Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
నాపేరు మారుతి. నాకు జరిగిన బాబాగారి లీలను share చేస్తున్నాను సాయి.
నేను ఎనిమదవనెల ప్రగ్నెంట్. 22-2-2019న రాత్రి సుమారు 12 దాకా నాకు నిద్ర పట్టలేదు.
తరువాత నిద్ర పట్టింది. కాసేపటికి తల తిరుగుతూ వుంది అంటే కళ్ళు తిరగడం అనుకుంటా. అలా తల తిరుగుతూ వున్న సమయంలో నాకు మెలుకూ వచ్చింది.
మెలకువ వచ్చాక కూడా కళ్ళు తిరగుతూనే వున్నాయి. ఆగడం లేదు.
మావారిని లేపాను. అప్పటి వరకు ఆఫీస్ వర్క్ చేసుకొని పడుకున్న మావారు నిద్ర లేచారు.
కళ్ళు తిరుగుతున్నాయి, Vomthing అయ్యేలా వుంది అని చెప్పాను. దగ్గరలో వున్న బాత్రూం డోర్ ఓపెన్ చేయమన్నాను Vomthing అయ్యేలా వుంది అని.
మావారు Bathroom door open చేసారు.కాని నాకు Vomthing అవలేదు.
పడుకుంటే తల తిరిగిపోతంది, కాసేపటికి Vomthing అయింది.
Vomthing అయ్యాక కూడా పడుకుంటే తల తిరగడం తగ్గలేదు.
బాబావిబూధి నీళ్ళళ్ళో కలిపి ఇవ్వమన్నాను మావారిని. అలాగే ఇచ్చారు. త్రాగాను.
పడుకొని వుండి ఒకవైపు నుండి ఇంకోవైపుకి తిరిగితే బాగా కళ్ళు తిరుగుతున్నాయి . లేదంటే అంత అనిపించడంలేదు
అలా పడుకొని వుండి ఒకవైపు నుండి ఇంకోవైపుకి తిరగడం వలన మళ్ళీ తల తిరగడంతో పాటు మళ్ళీ Vomthing కూడా అయింది.
బాబా విబూధి నీరు త్రాగినాక కూడా Vomthing అయిందే అనుకుంటూ, కడుపులో ఏదో అనారోగ్య సంబంధితమైన bad బయటకు వచ్చి వుండొచ్చు vomthing రూపములో, బాబా లీలలు ఎన్నో కదా అనుకున్నాను.
బాబాని తలచుకుంటూ చిన్నగా పడుకున్నాను.ఒక వైపు పడుకోలేకున్నాను ఎనిమదవ నెల pragnency వలన. మరోవైపుకు తిరుగుతుంటే తల తిరిగిపోతంది.
మొదటి కల:- అలాంటి సమయంలో బాబాని తలచుకుంటూ తగ్గించమని పడుకున్నాను. నిద్రపట్టింది. కలలో బాబావారి Satcharitra Book లేదా శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్, షిర్డి డైరీలో అనుకుంటా మొదటి లేదా రెండవ పేజీలో అనుకుంటా బాబా విగ్రహం మరియు సమాధి ఫోటో కనపడుతుంది కలలో. ఈ కలలో బాబావారి(బాబావారి విగ్రహం మరియు సమాధి) డ్రెస్ Yellow కలర్.
ఇక కల అయ్యాక మెలుకూ వచ్చింది.
రెండవ కల:- తరువాత వెంటనే మరలా నిద్ర పట్టింది.మళ్లీ కల వచ్చింది. కలలో బాబాగారి గుడి గోపురం కనపడింది.
కల అయ్యాక మెలుకూ వచ్చింది .
ఇక మళ్లీ హాయిగా నిద్ర పట్టింది ఉదయం 8 గంటల వరకు,
బాబా కల వచ్చాక భయపడవలసినది యేమీ ఉండదు అనుకున్నాను .
ఒకవైపు నుండి మరోవైపుకు తిరిగి పడుకోకుండా ఉంటే మాత్రము కళ్ళు తిరగడం లేదు.
ఆ సమయములో బాబాగారి కల నాకు ధైర్యాన్ని ఇవ్వడమే కాకుండా హాయిగా నిద్ర పట్టింది.
బాబాగారి స్వప్న దర్శనముల తరువాత ఇక తరువాత రోజు పొద్దునకి సగంపైన తగ్గింది.కొంచెం నిదానంగా గంటల లోపే మొత్తం తగ్గింది హాస్పిటల్ కి వెళ్లక ముందే.
అనారోగ్యంలో వున్న నాకు స్వప్న దర్శనం ఇచ్చి అనారోగ్యాన్ని తొలగించిన బాబాగారికి నా కృతజ్ఞతలు.
నాకు ఈ లీల జరిగాక ఒక లీల గుర్తుకు వస్తుంది. శ్రీ సాయి సచ్చరిత్రలో 13వ అధ్యాయములో భీమాజీపాటీలుగారికి బాబాగారు రెండు స్వప్న దర్శనములను ఇచ్చి అతని రోగమును బాబా కుదిర్చెను.
నాకు జరిగిన ఈ లీలలో కూడా రెండు స్వప్న దర్శనములను ఇచ్చి బాబాగారు కళ్ళు తిరగడం తగ్గించారు.
బాబాగారి లీలలు అనంతము,అద్భుతము.
తల్లిలా కాపాడే బాబాగారికి మరొక్కసారి నా కృతజ్ఞతలు.
సాయి బాబా …. సాయి బాబా … సాయి బాబా …సాయి బాబా
Latest Miracles:
- 22 సార్లు చెక్ బౌన్స్ కేసులైతే నన్ను ఒకసారి కూడా కోర్టు బోను ఎక్కకుండా, నాకు సమస్యలేమీ రాకుండా బాబాగారు నన్ను కాపాడారు.
- బాబా నీ దగ్గర నాకు రెండు పూటలా రెండు రొట్టెలు పెట్టి చీపురు తో ఊడ్చే పని అయినా నాకు ఇప్పించు
- నా తలపై ఉన్నప్పటికీ ఆ తేలు నాకు ఏ హాని చేయలేదు
- నా మీద బాబా కు చాలా కృప ఉంది, నా పిల్లలు కూడా నాకు ఇంత సంతోషం ఎప్పుడూ ఇవ్వలేదు.
- నా బ్యాగ్ తప్పిపోయింది అని తెలిసి నాకు కన్నీళ్లు వచ్చాయి బ్యాగ్ లో నా సర్టిఫికెట్స్ ఉన్నాయి.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
2 comments on “నాకు రెండు సార్లు స్వప్న దర్శనము ఇచ్చి కళ్ళు తిరుగుతున్న నా సమస్యను తొలగించారు బాబాగారు.”
maruthi
February 27, 2019 at 12:07 pmసాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా 🙏
“భక్త భీమాజికి క్షయరోగం
నశియించే అతని సహనం
ఊదీవైద్యం చేసావు
వ్యాధిని మాయం చేసావు”
కాకాజీకి ఓసాయి
విఠల దర్శనమిచ్చితివి
దామూకిచ్చి సంతానం
కలిగించితివి సంతోషం
ఓం షిరిడివాసా సాయిప్రభో
జగతికిమూలం నీవె ప్రభో
దత్తదిగంబర అవతారం
నీలో సృష్టి వ్యవహారం
ఓం షిరిడివాసా సాయిప్రభో
జగతికిమూలం నీవె ప్రభో ”
సాయి బాబా …. సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా ….🙏
Sai Baba
March 2, 2019 at 4:04 am🙏🌹Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba🌹🙏