Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio prepared by Mr Sri Ram
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
ఈ రోజు డైరీ లోని విశేషం చదవండి. ఇందులో సాయి మహరాజ్ చెప్పిన కధ ద్వారా మనం గ్రహించుకోవలసిన ముఖ్యమయిన విషయం ఉంది.
జాగ్రత్తగా చదివి ఆకళింపు చేసుకోండి. చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం తప్పదు. మనది కాని సొమ్ము, అనగా పరుల సొమ్మును ఆశించకూడదని, ఆవిధంగా సంపాదించిన సొమ్ము నిలవదని మనం గ్రహించుకోవచ్చు. ఎవరికేది ప్రాప్తమో అదే లభిస్తుంది.
మరు జన్మకైనా లభిస్తుందనేది సాయి మహరాజ్ చెప్పిన కధ ద్వారా మనకి బోధ పడుతుంది.
శ్రీ జీ.ఎస్. ఖపర్డే డైరీ – 17
04.01.1912 గురువారమ్
ప్రొద్దున్న తొందరగా లేచి, ప్రార్ధన చేసుకున్నాను.
మా అబ్బాయి బాబాని, గోపాలరావు దోలేని సాయి మహరాజ్ వద్దకు వెళ్ళి అమరావతి వెళ్ళడానికి అనుమతి తీసుకుని రమ్మన్నాను.
కాని , నా భార్య మధ్యలో కల్పించుకుని ఆరోజు పౌష్య పూర్ణిమ అని మన కుల దేవతకు పవిత్రమయిన రోజని చెప్పి వద్దంది. అందుచేత ప్రయాణానికి అనుమతి తీసుకునే ప్రయత్నం చేయలేదు.
నేను, ఆయన ఎప్పటిలాగే బయటకు వెళ్ళటం, తిరిగి మసీదుకు రావటం చూశాను. ఈ లోపులో నేను రామాయణం చదువుకున్నాను.
మధ్యాహ్న ఆరతి తరువాత, వచ్చి భోజనం చేసిన తరువాత బాపూసాహెబ్ జోగ్ తో మాట్లాడుతూ కూర్చున్నాను. మళ్ళీ రామాయణం చదవడం తిరిగి ప్రారంభించాను.
సాయంత్రం 5 గంటల తరువాత మసీదుకు వెళ్ళాను.
సాయి మహరాజ్ బయట ఆవరణలో తిరుగుతూ కనిపించారు. నాభార్య కూడా అక్కడికి వచ్చింది. కొంత సేపటి తరువాత ఆయన తను ఎప్పుడూ కూర్చునే చోట కూర్చోగానే మేము ఆయన దగ్గరగా కూర్చున్నాము.
దీక్షిత్ అతని భార్య కూడా వచ్చారు. సాయి మహరాజ్ ఒక కధ చెప్పారు.
“ఒక రాజ భవనంలో ఒక రాకుమార్తె ఉంది. ఒక హీనుడు ఆమె వద్ద ఆశ్రయం పొందాడు.
ఆమెతోపాటే ఉన్న ఆమె మరదలు అతనికి ఆశ్రయం ఇవ్వడానికి నిరాకరించింది. అప్పుడతను దుఃఖిస్తూ తన భార్యతో తన గ్రామానికి తిరిగి వస్తుండగా దారిలో అల్లా మియా కనిపించాడు.
అతనికి తన కధంతా చెప్పాడు హీనుడు. పేదరికం బారినపడి రాకుమారి వద్ద ఎలా ఆశ్రయం పొందినది,
తరువాత ఎలా పంపించివేయబడ్డది, అంతా చెప్పాడు. మరలా తిరిగి వెళ్ళి అదే రాకుమార్తె వద్ద, ఆశ్రయం ఇమ్మని మరలా అడగమని సలహా ఇచ్చాడు.
అతను ఆ విధంగానే చేసి, మరలా ఆశ్రయం పొంది వారి కుటుంబ సభ్యుడిగా ఆదరణ పొందాడు.
అతను అన్ని సుఖాలు ఆనందంగా అనుభవిస్తూ బంగారం మీద కాంక్షతో, గొడ్డలితో రాకుమార్తెను హత్య చేశాడు.
చుట్టుప్రక్కల ప్రజలంతా అతని చుట్టూ పోగయి పంచాయితే చేశారు.
అతను తన నేరం ఒప్పుకున్నాడు. ఆ తరువాత ఈవిషయం రాజుగారికి చేరింది.
అల్లామియా అతనిని వదిలేయమని సలహా ఇచ్చాడు. రాజు దానికి అంగేకరించాడు.
హీనుడి చేత హత్య చేయవడ్డ రాకుమారి అతనికి కూతురుగా జన్మించింది. అతను మరలా రాజభవనానికి వచ్చి, మరలా భోగ భాగ్యాలతో పన్నెండు సంవత్సరాలు రాజభవనంలో ఉన్నాడు.
అపుడు అల్లామియా రాకుమార్తెను హత్య చేసిన హీనుడి మీద ప్రతీకారం తీర్చుకొమ్మని రాజును ప్రేరేపించాడు.
హీనుడు ఏవిధంగా రాకుమార్తెను హత్య చేశాడో అదే విధంగా రాజు చేతిలో హతమయ్యాడు.
వాడి వితంతు భార్య తన భర్తకు తగిన న్యాయమే జరిగిందని తన గ్రామానికి వెళ్ళిపోయింది.
అతనికి కుమార్తెగా పుట్టిన రాకుమారి రాజభవనానికి వచ్చి, తన గత జన్మలో తనకు హక్కుగా సంక్రమించిన సంపదతో హాయిగా జీవించింది. ఆవిధంగా భగవంతుడు తన చర్యల ద్వారా న్యాయాన్ని చక్కగా స్థాపిస్తాడు.
రాత్రి శేజ్ ఆరతి, తరువాత భీష్మ భజన, దీక్షిత్ రామాయణం జరిగాయి. ఈ రోజు శేజ్ ఆరతికి సాయి మహరాజ్ చావడి ఉత్సవంలో వెడుతున్నపుడు రామమారుతి ఆయనను కౌగలించుకున్నాడు.
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
Latest Miracles:
- శ్రీ జీ.ఎస్.ఖాపర్డే- డైరీ 7 వ భాగం–Audio
- శ్రీ జీ.ఎస్.ఖాపర్డే- డైరీ 18 వ భాగం–Audio
- శ్రీ జీ.ఎస్.ఖాపర్డే- డైరీ 9 వ భాగం–Audio
- శ్రీ జీ.ఎస్.ఖాపర్డే- డైరీ 19 వ భాగం–Audio
- శ్రీ జీ.ఎస్.ఖాపర్డే- డైరీ 13 వ భాగం–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments