Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!
ముందు భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)
అన్నీ తనకు తెలుసుననీ, తాను సర్వజ్ఞుడిననీ ఎన్నడూ చెప్పుకోలేదు బాబా. కాని, ఆయన సర్వజ్ఞతని అనేక సంఘటనలు చాటి చెప్పాయి.
అందులో ఒక సంఘటన…ఆ రోజు ఎలాంటి హడావుడీ ఆర్భాటాలూ లేవు. ప్రశాంతంగా ఉంది ద్వారకామాయి. శ్యామా సహా నలుగురైదుగురు భక్తులు బాబా ముందు కూర్చుని ఆచారాలు, సంప్రదాయాల గురించి మాట్లాడుకుంటున్నారు.
శకునాల గురించి విశ్లేషించుకుంటున్నారు. భక్తుల విశ్లేషణలూ, నమ్మకాలూ బాబాకి నవ్వు తెప్పిస్తున్నాయి. సన్నగా నవ్వుకోసాగారాయన.
అంతలో ‘కీచ్ కీచ్’ మని సన్నని శబ్దం వినవచ్చింది. ఆ శబ్దం వినవచ్చిన వైపుగా తలెత్తి చూశాడు శ్యామా. ద్వారకామాయి గోడ మీద బల్లి కనిపించిందతనికి. అదే అరుస్తోందలా.
బల్లి అలా అరిస్తే శుభం అంటారు కొందరు. అశుభం అంటారు మరి కొందరు. ఇందులో ఏది నిజం? తెలుసుకోవాలనుకున్నాడు శ్యామా. కళ్ళు మూసుకుని తనలో తాను నవ్వుకుంటున్న బాబాని చూశాడు.
బాబాని అడిగాడిలా.‘‘బాబా బల్లి అరుపు శుభమా? అశుభమా?’’‘‘శుభాశుభాల సంగతి పక్కనబెట్టు. ఇప్పుడు మాత్రం ఆ బల్లి ఆనందంతో అరుస్తోంది.’’ అన్నారు బాబా.‘‘బల్లికి కూడా ఆనందాలు, దుఃఖాలూ ఉంటాయా?’’ ఆశ్చర్యపోయాడు శ్యామా.
‘‘ఎందుకుండవు? చరాచర జీవకోటి అంతటికీ ఆనందాలూ దుఃఖాలూ ఉంటాయి. ఇప్పుడీ బల్లికి ఆనందం ఎందుకంటే… అన్నారు బాబా.
ఆ మాటలకి విస్తుపోయారు భక్తులు. బల్లికి కూడా బంధాలూ అనుబంధాలూ ఉంటాయా? అని ఆశ్చర్యపోయారు. నిజం కాదేమో! బాబా సరదాగా అబద్ధం ఆడుతున్నారేమో! అనుకున్నారు.
అంతలో ఓ వ్యక్తి గుర్రం మీద వచ్చి, ద్వారకామాయి ముందు నిల్చున్నాడు. వచ్చిన వారిని ఆరా తీయడం శ్యామాకి అలవాటు. పరుగున సమీపించాడు ఆ వ్యక్తిని.
‘‘ఎక్కణ్ణుంచి వస్తున్నారయ్యా? ఎవరి కోసం?’’ అడిగాడు.‘‘ఔరంగాబాద్ నుంచి వస్తున్నానయ్యా! బాబా దర్శనం కోసం వచ్చాను.’’ అన్నాడు ఆ వ్యక్తి.
చాలా దూరం ప్రయాణించి వచ్చిందేమో! గుర్రం అలసిపోయింది. దానికి దాణా తెచ్చి పెట్టే ప్రయత్నంలో జీనుకి వేలాడుతున్న గోనె సంచిని అందుకున్నాడు ఆ వ్యక్తి. అప్రయత్నంగా సంచిని తిరగేసి దులిపాడు.
‘ఠప్’న అందులో నుంచి కింద పడిందో బల్లి. శ్యామాతో పాటుగా భక్తులంతా చూశారు దాన్ని. కింద పడడమే ఆలస్యం, పరుగున పాకి ద్వారకామాయి గోడ మీది అక్క బల్లిని చేరుకుంది.
రెండు బల్లులూ ‘కీచ్‌కీచ్’మంటూ ఆనందంగా తిరగసాగాయి. నవ్వుతూ వాటినే గమనిస్తున్న బాబా దగ్గరకి వచ్చాడు శ్యామా.
‘‘ఆశ్చర్యంగా ఉంది బాబా, ఇదంతా కలా నిజమా?’’ అడిగాడు.‘‘నిజమే!
ఔరంగాబాద్‌లో ఉన్న చెల్లెల్ని చూడాలని మన ద్వారకామాయి గోడని అంటిపెట్టుకున్న ఈ బల్లికి ఎప్పటి నుంచో కోరిగ్గా ఉంది. ఇప్పటికి నాలుగైదు సార్లు అడిగింది నన్ను. ‘చూపించవూ’ అంటూ ప్రార్థించింది. కాదనలేకపోయాను, ఆఖరికి రప్పించాను.’’ అన్నారు బాబా.
చేతులు జోడించాడు శ్యామా. బాబాకి నమస్కరించాడు.‘‘నువ్వు సర్వజ్ఞుడివి బాబా.’’ అన్నాడు.‘‘నేను కాదు, సర్వజ్ఞుడు అల్లా.’’ అన్నారు బాబా.‘‘సబ్ కా మాలిక్ ఏక్’’ అన్నారు.
తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- బాబా వారి సర్వజ్ఞత.
- ‘‘తెలియక చేసిన పాపాలన్నీ తిరగలి తిప్పి, పోగొట్టుకున్నారు.
- ఓ తల్లి, తన బిడ్డకు తినిపించినంత ప్రేమగా భాగోజీకి అందించి బాబా తినిపించారు.
- ‘‘నాకు మీరూ కావాలి. వారూ కావాలి. అంతా అందరూ నా వాళ్ళే’’
- నాటి నుంచి ఆ ఉత్సవాన్ని ‘జెండా ఉత్సవం’ అని కూడా పేర్కొనసాగారు.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments