Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
శ్రీ సాయి సచ్చరిత్రము పదునైదవ అధ్యాయము.
రెండు బల్లులు.
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.
ఒకనాడు బాబా మసీదులో కూర్చొని ఉండెను.ఒక భక్తుడు బాబా ముందర కూర్చొని ఉండెను.
ఒక బల్లి టిక్కు టిక్కుమని పలికెను.కుతూహలమునకై యా భక్తుడు బల్లి పలికిన దానికి అర్ధమేమని బాబాని అడిగెను.అది శుభశకునమా,లేక అశుభమా అని ప్రశ్నించెను.
తన చెల్లెలు ఔరంగాబాదునుండి తనను చూచుటకు వచ్చునని యా బల్లి ఆనందించుచున్నదని బాబా పలికెను.
భక్తుడు నిర్ఘాంతపోయి కిమ్మనక కూర్చుండెను.బాబా పలికినదానిని అతడు గ్రహించలేకుండెను.
కొంత తడవైన పిమ్మట ఔరంగాబాదు నుండి ఎవరో గుఱ్ఱముపై బాబా దర్శనమునకై శిరిడీకి వచ్చిరి.అతడింకను కొంతదూరము పోవలసియుండెను.
కాని అతని గుఱ్ఱము ఆకలిచే ముందుకు పోలేకుండెను.గుఱ్ఱముమనకు ఉలవలు కావలసియుండెను.తన భుజముపై నున్న సంచిని తీసి ఉలవలు తీసికొని వచ్చుటకై పోవునప్పుడు దానిలో నున్న ధూళిని విదిలించెను.
అందులో నుండి యొక బల్లి క్రిందపడి అందరు చూచుచుండగా గోడనెక్కెను.
ప్రశ్నించిన భక్తున కదంతయు జాగ్రత్తగా గమనించుమని బాబా చెప్పెను.
వెంటనే యా బల్లి తన సోదరి వద్దకు సంతోషముతో పోయెను.చాలాకాలము పిమ్మట అక్కచెల్లెండ్రు కలిసికొనిరి.ఒకరినొకరు కౌగలించుకొని ముద్దిడుకొనిరి.గుండ్రముగా తిరుగుచు అధిక ప్రేమతో వాడిరి.
శిరిడీ యెక్కడ?ఔరంగాబాదెక్కడ? గుఱ్ఱపు రౌతు ఔరంగాబాదునుంచి బల్లిని తీసుకొని శిరిడీకి ఎట్లు వచ్చెను?రాబోయే యిద్దరు అక్కచెల్లెండ్రు కలియుదురని బాబా ముందుగానే ఎట్లు చెప్పగలిగెను? ఇది యంతయు బహుచిత్రముగా నున్నది.ఇది బాబా సర్వజ్ఞుడని నిరూపించుచున్నది.
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- బాబా వారి వైశిష్ట్యము
- బాబా మా వారి కోపం పోగొట్టి మీ పై భక్తి పెరిగేలా చుడండి
- బాబా వారి వస్త్రములను శివనేశన్ స్వామికి ఇప్పించుట.
- బాబా వారి ఊధీ ధారణతో మానసిక వ్యధ తొలగిపోవుట.
- నా కోరిక ప్రకారం బాబా వారి వెన్నముద్ద ప్రసాదాన్ని గురువుగారు నాకు ప్రసాదించారు.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments