చోల్కరు చక్కెరలేని తేనీరు.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


శ్రీ సాయి సచ్చరిత్రము పదునైదవ అధ్యాయము.

  సాయి బాబా   …      సాయి బాబా    …     సాయి బాబా     …     సాయి బాబా

ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో  వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.

ఠాణా లో నున్న కౌపీశ్వరాలయములో ఒకనాడు దాసగాణు మహరాజ్ హరికధ చెప్పుచు సాయి మహిమను పాడుచుండెను.

కథను వినుటకు వచ్చిన వారిలో చోల్కర్ అను అతడుండెను.అతడు పేదవారు.ఠాణా సివిల్ కోర్టులో గుమాస్తాగా పనిచేయుచుండెను.

అతడు దాసగణు కీర్తన అతి శ్రద్ధగా వినెను.అతని మనస్సు కరగెను.వెంటనే అక్కడకక్కడే మనస్సునందు బాబాను ధ్యానించి ఇట్లు మ్రొక్కుకొనెను.”బాబా!నేను పేదవాడను,నా కుటుంబమునే నేను పోషించుకొనలేకున్నాను.మీ అనుగ్రహముచేత  సర్కారు వారి పరీక్షలో ఉతీర్ణుడనై స్థిరమైన ఉద్యోగము లభించినచో నేను శిరిడీకి వచ్చెదను.నీ పాదములకు సాష్టాంగనమస్కారము చేసెదను.నీ పేరున కలకండ పంచి పెట్టుదును.”

బాబా కృపచే చోల్కరు పరీక్షలో పాసయ్యెను.స్థిరమైన ఉద్యోగము దొరకెను.కనుక మ్రొక్కు చెల్లించవలసిన బాధ్యత ఎంత త్వరగా తీర్చినచో అంత బాగుండుననుకొనెను.

చోల్కరు బీదవారు.అతని కుటుంబము చాలా పెద్దది.కనుక శిరిడీ యాత్ర చేయుటకు ఖర్చు పెట్టుకొనలేకుండెను.

చోల్కరు కి ఎటులైన శ్రీ సాయి మ్రొక్కును త్వరలో చెల్లించవలెనని ఆతురత కలిగెను.

కావున తన సంసారమునకగు ఖర్చులను తగ్గించి కొంత పైకమును మిగుల్చవలెనని నిశ్చయించుకొనెను.

తేనీటిలో వేయు చక్కెరను మాని యా మిగిలిన ద్రవ్యమును దాచుటకు ప్రారంభించెను.

ఈ విధముగా కొంత ద్రవ్యమును మిగిల్చిన పిమ్మట ,శిరిడీ కి వచ్చి బాబా పాదములపై బడెను.ఒక టెంకాయ బాబా సమర్పించెను.తాను మ్రొక్కుకున్న ప్రకారము కలకండ పంచి పెట్టెను.తన మనస్సులోని కోరికలన్నియు ఆనాడు నెరవేరినవనియు,తనకు యెంతయో తృప్తిగా నున్నదనియు బాబాతో చెప్పెను.

చోల్కరు బాపూసాహెబ్ జోగు  గృహమందు దిగెను.అప్పుడు వీరిరువురు మసీదులో నుండిరి.

ఇంటికి పోవుటకై వారు లేచి నిలువగా బాబా జోగును పిలచి యిట్లనెను .”నీ అతిధికి టీ కప్పులలో విరివిగా చక్కెర వేసి యిమ్ము!”. ఈ పలుకులలోని భావమును గ్రహించినవాడై,చోల్కరు మనస్సు కరిగెను.అతడాశ్చర్యమగ్ను డయ్యెను.అతని కండ్లు బాష్పములచే నిండెను.తిరిగి బాబా పాదములపై బడెను.

జోగు కూడ ఈ మాటలు విని టీ కప్పులలో చక్కెర ఎక్కువగా కలుపుట అనుదాని భావము ఏమైయుండునా అని యోచించెను.

బాబా తన పలుకులచే చోల్కరు మనస్సునందు భక్తి,నమ్మకములను కలుగజేయవలలెనని యుద్దేసించెను.వాని మ్రొక్కు ప్రకారము తనకు రావలసిన కండచక్కెర ముట్టినదనియు ,తేయాకు నీళ్ళలో చక్కెర నుపయోగించక పోవుటయను రహస్య మనోనిశ్చయమును చక్కగా కనుగొనెననియు చెప్పెను.

బాబా యిట్లు చెప్పనుద్దేశించెను.

“నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రింబవళ్ళు మీ చెంత నేనుండెదను.

నా దేహము నిచ్చట నున్నప్పటికి సప్తసముద్రముల కవ్వల మీరు చేయుచున్న పనులు నాకు తెలియును.

ప్రపంచమున మీకిచ్చవచ్చిన చోటుకు పోవుడు.నేను మీ చెంతనే యుండెదను.

నేను మీ శరీరములోనే యున్నాను.ఎల్లప్పుడు మీ హృదయములలోను సర్వజన హృదయములందు గల నన్ను పూజింపుడు.ఎవ్వరు నన్ను ఈ విధముగా గుర్తించెదరో వారు ధన్యులు;పావనులు ;అదృష్టవంతులు.”

బాబా చోల్కరు కెంత చక్కని ముఖ్యమైన  నీతిని ఈ విధముగా బోధించెనో గదా!

  సాయి బాబా   …      సాయి బాబా    …     సాయి బాబా     …     సాయి బాబా

ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో  వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles