Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
ఈ రోజు పేరు చెప్పని ఒక సాయి భక్తుని బాబా లీలను తెలుసుకుందాము. ఇందులో మనకు నిష్కామ భక్తి గురించి తెలుసుకోవచ్చు.
ప్రతీ మానవుడు సహజంగా భగవంతుడిని కోరికలతోనే పూజిస్తారు. కోరికలు లేకుండా పూజించేవారు చాలా అరుదు. మనకి జీవితంలో అన్నీ కావాలనిపిస్తుంది. ఏవైతే మనకి లభ్యం కావో వాటి గురించి భగవంతుని పూజిస్తూ కోరికని వెళ్ళడించి వాటిని తీర్చమని అర్ధిస్తూ ఉంటాము. మనం కోరకపోయినా మనకేది కావాలో , ఎప్పుడు మనకి ఇవ్వాలో భగవంతునికి తప్ప మరెవరికి తెలుస్తుంది? ఇక చదవండి.
నిష్కామ భక్తి (మొదటి భాగం)
షిరిడి సాయిబాబా తో నా మొదటి అనుభవం. (స్కూల్ కి వెళ్ళేరొజుల్లో – బాబా గురించి , ఆయన గొప్పతనాన్ని తెలుసుకున్నక్షణం)
నా స్కూల్ చదువు అంతా అహమ్మదాబాద్ లోజరిగింది. నేను చిన్నపుడు స్కూల్ కి వెళ్ళే రోజుల్లో సాయిబాబా గురించి నాకు తెలుసు. కాని సాయిబాబా మీద అంత ఎక్కువ నమ్మకం, భక్తివుండేవి కావు. అప్పుడప్పుడు బాబా గుడి కి వెల్లే వాడిని.
మా అమ్మ గారికి బాబా మీద గొప్ప నమ్మకం. ప్రతి రోజు సాయి సచ్చరిత్ర పారాయణం చేసేది. మా అమ్మ నాతో ఎప్పుడు సచ్చరిత్ర పుస్తకం యొక్క గొప్పతనం, మహిమ గురుంచి, ఎవరైనా సరే పారాయణ చేసిన తరువాత వారి కోరికలు నెరవేరతాయనీ చెపుతూ ఉండేది.
నేను 10వ తరగతి చదువుతున్నపుడు ఒక రోజు నేను లెక్కలు హోంవర్క్ చేస్తూ వుండగ మా అమ్మ నా పక్కన కూర్చొని సాయి సత్చరిత్ర చదువుతున్నది. అపుడు నేను మా అమ్మతో ఈ పుస్తకం యెందుకు చదువుతున్నావు, దీని వల్ల సమయం అంతావ్యర్థమే కాని ప్రయోజనం ఏమి లేదు అన్నాను.
నీ సచ్చరిత్ర పుస్తకానికి నా మాథ్స్ పుస్తకానికి (నవనీత్ ప్రకాషన్ బుక్-10వక్లాస్ మాథ్స్ పుస్తకం) తేడా ఏముంది. రెండు పుస్తకాల పేజీలసంఖ్య, బరువు ఒకటే. ఇందులో ఉన్న లెక్కలన్నీ చేయగలిగితే నాకు శక్తి వస్తుంది. అప్పుడు అమ్మ ” నీవు ఇంకా చిన్నవాడివి, నీకు బాబా మహిమ గురుంచి తెలీదు ‘ అని వంట గదిలోకి వెళ్ళింది.
అప్పుడు నేను సాయి సచ్చరిత్ర పుస్తకం ఎడమ చేతిలోకి మరియు నా మాథ్స్ పుస్తకాన్ని కుడి చేతిలోకి తీసుకున్నాను. నేను ఐదు సార్లు ఇలానే చేసాను. నేను ఆ పుస్తకం యొక్క మహిమ, గొప్పతనం తెలుసుకోవాలని రెండు పుస్తకాలను నా నుదుటికి తగిలించాను.
వెంటనే ఎవరో లాగినట్టు నా కుడి చేతిలోంచి మాథ్స్ పుస్తకం జారి క్రింద పడింది. నా ఎడమ చేతిలొ సచ్చరిత్రపుస్తకం అలానె వుంది. నా రోమాలు నిక్కపొడుచుకున్నాయి.భయంతో నా గుండె వేగంగ కొట్టుకోసాగింది. అప్పుడు బాబా యొక్కశక్తి మరియు సచ్చరిత్ర గొప్పతనం తెలుసుకున్నాను. నాకు 10వతరగతిలో బాబా దయ వలన 88 మార్కులు వచ్చాయి.
సాయిబాబా తో నా రెండవ అనుభవం (డిగ్రీ 3వ సంవత్సరం-నిజమయిన భక్తి అనే గురు మంత్రం ఇచ్చిన సమయం)
నా 12వ తరగతి తర్వాత బి.ఫార్మసి డిగ్రీ చెయ్యడానికి పూనా వెళ్ళాను. అక్కడ మా అత్తయ్య ఇంటి దగ్గర ఒక అందమైన బాబా గుడి వుంది (బ్రాంజ్ తో చేసిన బాబా విగ్రహం). రొజూ కాలేజ్ కి వెళ్ళే ముందు బాబా గుడి కి వెడుతూ ఉండేవాడిని. నేను బాబాగుడి కి ఒకే ఒక కారణంతో వేళ్ళేవాడిని.
ఈ పోటీ ప్రపంచం లో నెగ్గుకు రావా లంటే మంచి మార్కులు రావాలి. కాబట్టి బాబాను మంచి మార్కుల కోసం, ఫస్ట్ రాంక్ కోసం, నాకు సహాయం చేయమనీ ఇలా ప్రార్థించేవాడిని. డిగ్రీ మూడవ సంవత్సరము చదువుతున్నపుడు ఒక రోజు రాత్రి నిద్రపోతుండగ వేకువ జామున చీకట్లో 2 గంటలకి మెలుకువ వచ్చి, నా చేతులు అనుకోకుండ ఒక చిన్నపుస్తకం మీద పడ్డాయి. .
ఆ పుస్తకం ఏమిటా అని తీసి చూస్తే దాని మీద సాయిబాబా ఫోటో , దాని పైన “నిష్కామ భక్తి” అని రాసివుంది. ఆపుస్తకం నా టేబుల్ మీదకి ఎలా వచ్చిందో నాకు అంతుబట్టలేదు. నేను ఆ పుస్తకం తీసుకొని చదవడం మొదలు పెట్టాను. చదవడం పూర్తి అయ్యేసరికి నా కళ్ళు పూర్తిగ చెమ్మగిల్లాయి. కంటి నుండి నీరు రావడం మొదలైంది. అప్పుడు నాకు పూర్తిగ అర్థం అయ్యింది. నాది నిజమైన భక్తి కాదు.
నా భక్తి ప్రేమ తో కూడిన భక్తి కాదు, స్వార్థం తో కూడిన భక్తి అని తెలుసుకున్నాను. ఆ రోజు నుండి నేను నిజమైన భక్తి కోసం, నిజమైన దేవుడి కోసం అన్వేషించాను. నా కళ్ళు తెరుచుకున్నాయి. నేను నిష్కామ భక్తి తోదేవుని ప్రార్థించడం మొదలు పెట్టాను.
మరుసటి రోజుమా అత్తయ్యని ఆ పుస్తకం గురించి అడిగాను. ఆ పుస్తకం తనకు బాబా గుడి లో ఎవరో ఇచ్చారని , తొందర్లో వుండి పొరపాటున క్రిందటి రోజు ఆపుస్తకం నేను చదువుకునే టేబుల్ మీద పెట్టినట్లు చెప్పింది. నాకు బాబా యొక్క దీవెనలు,ఆశీస్సులుఅందాయి. నేను నా గురువైన బాబా మీద భారం వేసి బాబా పాదాలను నమ్ముకున్నాను.
సాయిబాబా తో నా మూడవ అనుభవం. చివరికి బాబా నన్ను కలిసిన సమయం (4వ సంవత్సరం)
అప్పటి నుండీ నేను నిష్కామ భక్తితో పూజ చేయడం ప్రారంభించాను. ఆధ్యాత్మిక పుస్తకాలను కూడా చదవడం మొదలుపెట్టాను. నా డైరీలో బాబాకు ఉత్తరాలు రాస్తూ ఉండేవాడిని. నిజంగా నాకది ఎంతో ఇష్టంగా ఉండేది. .నేను డిగ్రీ ఫోర్త్ ఇయర్ లో వుండగ స్పోర్ట్స్ వీక్ లో క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ లో మా జట్టు ఫైనల్స్ కి చేరింది.
ఫైనల్స్ లోఆడుతుండగ ఒక రన్ పూర్తి కావడం కోసం దూకాను. అలా దూకడం లో నా కుడి భుజం నుండి నా కుడిచేయి పూర్తిగా పట్టు తొలగింది (భుజము వద్ద ఉండే కీలులోనించి ఎముక స్థానం తప్పింది) భరించలేనంత నొప్పి కలిగింది . అందరు నన్ను వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళారు .నాకు ఆపరేషన్ చేసారు.
ఆపరేషన్అయ్యాక సాయిబాబా ని తలచుకొని “బాబా నేను నీ బిడ్డను , నీవునా ప్రియమైన తండ్రివి. మరి నన్ను కనీసం చూడడానికైన ఎందుకు రాలేదు బాబా. నా విషయం లో ఎందుకు ఇంత నిర్దయుడిగ ఉన్నారు” అనుకుంటూ ఏడుస్తున్నాను. మరుసటి రోజు నన్నుచూడడానికి నాసహాధ్యాయి, ప్రియమైన స్నేహితుడు మా అత్తయ్య ఇంటికి వచ్చాడు. అతడు నాకు ఒక బహుమతి ఇచ్చాడు.
నేను ఆ బహుమతి తెరచి చూడగానే నోట మాటరాకుండ స్తబ్దుణ్ని అయి అలానే చూస్తుండి పోయాను. ఆబహుమతి మరేమిటో కాదు నా ప్రియమైన తండ్రి బాబా మీడియం సైజ్ ఫోటో ఫ్రేం. అందులో బాబా పసుపు వస్త్రం ధరించి ఎంతోఅందంగ వున్నారు. బాబా నన్నే చూస్తున్నట్టు,పలకరిస్తునట్టు, నన్ను చూసి నవ్వుతున్నట్టు అనిపించింది.
నేను బాబాను నన్ను చూడడానికి రాలేదని క్రితం రోజు అడిగినందుకు బాబా నన్ను చూడడానికి, కలవడానికి వచ్చారు. నేను నా స్నేహితుడిని ఈ బాబా ఫోటో ఎలా వచ్చింది. ఎందుకు ఇవ్వాలనిపించింది అని అడిగాను. అతడు వాళ్ళ నాన్న గారు షిరిడికి వెళ్ళినపుడు, ఈ అందమైన బాబా ఫోటో ఫ్రేం తెచ్చాడని చెప్పాడు.
మీకు ఎవరికైతే ఇవ్వాలనిపిస్తుందో వాళ్ళకివ్వమని వాళ్ళ నాన్నగారితో అతడు చెప్పాడట. ఈ రోజు వరకు నేను ఆ బాబా ఫోటో ను పూజిస్తున్నాను. నాకు బాబా గారు ఎప్పుడు నీతో నేను వున్నాను అని చెప్తునే వున్నారు.
( రేపు మరో అనుభవం సాయి చేసిన సహాయం)
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- నిష్కామ భక్తి -2 వ. భాగం
- సునిత జయరాజ్ గారికి సంతానాన్ని ప్రసాదించిన బాబా 1 వ భాగం–Audio
- శ్రీసాయి సత్ చరిత్ర – తత్వం – అంతరార్ధం – 1 వ.భాగం
- శ్రీ జీ.ఎస్.ఖాపర్డే- డైరీ 1 వ భాగం–Audio
- శ్రీసాయి లీలా తరంగిణి – 1 వ. భాగం
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments