వైద్యుని రూపంలో వెళ్ళి, భక్తుని తండ్రి నడుము నొప్పిని తగ్గించిన బాబా వారు.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


శ్రీ సాయినాథాయనమః

M కుమారస్వామి గారి అనుభవములు మూడవ మరియు చివరి భాగము

మరొక సారి మా కుటుంబం అంతా శిరిడి కి బాబా ధర్శనార్ధమై వెళ్ళాము. ఒకచోట బసచేసాము.

నేను ఒక్కడినే శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ చేయ నారంభించాలని, దానికి ముందు శిరిడి కి సమీపాన ఉన్న కోపర్గావ్ లో నున్న గోదావరిలో స్నానం చేసి ఆ నదిలోనే నిలబడి బాబాకి నమస్కరించి అక్కడే పారాయణ మొదలు పెట్టాలనే కోరికతో నేనే స్వయంగా కారు నడుపుకుంటూ కోపర్గావ్ చేరాను.

అక్కడ గోదావరి ఉంది కాని నీళ్ళు ప్రవహించుటలేదు. తీరం వెంబడి వెడుతూనే ఉన్నాను. ఎంత దూరం పోయినా ఒడ్డు కనపడలేదు.

ఈ లోపు అక్కడ ఒకాయన కనపడ్డాడు. నేను ఆయన్ని ఆపి ఇక్కడ పారే గోదావరి లేదా ఎంత దూరం పోయినా ఇలాగే కనిపిస్తోంది అని అడిగాను.

ఆ మనిషి కొంత దూరం వెళ్ళాక అక్కడొక పాత శివాలయం ఉంది దానికి పక్కనే గోదావరి పారుతోంది, అక్కడికి వెళ్ళమన్నాడు.

నేను ఇంకొంచెం ముందుకు వెళ్లాను. అక్కడ నాకు ఇందాక అతను చెప్పినట్లుగానే పాత శివాలయం కనబడింది. పక్కన పారుతున్న గోదావరీ వుంది. నేను సంతోషంతో గోదావరిలో దిగి స్నానం చేసాను.

శ్రీ సాయి సచ్చరిత్ర పుస్తకం ఆ నదిలోకి తీసుకువెళ్ళి మద్యలో నిలబడి బాబాకి గోదావరికి దండం పెట్టి బాబా సచ్చరిత్ర పుస్తకం కొంచెం చదివాను. బయటికి వచ్చి అన్నీ సర్దుకొని నేను హారతి సమయానికి శిరిడికి చేరుకోవాలనుకొంటున్నాను.

వెళ్ళిపోవటానికి తొందర పడుతున్నాను. ఇంతలో మళ్ళీ ఇక్కడ దాకా వచ్చి శివుని దర్శనం చేసుకోకుండా ఎలా వెడతామనుకొని అనుకొని శివాలయం లోపలికి వెళ్లాను.

లోపల ఎవరూ లేరు, శివలింగం వుంది. దండం పెట్టుకున్నాను, ఆ లింగం పక్కనే ఒక శంఖం వుంది. కొత్తప్రదేశం ఎవరైనా వచ్చి నన్నేమైనా అంటారేమో అని ఆలోచించకుండా ఆ శంఖం ఊదాలనిపించింది.

అనుకున్నదే తడవుగా ఇంకేం ఆలోచించకుండా ఆ శంఖం చేతిలో తీసుకొని గట్టిగా ఊదేశాను, నేనలా శంఖం ఊదేటప్పటికి ఆ శబ్దానికి ఎవరయినా వస్తారేమోననుకున్నాను, కానీ ఎవరూ రాలేదు.

ఆ శంఖం అక్కడ పెట్టి తిరిగి శివుడికి దండం పెట్టి బయటికి వచ్చాను. ఈ లోపు అక్కడికి ఒక యోగివస్తున్నాడు, ఆయనతో కూడా కొంతమంది జనం కూడా వున్నారు. ఆ పక్కనే ఆయనది చిన్న ఆశ్రమం ఉంది.

ఆయన కొద్ది రోజులుగా అక్కడికి రావటం లేదుట, ఆ రోజే వచ్చారుట. ఆయన కాషాయం బట్లలు ధరించి ఉన్నాడు. ఆయన నన్ను చూసి దగ్గరకు పిలిచాడు. నేను జరిగేదంతా అయోమయంగా చూస్తూన్నాను ఆ యోగి నన్ను ఆ ఆశ్రమం దగ్గరికి తీసుకువెళ్ళాడు.

నాకు తలపైన కిరీటం లాగా ఒక గుడ్డ కట్టాడు. అక్కడేం జరుగుతుందో నాకేమీ అర్ధం కావట్లేదు, ఈయన ఎవరో ఇక్కడికి ఎందుకు వచ్చాడో, ఎందుకు పిలిచాడో నాకే ఎందుకు తలగుడ్డ కట్టాడో ఏం తెలియటంలేదు.

నాకు శిరిడికి వెళ్ళిపోవాలని వుంది. మద్యాహ్న హారతికి సమయం అయిపోతోంది, వీళ్లేమో నన్ను ఇక్కడ ఆపేస్తున్నారు. నా చేతికి ఒక పళ్ళెం ఇచ్చారు.

ఆ పళ్ళెంలో ఒక దీపం దాని మీద గాజు చిమ్నీ పైన మూతా ఉన్నాయి. ఆ కుటీరం లోపల బాబా ఫోటో ఉంది. హారతి ఇమ్మనట్లుగా సైగచేసి, తాను హారతి పాట పాడటం మొదలు పెట్టాడు.

నాకేమీ అర్ధం కావటం లేదు, మంత్రం వేసినట్లుగా ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేసుకు పోతున్నాను.

ఇంతలో పెద్ద శబ్దం అయింది, ఎమైందా అని నేను ఆ గుడిసె కప్పుకేసి చూసాను, అదేమయినా కూలిపోతోందేమో నని అనుమానం తో, అది బాగానే ఉంది,

నేను పట్టుకున్న పళ్ళెంలో దీపం చుట్టూతా వున్న గాజు చిమ్నీ రూపాయి బిళ్ళ పరిమాణంలో రౌండ్‌ గా పగిలి వెలుతురులో ఒక ముక్క బయటకి వచ్చి పళ్ళెంలో పడింది.

అందులో వెలుగుతూ బాబా మూర్తి నాకు కనబడింది. అక్కడున్న వారందరూ ఆ దృశ్యాన్ని చూసారు, బాబాని చూసారు.

ఎంత ఆశ్చర్యం ఎంత అద్భుతం నేనేమో హారతికి పోవాలని తహతహ లాడుతుంటే ఆ యోగి రూపంలో. సాక్షాత్తూ బాబానే వచ్చి తన హారతి తానే పాడుకొని హారతిని నా చేతికిచ్చి, నాకు భాష రాదు, ఆయనను నేనుకాని, నన్ను అయన కాని ఎరుగము

హారతిని నా చేత ఇప్పించుకోవటం పైగా ఇదంతా నేను (బాబాయే) చేస్తున్నానని మనకి తెలియటం కోసం, ఆ అద్దం పగిలి రూపాయంత బిళ్లలో తానే జ్యోతిస్వరూపుడుగా ప్రత్యక్షమవ్వడం ఇదంతా ఆయన లీల కాదా!

ఒకసారి నాన్నకి నడుం నెప్పి వచ్చింది. ఎన్ని మందులు వాడినా తగ్గలేదుట. ఒక రోజు బాధపడుతూ నాకు ఫోన్‌ చేసారు. అప్పుడు నేను బాబాకు చెప్పాను.

‘బాబా నాన్న పెద్దవయసు వారు ఆయన ఈ నెప్పి భరించలేరు. నువ్వేంచేస్తావో ఎమో ఆయనకానెప్పి తీసేసేయి బాబా” అని దండం పెట్టుకున్నాను.

పల్లెటూర్లలో రాత్రులు పెందరాడే పడుకోవడానికి పక్కలు వేసుకుంటారు. రాత్రి 11 గంటలకి ఒకాయన నాన్న దగ్గరికి వచ్చి “నేను ఎవరి దగరికి వెళ్ళను, నీ దగ్గరకే వచ్చాను, నీకేదో నడుం నెప్పిగా వుంది అన్నావుటకదా” అంటూ మా నాన్న నడుము మీద తోమారుట.

ఎంతో మెత్తగా ఉన్నాయట ఆ చేతులు. మా నాన్న ఆ మనిషిని కళ్ళారా చూసారుట. వెంటనే నెప్పి తగ్గిపోయిందట.

ఆ మర్నాడు ఉదయం నాన్న నాకు ఫోన్‌ చేసి విషయం చెప్పి, ఆయన నెత్తిన గుడ్డవుంది, భుజానికి జోలివుంది ఆయన్ని నేను చూసాను అని చెప్పాడు.

మా తండ్రిగారి నడుము నెప్పి తానే స్వయంగా వచ్చి నడుముతోమి నొప్పిని మాయం చేసిన ఘనవైద్యుడు ఆ సాయినాధుడు కాదా!

సర్వం శ్రీ సాయినాధ చరణారవిందార్పణ మస్తు

శుభం భవతు

 

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles