నాకు చెప్పలేనంత ప్రశాంతంగా అనిపించింది కల



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై !!
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కి జై !!

గురువు గారు పరిచయం అవడానికి కొన్ని రోజుల ముందు అనుకుంట.వినాయక చవితి రోజు మార్నింగ్.కలలో ఒక పెద్ద చెట్టు కనిపించింది.దాని దగ్గర నీట్ గా పాలిష్ బండ వేశారు.చుట్టూ ఫెన్షన్ వేశారు.చాల ప్రశాంతగా ఉంది.

ఆ చెట్టు కింద కూర్చొని నేను గురుచరిత్ర పారాయణ చేస్తున్నాను.నాకు ఆ ప్లేస్ ప్రశాంతంగా అనిపించి తరువాత రోజు కూడా అక్కడే గురుచరిత్ర పారాయణ చేద్దామని వెళ్తున్నాను.

మధ్యలో మా గోపి కనిపించి పక్కన టెంపుల్ లోకి వెళ్దాం రా అక్క అంటే,లేదు నిన్న ఇక్కడ ఒక చెట్టు చూసా ప్రశాంతంగా ఉంది అక్కడ గురుచరిత్ర చదివి తరువాత టెంపుల్ కి వెళ్దాం అని తనని కూడా చెట్టు దగ్గరికి తీసుకెళ్ళాను.నేను బయటకు చదువుతూ గోపికి వినిపించాను.

తరువాత అక్కడ డిజైన్ ని చూసా చాల బాగుంది.నేను ఎప్పుడు అలాంటి ఆర్కిటెక్శ్చర్ ని చూడ లేదు.చుట్టూ వెంటిలేషన్ ఉండేలా మొత్తం చెక్కతో డిజైన్ చేసి ఉంది.నాకు బాగా నచ్చింది.

 తరువాత టెంపుల్ లోపలి వెళ్ళాను.అక్కడ ఒక పెద్ద సమాధి ఉంది.ఆ సమాధికి రెండువైపులా చెక్కతో మెట్లు ఉన్నాయి.అందరు ఆ చెక్క మెట్ల పై నుండి సమాధి పైకి వెళ్లి నమస్కరిస్తున్నారు.మా టెంపుల్ వాళ్ళు కూడా కొంతమంది కనిపించారు.నేను వాళ్లతో పాటు సమాధి దగ్గర ఉన్న చెక్క పై మెట్టు వరకు వెళ్లి సమాధిని తాకి నమస్కరించాను.చల్లగా ఉంది.తరువాత మెలుకువ వచ్చింది.

1st పండగ రోజు ఏంటి ఇలా సమాధి కలలో వచ్చింది అనుకుని బయమేసింది. కానీ తరువాత అందరు ప్రదక్షిణాలు చేసుకుంటూ,సమాధికి నమస్కారం చేసుకుంటున్నారు అంటే,ఎవరో మహాత్ముడి సమాధి అది.పండగ రోజు ఆలా రావడం మంచిదేలే అనుకున్న.

ఎవరో ఆ మహాత్ముడు తెలిస్తే బాగుండు అనిపించింది. నాకు చెప్పలేనంత ప్రశాంతంగా అనిపించింది కల . ఆ కల నన్ను చాల రోజులు వెంటాడింది.ఆ చెట్టు.ఆ సమాధి ఎక్కడో తెలుసుకోవాలని అనిపించి నాకు తెలిసిన వాళ్ళని ఆ పోలికలు గురించి చెప్పి అడిగితె ఎవరు అలాంటిది మాకు తెలియదు అని చెప్పారు.

గురువు గారు పరిచయం అయ్యాక అక్క వాళ్ళ ఇంటిలో శరశ్చంద్రికలు ఒక మంత్ఆర్టికల్ జిరాక్స్ కనిపించింది. అందులో గురువుగారి ఫోటో ఒక చెట్టుకింద కూర్చొని ధ్యానం చేసుకుంటున్నది కనిపించింది ఆ ఫోటో లో కొంచం నాకు కలలో కనిపించిన ఆర్కిటెక్ పార్ట్ కనిపించింది.నాకు కలలో కనిపించింది అదే చెట్టు అనుకుని హ్యాపీ అనిపించింది.

కాకపోతే కలలో ఆ చెట్టుకింద నేను గురుచరిత్ర చదువుతూ ఉన్నాను.ఈ ఫొటోలో గురువుగారు ధ్యానం చేసుకుంటూ ఉన్నారు.నేను కలలో అవి చెక్కతో చేసిన డిజైన్ అనుకున్నాను కానీ,ఫొటోలో ఏదో మెటల్ తో చేసినట్టు కనిపించింది అది ఎక్కడ అని తెలుసుకుందా అనుకుని చుస్తే బోధ గయా అని ఉంది.

పక్కన మ్యాటర్ ఏమో ఎక్కువ అరుణాచలం గురించి ఉంది.కలలో కనిపించిన చెట్టు ఓకే ,కానీ ఆ సమాధి ఎవరిదో అర్ధం కాలేదు.నేను ఏ కల గురించి అంతగ తెలుసుకుందాం అని ట్రై చేయలేదు కానీ,ఈ కల గురించి ఎప్పుడు ఆ సమాధి గురించి తెలుసుకోవాలని అనిపించేది.

ఆలా ఒక ఆరు నెలలు అయిపోయాక సంక్రాంతికి ఇంటికి వెళ్లి వచ్చాను.ఆఫీస్ లో సర్ లేదు,వర్క్ లేదు ఖాళీగా ఉన్నప్పుడు ఈ సమాధి గుర్తొచ్చి గూగుల్ చేద్దాం అని,అందరు మహాత్ముల సమాదులని సెర్చ్ చేస్తున్న.ఎందుకంటె నాకు అప్పటివరకు గురువుగారిది తప్ప ఎవరి సమాధులు ఎలా ఉంటాయో తెలియదు.

ఆలా చాల సెర్చ్ చేశా.ఏవి నేను చుసిన సమాధి లాగా లేవు.విసుగొచ్చి ఆఫ్ చేద్దాం అనుకున్నప్పుడు ఏదో వీడియో.ఎయిర్ వ్యూ లో కనిపించింది.ఇది ఒక్కటి చూసి క్లోజ్ చేద్దాం అనుకున్నాను.

అది అరుణాచలం గురించిన వీడియో అరుణాచలం కొండ, టెంపుల్ గురించి తమిళ్ వీడియో.నాకు ఆ తమిళ్ బోర్ కొట్టింది కానీ శివుడు నా ఫేవరేట్ గాడ్ కదా.ఆలా మధ్యలో ఆఫ్ చేయాలనిపించక ఆలా చూస్తూ ఉన్నాను.

రమణ మహర్షి గురించి చెప్పారు. మహర్షి వీడియోచూపించి తన గురించి చెప్తున్నారు.నాకు రమణ మహర్షి గురించి అప్పటికి ఏమి తెలియదు.బోర్ గా తప్పదు అని చూస్తున్నా. లాస్ట్ కి అందరు ఒక సమాధి ని కడుగుతున్నారు.

అప్పుడు చూసా ఆ సమాధిని. నేను కలలో చూసినట్టే చాల పెద్దగా ఉంది.చెక్కతో చేసిన స్టెప్స్ ఉన్నాయేమో అని చూసా,అటు ఇటు చెక్కతో చేసిన స్టెప్స్ ఉన్నాయి సమాధి మీద నీటితో క్లీన్ చేస్తున్నారు.నేను అదేనా కాదా అని మళ్ళీ,మళ్ళీ, మళ్ళీ చూసా అదే సమాధి.

కానీ కలలో నాకు సమాధి పైన శివలింగం కనిపించలేదు.ఇక్కడ శివలింగం ఉంది.అదే తేడా అంతే.నాకు హ్యాపీ అనిపించింది మొత్తానికి దాదాపు ఆరు నెలలుగా తెలుసుకోవాలన్న సమాధి ఎవరిదో తెలుసుకున్నాను.అది రమణ మహర్షిది.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles