Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
శ్రీ సాయినాథాయనమః
M కుమారస్వామి గారి అనుభవములు రెండవ భాగము
ఇప్పడు చూసావా మా బాబా గొప్పవాడని వప్పుకుంటావా? అంది మా రాణి. దానికి నేను “సరే రాణి నీ బాబా చాలా గొప్పవాడు ఒప్పుకుంటా! పూర్తిగా నేను నమ్మాలంటే, బాబాకి నేను 10 పరీక్షలు పెడతాను ఆ పరీక్షలలో ఆయన నెగ్గితే నిన్ను నేను శిరిడికి తీసుకుపోతా” నన్నాను.
ఏమిటా పరీక్షలు అంటే, పెద్ద పెద్ద వేమీ కాదు. బాబా ఫోటోలో మొహంపై ఒక పురుగు పాకుతూంటే, అది బాబా పాదాల మీదికి రావాలని, చీమలు తన మార్గంలో కాకుండా నేను ఆగమన్నప్పుడు ఆగి మరల తిరిగి ప్రయాణించమన్నప్పుడు ప్రయాణించటం,
మా ఇంట్లో బాబా ఫోటో దగ్గర ఒక బల్లి ఎప్పుడూ ఉంటూంటుంది, అది నేను ప్రసాదం పెడితే తింటే కనుక బాబా నువ్వు నిజంగా ఉన్నావని ఒప్పుకుంటా నన్నాను.
ఇలాంటివి 10 పరీక్షలు పూర్తి అయి డబ్బు సమకూర్చుకొని మేము శిరిడి వెళ్ళడానికి 6 మాసాలు వ్యవధి పట్టింది.
అసలీ బల్లి సంఘటనకి నెల రోజుల ముందు నేను మా ఇంట్లో బెడ్ రూమ్ లో పడుకున్నప్పుడు రాత్రి 2:30 నిముషాలకి ఆ గదిలో అలమారా నుండి ఒక మెరుపు లాగా ఏసు ప్రభువు బయటకి వచ్చి “కుమారస్వామీ నీకో సంగతి చెపుతాను” అని అనటం నాకు మెలుకువ రావటం చుట్టూ చూసి అది కల అని తెలుసుకున్నాను.
ఇది జరిగిన నెల రోజులకి బాబా తన మార్గంలోకి చక్రం అడ్డువేసి నన్ను లాక్కున్నాడు. ఆ రోజు ఏసుప్రభువు చేపుతానన్న మాట ఇదేనేమో! సరే! శిరిడికి వెళ్ళాము. బాబాని దర్శనం చేసుకున్నాము. అదే మొదటిసారి బాబా దర్శనం.
మా తమ్ముడు, అమ్మా నాన్నా కలసి ఉండేవాళ్ళు. తమ్ముడికి ఒక ఇల్లు ఉంటే పెళ్లి సంబంధం కుదురుతుందని అమ్మ అంటే, వాడి కోసం ఒక ఇల్లు కట్టించి ఇచ్చాను. తమ్ముడి పేరనే ఇల్లు రాసేసాను.
ఆ తర్వాత తమ్ముడికి పెళ్లి కుదిరింది. ఆ ఇంట్లో అమ్మా, నాన్నాతో పాటు తమ్ముడు మరదలు కూడా ఉండేవారు.
కొన్నాళ్ళయ్యాక అమ్మని, నాన్నని నేను తరచూ చూడటానికి వెళ్ళినప్పుడల్లా నన్ను మరదలు ఏదో ఒకటి అంటూ ఉండేది. నాకు బాధ అనిపించేది.
రానురానూ మా మరదలు అమ్మానాన్నలని కూడా ఏదో ఒక మాటలతో బాధ పెడుతూండేది. మరదలికి తోడూ తమ్ముడు కూడా అమ్మానాన్నలని మాటలతో హింసించేవాడు.
ఒక అర్ధరాత్రి తమ్ముడు మరదలు ఎదో అన్నారని ఇంట్లోంచి అమ్మ, నాన్నా బయటకి వచ్చేశారు. ఊర్లో ఎవరింట్లోనో తలదాచుకొని, నాన్న నాకు ఉదయాన్నే ఫోన్ చేసాడు.
వారం రోజులలో డబ్బులు తీసుకు వస్తాను, నువ్వేమీ బాధ పడకు, కాస్త ఓర్చుకోమని చెప్పాను. సరే నన్నాడు నాన్న. సరిగ్గా వారం తిరిగే సరికల్లా డబ్బు తీసుకొని నేను సూరారం (మావూరు) వెళ్ళాను.
ఒక స్థలం కొని అందులో ఒక వేప మొక్క నాటి ఇల్లు కట్టడం కూడా మొదలు పెట్టాను.
ఇల్లు పూర్తి అయ్యే సమయానికి ఆ వేపచెట్టు రెండు కొమ్మలుగా పెరింగింది. ఒకటి శ్రద్ధ, మరొకటి సబూరి అనే వాడిని. ఆ ఇంటి గృహప్రవేశానికి బాబాను రమ్మనమని ప్రార్థించాను.
గృహప్రవేశం అయింది. నేను బాబా కోసం ఎదురు చూస్తూన్నాను, పూజ అయింది, బాబా జాడ లేదు వ్రతం కూడా అయింది, నాకు నిరాశ ఆవరిస్తోంది.
భోజనాల సమయం అయింది, యింతలో ఒక ముసలమ్మ వచ్చి బిక్ష అడిగింది. నేనామెను చూసాను ఆ వచ్చింది బాబాయే అని నేననుకున్నాను.
అరిటాకులో పదార్ధములన్నీ వడ్డించి తీసుకు వచ్చేటప్పటికి ఆ వచ్చిన ముసలమ్మ వేపచెట్టు క్రింద కూర్చుంది. వడ్డించిన ఆకు తేవడం చూసి పట్రా పట్రానేను చాలా దూరం వెళ్ళాలి, అంటూ ఆత్రంగా భోజనం ముగించింది.
భోజనం అయ్యాక మా పెద్ద బాబుతోటి దక్షిణ ఇప్పించుకుంది. ఎవరికీ కనబడకుండా వెళ్ళిపోయింది. బాబా స్వయంగా ముసలమ్మ రూపంలో వచ్చాడు.
ఎందుకంటే తమ్ముడు విషయంలో, అమ్మానాన్నల విషయంలో ఇంటికి పెద్ద కొడుకుగా నేను నెరవేర్చిన కర్తవ్య కర్మలు సాయినాధుడు మెచ్చి నా ఆహ్వానాన్ని మన్నించి మా ఇంటి గృహహ్రవేశానికి రావటం మేము చేసుకున్న మహాభాగ్యం.
సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు
Latest Miracles:
- బాబా వారు చేసిన లీలల ద్వారా బాబా మీద నమ్మకం లేని భక్తుని కుటుంబ సభ్యులందరినీ తన భక్తులుగా మార్చుకున్న సాయి మహారాజ్….
- బాబా ఏదో రూపంలో తమ ఇంటికి వస్తారు అని భావించిన భక్తుల నమ్మకాన్ని నిలబెట్టిన బాబా వారు
- సస్పెన్షన్ లో ఉన్న 10 రోజులు బాబా సేవ లో గడిపిన భక్తునికి, తిరిగి ఉధ్యోగాన్ని ప్రసాదించిన బాబా వారు
- సొంత ఇంటి కలను, కోరిన వంద రోజులలో సాకారం చేసిన బాబా వారు….
- మా కొత్త ఇల్లు అంత బాబా నామమయం
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments