Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio Prepared by Mrs Lakshmi
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ -2
ఆడైరీలోని కొన్ని భాగాలు 1977-78 లో శ్రీసాయిలీలా పత్రికలో ధారావాహికంగా ప్రచురింపబడ్డాయి. ఈడైరీ గురించి, దాని ఆంగ్లానువాదకుడు తన ఉపోద్ఘాతంలో ఇలా వ్రాసుకొన్నారు.
ఈ డైరీ బాబా జీవిత చరిత్రను గురించిన సమాచారాన్నందించే మొట్టమొదటి ఆధారం. పెప్సి యొక్క, యావలిని యొక్క డైరీలు వారివారి కాలాలకు సంబంధించి ఆగ్లేయుల చరిత్ర రచనకు ఎలా ఉపయోగ పడ్డాయో అలాగే శ్రీ ఎం.ఎస్.దీక్షిత్ మరాఠీలోనూ, శ్రీ జీ.ఎస్.ఖపర్దే ఆగ్లంలోను వ్రాసుకొన్న డైరీలు శ్రీసాయి చరిత్రకు విలువైన ఆధారాలు. బాబా లీలలను జాగ్రత్తగా అధ్యయనం చేస్తే సాధకులు తమ గమ్యం చేరడానికి బాబా ఎలా దోహదం చేసేవారో విశద పడుతుంది.
దీక్షిత్ డైరీ చదివే ఏపాఠకుడికయినా అదే లక్ష్యం కావాలి. దీక్షిత్ డైరీ ఎంతో విలువైనది. ముఖ్యంగా క్రొత్తగా బాబా రచనలోనికి వచ్చిన భక్తులకు ఇది ఎంతో సహాయకారి. తన భక్తుల యోగక్షేమాల బాధ్యత పూర్తిగా తానే వహిస్తానని బాబా యిచ్చిన హామీ కాకా సాహెబ్ దీక్ష్తిత్ కు మాత్రమే పరిమితం కాదు.
కాని, బాబాను ప్రత్యక్షంగా సేవించి అలాంటి రక్షణే పొందిన దాసగణువంటి చాలామంది ఇతర భక్తులు తమ అనుభవాలను తమ అధ్యాత్మిక పురోగతిని డైరీ రూపంలో గ్రంధస్తం చేసుకోకపోవడం శొచనీయం.
ఉపాసనీ బాబా కూడా ఎన్నో ఏళ్ళు బాబా పూర్తి సంరక్షణలో ఉన్నారు.
కాని దురదృష్ట వశాత్తు ఉపాసనీ బాబా క్రమ బధ్ధమైన డైరీ వ్రాసుకోకపోవడమే కాక, తరువాతి రోజుల్లో తాము మొదట ఏసంత్సరంలో బాబా వద్దకు వచ్చారో బాబా వద్ద ఎంత కాలం ఉన్నారో కూడా మర్చిపోయారు.
ఉదాహరణకు బాబా ఆదేశానుసారం ఉపాసనీ జీవిత చరిత్ర.. ఉపాసనీ లీలామృతం వ్రాసిన రచయిత ఉపాసనీ బాబా నాలుగు సంత్సరాలు బాబా ఆజ్ఞ ప్రకారం షిరిడీలో ఉన్నట్లుగా పేర్కొన్నారు.
కాని, ఆతరువాత ఖపర్దే డైరీ, బాలకృష్ణ ఉపాసనీ శాస్త్ర్రి వద్ద వున్న ఉత్తరాల సహాయంతో చేసిన పరిశోధనల వల్ల శ్రీఉపాసనీ మహారాజ్ షిరిడీలో ఉండమని బాబా పెట్టిన నాలుగు సంవత్సరాల గడువు పూర్త్రి చేయలేదని కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే అంటే జూన్ 1911 నుండి జూన్ 1914 వరకు షిరిడీలో ఉన్నారన్న విషయం బయట పడింది.
ఆతరువాత ఆయన అంటే శ్రీఉపాసనీ ఎన్నో సందర్భాలలో షిరిడీ సందర్శించినా బాబా విధించిన ఆనాలుగు సంవత్సరాల గడువు మాత్రం పూర్తి చేయలేదు.
ఖపర్దే, దీక్షిత్ డైరీలవంటి ఆధారాల వల్లనే శ్రీసాయి భక్తుల జీవితాలకు సంబంధించిన అధ్యయనంలో యిటువంటి విషయాలు వెలుగులోకి రావడం సాధ్యపడుతుంది.
చారిత్రక సత్యాల నిర్ధారణకు యిటువంటి డైరీలు ఎలా ఉపయోగపడతాయో చెప్పడానికి యిది ఒక ఉదాహరణ మాత్రమే.
కాని జీవిత చరిత్రలకు సంబంధించిన సంఘటనల నిర్ధారణకే కాక ఈ డైరీల అధ్యయనం వల్ల కొందరు ఎలా తమ ఆరోగ్యం, లౌకిక, ఆధ్యాత్మిక విషయాలలో పురోగతి సాధించారో ఈ డైరీలు చదివిన పాఠకులు గమనించగలరు
.ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ – 1–Audio
- కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ – 3
- కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ – 2వ. అధ్యాయం–Audio
- కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ – 3వ. అధ్యాయం–Audio
- కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ – 6వ. అధ్యాయము–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments