.
నువ్వు నన్ను ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదు కాబట్టి నన్ను చేయగానే గుర్తుపట్టట్లేదు కానీ మీ నాన్న వచ్చాక ఐన తెలుస్తుంది కదా నేను చెప్పింది నిజమే అని అన్నారు.
ఇదంతా చూస్తున్న ఆంటీ నవ్వుకుంటూ సరే బయటనే నిల్చొని మాట్లాడుతున్నారు లోపలి రండి అని వాళ్ళను పిలిచింది.అందరు లోపలకి వచ్చి కూర్చున్నారు.
ఆంటీ కిచెన్ లో,వాళ్ళందరూ మీ వాళ్ళు కదా మీ వాళ్ళు షుగర్ ఎలా వేసుకుంటారో నాకు తెలియదు కాబట్టి మీ వాళ్ళకి నువ్వే టీ పెట్టి ఇవ్వు అని చెప్పింది.
అసలు వాళ్లెవరో నాకు తెలియదంటే ఇక వాళ్ళు టీ లో షుగర్ యెంత వేసుకుంటారో నాకెలా తెలుస్తుంది.తెలీదని చెప్పితే ఈమె కూడా నమ్మట్లేదు అనుకుంటూ టీ పెట్టి,తీసుకెళ్తూ అసలు ఎవరు వీళ్ళు అనుకుంటున్న టైం లో , సడెన్ గా వల్లభాపురం అంటే దత్తుడు కదా,దత్తుడు వల్లభాపురం లో ఉంటాడు (వల్లభ పురం ,కురువ పురం పక్క పక్కనే ) కదా ! అంటే ఇతను దత్తుడా అని ఆశ్ఛర్యం వేసి,ఓకే ఇతను దత్తుడైతే బాబా ఒకసారి కలలో 2 రూపీస్ కాయిన్స్,ఇచ్చాడు కదా,ఇతను కూడా నేను అడగక ముందే 2 కాయిన్ తీసి ఇస్తే దత్తుడు అనుకుంటాను.అని అనుకుంటున్న ఇంకా పూర్తిగా అనుకోకముందే అతను నిల్చొని పాయింట్ జేబు లో నుండి 2 రూపీస్ కాయిన్ తీసి.ఇదిగో నీకే ఇద్దామని తెచ్చాను. తీసుకో అని ఇచ్చాడు.
నేను టీ కప్స్ టీ పోయ్ మీద పెట్టి 2 రూపీస్ కాయిన్ తీసుకుని నన్ను ఆశీర్వదించండి అని పాదనమస్కారం చేసుకున్నాను.తాను నన్ను బుజం పట్టుకుని లేపి,ఇదిగో నీ కోసమే ఈ పువ్వులను తెచ్చాను అని టీ పోయ్ మీద మూడు గులాబీ పువ్వులను పెట్టాడు.అవి వైట్ గా పెద్దగా వాటి అంచులు మాత్రం రెడ్ కలర్ లో చూడడానికి బాగున్నాయి.
నేను వాటిని చూస్తుంటే నీకోసమే తెచ్చాను.అందులో నీకు ఇష్టం ఐంది ఒకటి తీసుకో అన్నారు.నేను సరే అని నాకు నచ్చిన ఒక పువ్వు తీసుకుని చేతిలో పట్టుకున్నా.
నా చేతిలోని పువ్వుకన్నా టీ పోయ్ మీద ఉన్న రెండు పువ్వులు బాగున్నట్టు అనిపించాయి,మళ్ళీ నేను నా చేతిలోది టీ పోయ్ మీద పెట్టి వేరొక పువ్వు తీసుకున్నా,ఇప్పుడు కూడా నా చేతిలోని దానికన్నా టీ పోయ్ మీద ఉన్న రెండు పువ్వులు బాగున్నట్టు అనిపిస్తున్నాయి.
నేను ఏంటి నా చేతిలో ఉన్నదానికంటే కింద ఉన్న పువ్వులే బాగున్నట్టు అనిపిస్తున్నాయి.అప్పుడు నాకు అనిపించింది .ఇప్పుడు ఇది కింద పెట్టి వేరొకటి తీసుకున్నా కూడా,మళ్ళీ నేను తీసుకున్న దానికంటే మిగిలినవి బాగున్నట్టు అనిపిస్తాయి.నా మనస్సు అలాంటిది.మనదగ్గర ఉన్నదానికంటే లేనిదే బాగున్నట్టు అనిపిస్తది.
నేను ఆలా ఉండకూడదు ఇప్పుడు నా చేతిలో ఉన్నది మిగిలినవాటికంటే బాగున్నా,బాగాలేకున్నా ఇదే తీసుకుంటాను కానీ ఇది కాకుంటే అది అని మళ్ళీ మళ్ళీ మార్చొద్దు .
ఇప్పుడు నాచేతిలో ఉన్న పువ్వు వల్ల నాకు మిగిలిన వాటికన్నా మంచి జరిగినా ,చేడు జరిగినా,ఇదే నాకు రాసిపెట్టుంది అనుకుని హ్యాపీ గా ఫీల్ అవుతా కానీ.మిగిలిన వాటికోసం చూడను అనుకున్నాను.
దత్తుడు నవ్వి తలమీద ఆశీర్వదించినట్టు చేయి పెట్టి మాయమైపోయాడు.తరువాత నాకు హ్యాపీ అనిపించింది.మీ నాన్ననాకు బాగా తెలుసు ,నన్ను మీ నాన్న పంపించాడు అని దత్తుడు అంటే చాల రోజుల వరకు మా నాన్న గురించే చెప్పాడు అనుకున్నాను కానీ,కొన్ని రోజులవరకు కానీ నాకు తెలియలేదు ఆ నాన్న” శరత్ బాబూజీ “గారు అని.
Latest Miracles:
- బాబా గారితో నా పరిచయం, నా జీవితం లో బాబా గారు చూపిన మొదటి అద్భుత లీల.
- మా అమ్మ నాన్న హ్యాపీ గ ఉంటేనే కదా నేను హ్యాపీ గ ఉంటాను.
- బాబా నాకు జాబ్ ఇచ్చినా ,ఇవ్వకున్నా నేను బాబాని మాత్రమే అడగాలి
- సాయి అంకిత భక్తులైన తండ్రి కొడుకులకు బాబా వారు చేసిన సాయం–Audio
- 5 నిమిషాలకు నా జ్వరము తగ్గిపోయి స్వస్థత చేకూరింది.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “మనదగ్గర ఉన్నదానికంటే లేనిదే బాగున్నట్టు అనిపిస్తది.”
Sai Suresh
January 28, 2017 at 7:25 amgood experience sai