Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
శ్రీ సాయినాథాయనమః
M కుమారస్వామి గారి అనుభవములు మొదటి భాగము
శ్రీ శ్రీ శ్రీ శిరిడి సాయి నాథుని దర్శనం నాకు 2010 సంవత్సరం లో కలిగింది. అంతకుముందు మేము వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామీని పూజిస్తూ ఉండేవాళ్ళము.
1988వ సంవత్సరం నుండి నేను ఈనాటి వరకూ నాకు జన్మ నిచ్చిన తల్లిదండ్రులకు, పెంచి పెద్ద చేసిన మా మేనమామ, అత్తమ్మకు, నాతో ఏడడుగులు నడచిన సహధర్మచారిణికి, నా కుల దైవం అయిన రాజ రాజేశ్వర స్వామికి, మా ఇంటి దైవం శ్రీ మహా లక్ష్మి అమ్మవారికి సదా నా ఈ జన్మ ఉన్నంత కాలమూ బుణపడి ఉంటాను.
శ్రీ శిరిడి సాయినాధుని దయ లేనిదే శిరిడి పోవుటకు నడకే సాగదని నేను 18 సంవత్సరాల తర్వాత తెలిసికొంటిని.
నాకు శ్రీ శిరిడి సాయినాధుడు శిరిడిలో దర్శనం ఇచ్చిన సంగతి చెప్పుటకు నాకు రోమాంచిత మగుతున్నది. ఎందుకనగా కోట్ల మంది భక్తుల కోర్కెలు తీర్చే శ్రీ సాయి నాకు దర్శనం ఇవ్వటం నా పూర్వజన్మ ఫలముగా భావించుచున్నాను.
భకితో ఫలం, పుష్పం, తోయం ఏది సమర్పించినా అది నాకు చెందుతుంది అని శ్రీకృష్ణుడు గీతలో చెప్పాడు. అన్ని జీవరాసులలో నేను ఉన్నానని శీ సాయి అన్నారు.
ఈ కలియుగంలో మానవ జన్మ లభించుట, నేను శ్రీ సాయిని తెలుసుకొనుట నేను చేసుకున్న శతకోటి పుణ్యముల ఫలము.
మా ఇంట్లో పూజా మందిరంలో ప్రతిరోజూ నేనోసగు ప్రసాదమును బల్లి రూపంలో శ్రీ సాయి వచ్చి ఆరగిస్తారు. ఆ దేవా దేవుడే శ్రీ రాజరాజేశ్వర స్వామీ నాకు అన్ని కోరికలు తీరుస్తూండేవాడు. నేను సర్వం ఆయనగా 25 సంవత్సరాలు కొలిచాను.
1989 సంవత్సరం లో నాకూ రాణికీ వివాహం జరిగింది. వివాహం అయిన ఏడాది కే మాకు బాబు పుట్టాడు.
మా బాబు పుట్టాక మా రాణికి అరోగ్యం పాడయింది. తనను తాను మరచి పోయి ఒకేచోట అలాగే కూర్చుండి పోతూండేది.
పొయ్యిమీద అన్నం, పాలు పెట్టేసి అవి పొంగి మాడి పోతూంటే అలా వాటికేసి చూస్తూండి పోతూండేది, కానీ వాటిని పొయ్యి మీదనుంచి దించేది కాదు.
ఒక రకమయిన మానసిక వ్యధ ననుభవిస్తూండేది. నాకు భయం వేసి తెలిసిన ఒకాయన దగ్గర చెప్పుకున్నాను.
ఆయన నాకు తెలిసిన ఒకాయన అడ్రసు ఇస్తాను ఆయన దగ్గరకు వెడితే విభూధి ఇస్తాడు, అది కనుక ధారణ చేస్తే మీ ఆవిడ మామూలు మనిషి అవుతుంది అని చెప్పాడు.
నేను మా అవిడకీ విషయం చెప్పాను. ఆవిడ తన ఆరోగ్యం కోసం ఆయన దగ్గరకి వెళ్లి విభూది తెచ్చుకుంది. ధారణ చెయ్యసాగింది. అతి తొందరలోనే ఆమె మామూలు మనిషయ్యింది.
తన సహజ స్థితికి వచ్చింది. అప్పటి నుండి మా రాణి బాబా ఫోటోని కొనుక్కువచ్చి బాబాని కొలవటం మొదలుపెట్టింది.
“ఇదేమిటి? ఈ కొత్త పూజలేమిటి?” అని నేను అడిగితే “నా ఆరోగ్యం బాగయ్యింది ఈయన ఊదితోనే”. అక్కడ విభూది ఇచ్చినాయన చెప్పాడు, ఈయన ఫోటో కూడా చూపించాడు. ఆయనే నా రోగం తగ్గించి నన్ను మామూలు మనిషిని చేసాడు అని చెప్పింది. సరేలే చేస్తే చేసుకొమ్మనమని వదిలేసాను.
నేను శివుడిని, ఆవిడ సాయిని పూజిస్తూన్నాము. నేను ఏడాదికి ఒకసారి రాజన్న దర్శనానికి కుటుంబమంతా వెళ్ళే వారము. అలాగే వీలున్నప్పుడల్లా తిరుపతి వెంకటేశ్వరస్వామిని కూడా దర్శనం చేసుకునే వాళ్లము.
మా రాణి నన్ను ఎప్పుడూ శిరిడికి తీసుకెళ్ళి ధర్శనం చేయించమని నన్ను కోరనూ లేదు. నేనామెను శిరిడికి ఏనాడూ తీసుకెళ్ళలేదు. అలా 18 సంవత్సరాలు గడిచి ప్రోయాయి.
మాకు మరో బాబు కూడా పుట్టాడు. నాకు స్వతహాగా చాలా కోపం ఎక్కువ పట్టుదల పంతం కూడా ఎక్కువే.
ఒక రోజు నా భార్య నేనూ ఏదో విషయం ఫై మాటా మాటా అనుకొని నా పంతం పట్టుదల నెగ్గించు కోవటానికి కోపంగా నేను ఇంట్లోంచి బయటకి వచ్చేస్తూన్నాను. “ఇంక నేను ఇంటికి రాను. నీ ముఖం కూడా చూడను ఏమి చేసుకుంటావో చేసుకో, నీ దిక్కున్నచోట చెప్పుకో” అని కోపంగా ఇంట్లోనుంచి బయటకి వచ్చి బైక్ తీసి స్టార్ట్ చేసాను.
ఏమయియిందో తెలియదు కానీ, బండి నా చేతుల్లోంచి క్రిందకి జారిపోయి నాకేమీ తగలకుండా భూమి మీద ఐదు సార్లు గిర్రున గుండ్రంగా తిరిగింది.
నేను ఆశ్చర్యంగా చూసి, కోపంగా నేను బయటకి పోవాలనుకున్న విషయం మరచి పోయి ఇంట్లోకి వెళ్లాను.
నేను వెళ్లి పోతానని బెదిరించి ఇంట్లోంచి వచ్చేస్తూ నీ దిక్కున్న చోట చెప్పుకోమ్మనమని అన్నాను కదా! నేను గుమ్మం దాటంగానే మా రాణిబాబాకి మొక్కుకుందట.
“బాబా మా ఆయన అన్నంతపనీ చేస్తాడు, చాల కోపం పట్టుదల ఎక్కువ ఏమి చేస్తావో బాబా! నువ్వే ఆపాలి” అని బాబా ముందు నిలబడి కళ్ళు మూసుకొని మొక్కుకుందట.
బండి అలా గిర్రున చక్రంలాగా తిరిగి సుదర్శన చక్రంలాగా నా మీద ప్రయోగించబడింది. ఆనాటి నుండి నా జీవితంలో బాబా ప్రవేశించాడు.
సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు
Latest Miracles:
- సబూరి తో ఉన్న నాకు బాబా వారి కృపతో మెడనోప్పి, వెన్నునొప్పుల భాదలు తొలగిపోవుట
- బాబా వారి వస్త్రములను శివనేశన్ స్వామికి ఇప్పించుట.
- ఊధీ మహిమతో భక్తురాలి అనారోగ్యాన్ని తగ్గించి ‘గౌరి గణపతి’ పూజ నిర్విఘ్నంగా జరిపించిన బాబా వారు
- ఊధీ మహిమ – ఊపిరితిత్తుల వ్యాది మటుమాయం–Audio
- బాబా శారీరక, మానసిక బాధలను నివారించుట–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments