Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio Prepared by Mrs Lakshmi
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ – 6వ.అధ్యాయం
బాబా అడిగిన పైకం వెనుక పరమార్ధం
ఒకసారి నేను (కాకాసాహెబ్ దీక్షిత్) షిరిడీలో ఉండగా నాచ్నే, శంకరరావు కూడా అక్కడికి వచ్చాడు.
శ్రీసాయిబాబా వారి ని 16 రూపాయలు దక్షిణ అడిగారు. వారి వద్ద అంత పైకం లేదు. కాని ఈ విషయం వారు బాబాకు చెప్పలేదు.
బాబా స్వయంగా దక్షిణ అడిగినా తాము యివ్వలేకపోయామని చాలా బాధపడి బసకు తిరిగి వచ్చాడు.
ఈ విషయం గురించే ఆలోచిస్తూ ఊరికి తిరిగి వెళ్ళారు. మరొకసారి వారు షిరిడీ వచ్చి బాబాను దర్శించుకున్నపుడు బాబా 32రూపాయలు దక్షిణ అడిగారు.
ఈ సారి కూడా తాము బాబాకు దక్షిణ ఇవ్వలేకపోయినందుకు చాలా బాధపడ్డారు.. ఈ విషయం నాకు చెప్పాడు. నేను నవ్వి,, “శ్రీసాయిబాబా పైకం గురించి అడిగినపుడు మీ దగ్గర లేదని చెప్పవచ్చు కదా.
మౌనంగా ఎందుకు వున్నారు” అన్నాను. ఈ సారి కనక బాబా దక్షిణ అడిగితే అదే చెబుతాను అన్నాడు శంకరరావు .
వారిద్దరూ కలిసి మసీదుకు వెళ్ళినపుడు శ్రీసాయిబాబా శంకరరావుని 64 రూపాయలు దక్షిణ అడిగారు.
“అంత డబ్బు మాదగ్గర ఎలా ఉంటుంది బాబా” అని అన్నారు . “మీవద్ద లేకపోతే అందరినీ అడిగి తీసుకు రండి” అన్నారు బాబా.
ఇది జరిగిన కొన్ని రోజులకి బాబాకు బాగా అనారోగ్యం చేసింది. శ్రీసాయిబాబా ఆరోగ్యం కోసం భక్తులు నామ సప్తాహం అన్నదానం నిర్వహించారు.
ఆసందర్భంగా దభోల్కర్ భార్య, వామన్ బాల కృష్ణారావు చందాలు వసూలుకు బయలుదేరాలనుకున్నారు. వామనరావు ఆకార్యాన్ని తన తమ్ముడయిన శంకరరావుకు అప్పగించి ఆవిషయం నాచ్నేకు కూడా చెప్పాడు.
ఆ తరువాత వారు చందాలు వసూలు చేశారు. చందాలన్నీ వసూలయిన తరువాత లెక్కపెట్టగా చందాల ద్వారా వచ్చిన మొత్తం సరిగా 64 రూపాయలు ఉంది.
కొద్ది రోజుల క్రితం బాబా సరిగ్గా అదే మొత్తం అందరి దగ్గరా వసూలు చేయమని చెప్పిన విషయం గుర్తుకు వచ్చి ఆశ్చర్యపోయారు.
ఆపద్భాందవుడు:
31.03.1995 న నాచ్నే అతని సహోద్యోగి మోరేశ్వర్ పాన్సీ ఒక ప్రభుత్వ సంబంధమయిన పని ముగించుకుని యింటికి తిరిగి వస్తున్నారు.
వారు వచ్చే దారి చాలా దట్టమయిన అడవి. ఆదారిలో ఒక్క ఎద్దులబండి మాత్రమే ప్రయాణ సాధనం. వారు తాన్ షెట్ ప్రాంతానికి చేరుకునేటప్పటికి అర్ధరాత్రయింది.
ఆ అడవిలో పులులు తిరుగుతూ ఉంటాయి. హటాత్తుగా ఎడ్లబండి వెనుకకు నడవటం మొదలుపెట్టింది. ఎద్దులు అలా ఎందుకని వెనుకకు నడుస్తున్నాయో వారికికు ఆశ్చర్యం వేసింది.
ఎంత ఆలోచించినా వారికి మొదట కారణం తెలీలేదు. వారు వెళ్ళే రోడ్డు బాగా ఎత్తుగా ఉన్న రోడ్డు. ఒకవైపు లోయ, మరొక వేపు కొండలు ఉన్నాయి.
ఎడ్లబండి యింకాస్త వెనుకకు వెళ్ళినట్లయితే అందరూ లోయలోకి పడిపోతారు. అపుడు పాన్సే ఎదుటికి వేలూ చూపిస్తూ అటు చూడమన్నాడు.
ఎదురుగా ఒక పెద్ద పులి మాకేసే చూస్తూ కనపడింది. ఆపులి రోడ్డుకు ఒక ప్రక్కనున్న కొండలలోంచి వచ్చింది.
ఎద్దులు కనక భయంతో బెదిరి కొద్దిగా ప్రక్కకు తప్పుకుంటే బండి తలక్రిందులై లోయలో పడిపోతే మరణమే. ఒకవేళ బండి దిగి బండి పడిపోకుండా ఆపుదామన్నా పులి వచ్చి దాడి చేస్తుంది.
పాన్సే బండి దిగి, బండి వెనుకకు దొర్లిపోకుండా చక్రాల కింద రాయి పెట్టి ఆపుదామనుకున్నాడు.
అతను మరొక వైపు నుంచి బండి దిగాడు. యింకా బండిలోనే కూర్చున్న నాచ్నే గట్టిగా అరుస్తూ,జయజయ సాయిబాబా పరుగున వచ్చి మమ్మాదుకోవయ్యా” అని అరిచాడు.
అప్పుడా పెద్దపులి లేచి రోడ్డుకు కుడివైపు నుండి దూకి వారివైపే చూస్తూ బండి ప్రక్కనుంచి వెళ్ళిపోయింది.
పులి వెళ్ళిపోగానే ఎద్దులు పరుగు లంకించుకోవడం వల్ల ప్రమాదం నుండి బయట పడ్డారు. సద్గురు నామస్మరణే వారిని కాపాడింది.
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ – 10వ. అధ్యాయము–Audio
- కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ – 9వ. అధ్యాయము–Audio
- కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ – 5వ. అధ్యాయము–Audio
- కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ – 4వ. అధ్యాయము–Audio
- కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ – 11వ. అధ్యాయము….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments