Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు ఇది షిర్డీ సంస్థాన్ వారు ప్రచురించిన సాయిలీల ద్వైమాసపత్రిక సెప్టెంబరు-అక్టోబరు 2013 సంచికనుండి గ్రహింపబడినది.బెంగళూరులో నివసిస్తున్న శ్రీకాంత్ శర్మ 1980 సంవత్సరం చివరలో జరిగిన సంఘటనలను గుర్తుకు తెచ్చుకుంటున్నారు.
ఆరోజుల్లో అతను విపరీతమయిన ఆస్త్మాతో బాధ పడుతున్నాడు. శ్వాస సరిగా ఆడాలంటే ప్రతిరోజు డెరిఫిలిన్ రెటార్డ్ మాత్రలు వేసుకోవలసిందే.
ఆయన ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. అతను, అతని కుటుంబం తగినంతగా ఆర్ధిక స్థోమత ఉన్నవాళ్ళు కారు.
అతని ఆఫీసులోనే పనిచేస్తున్న సహోద్యోగి రాజేష్. అతను ఎవరిని పలకరించినా అందరినీ’సాయిరాం’అనె సంబోధిస్తూ ఉంటాడు.
శ్రీకాంత్ కి సాయిబాబా గురించి తెలియకపోవడం వల్ల అతను ఆవిధంగా అందరినీ సంబోధించడం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉండేది. ఒకరోజున రాజేష్ తనతో షిరిడీ వచ్చి సాయిబాబా దర్శనం చేసుకొమ్మని, అతని సమస్యలన్ని తీరిపోతాయనీ చెప్పాడు. కాని షిరిడీకి వెళ్ళి రావడానికి 1500/- రూపాయలదాకా ఖర్చవుతుంది.
తన దగ్గిర అంత డబ్బులేకపోవడం చేత రానని చెప్పేశాడు శ్రీకాంత్. కాని రాజేష్, అతని స్నేహితుడు ప్రవీణ్ ఇద్దరూ శ్రీకాంత్ ని వదలి వెళ్ళదలుచుకోలేదు.
ప్రయాణం ఖర్చులు తరవాత యివ్వచ్చు ముందర షిరిడీ రమ్మని నచ్చ చెప్పారు.1989వ.సంవత్సరం జూన్ 7వ.తారీకున సమాధి మందిరానికి వెళ్ళి బాబాను దర్శించుకున్నాడు.
బాబాను దర్శించుకున్న తరువాత అతని మనసుకు, శరీరానికి ఎంతో ప్రశాంతత లభించినట్లుగా అనుభవమయింది.
11వ.తారీకున దర్శనం అయిన తరువాత తిరిగి వస్తూండగా ఒక విచిత్రమైన సంఘటన జరిగింది.
ఉదయం 2గంటలకు శ్రీకాంత్ కి శ్వాస కష్టమయి ఊపిరి కూడా పీల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. గదికి వచ్చాక ప్రవీణ్ వెంటనే బాబా ఊదీ అతని నోటిలో వేసి సాయి తారకమంత్రం “ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి”అనుకుంటూ ఉండమని చెప్పాడు.
కొంతసేపటి తరువాత కునికి పాట్లు పడి ప్రశాంతంగా నిద్రపోయాడు. ఉదయం లేచిన తరవాత తనకు శ్వాసలో ఎటువంటి యిబ్బంది లేదన్న విషయం గ్రహించి మందులు వేసుకోవడం మానేశాడు.
శ్వాసలో ఎప్పుడు యిబ్బంది కలిగినా బాబా ఊదీ నోటిలో వేసుకొని సాయినామ స్మరణ చేసుకునేవాడు.
బాబా అనుగ్రహం వల్ల అప్పటినుండీ యిప్పటివరకు అసలు మందులు ముట్టుకోలేదు. మొట్టమొదటి బాబా దర్శనంతోనే శ్రీకాంత్ బాబాకు గొప్ప భక్తుడయిపోయాడు.
ప్రతివారితోనూ బాబా లీలల గురించే చెబుతూ ఉండేవాడు.రాజేష్, రాజాజీ నగర్లో శ్రీద్వారకామాయి సేవా ట్రస్ట్ నొకదానిని ప్రారంభించారు.
2009వ.సంవత్సరం జూలై 20వ.తారీకున షిరిడీ వెళ్ళి బాబా విగ్రహం, పాదుకలు కొని తీసుకొద్దామనుకొన్నారు.
తనతో శ్రీకాంత్ ని కూడా రమ్మన్నారు. తనకు వళ్ళు నొఫ్ఫులుగా ఉండి వైరల్ ఫీవర్ వచ్చేటట్లుగా ఉందనీ, పైగా తన దగ్గిర ప్రయాణానికి కూడా డబ్బు లేదనీ అందుచేత రానని చెప్పాడు.
ప్రయాణానికి, అక్కడ ఉండటానికి ఖర్చులు తను పెట్టుకుంటానని రాజేష్ నచ్చ చెప్పాడు.
శ్రీకాంత్ అతని మాట కాదనలేక ఒప్పుకొన్నాడు.రాజేష్ మరొక సాయిభక్తుడయిన వేణుగోపాల్ ని కూడా షిరిడీకి రమ్మని అడిగాడు.
వేణుగోపాల్ బాబా ముందు చీటీలు వేసి ఆయన అనుమతితో తను కూడా షిరిడీ వస్తున్నానని చెప్పాడు. రాజేష్ వెంటనే స్టేషన్ కి వెళ్ళి షిరిడీ ప్రయాణానికి కర్నాటక ఎక్స్ ప్రెస్ కి టికెట్లు రిజర్వ్ చెయించాడు.
ముగ్గిరికీ వైటింగ్ లిస్ట్ 137,138,139 వచ్చాయి. షిరిడీ నుండి తిరుగు ప్రయాణానికి జూలై 25వ.తేదీకి పూనా నుండి ఉదయన్ ఎక్స్ ప్రెస్ కి కన్ ఫరం టికెట్లు వచ్చాయి.
జూలై 22వ.తారీకున శ్రీకాంత్ సాయంత్రం 5.45 కి స్టేషన్ కి చేరుకొన్నాడు.
అప్పటికి వైటింగ్ లిస్ట్ 17,18,19 కి వచ్చింది. జనరల్ కంపార్ట్ మెంటులో ప్రయాణం చేయవలసిందే తప్ప బెర్తులు మాత్రం దొరకని పరిస్థితి. రైలంతా ప్రయాణీకులతో నిండి పోయిఉంది.
ప్రక్క బోగీ దగ్గరే ఉన్న మరొక టీ.సీ.ని అడిగి చూడమన్నాడు శ్రీకాంత్.వెంటనే ముగ్గురూ టీ.సీ.దగ్గరకు వెళ్ళి బెర్తులు కావాలని అడిగారు.
తానేమీ సహాయం చేయలేనని చెప్పాడు టీ.సి.. కాని కాస్త దయ చూపించాడు.
ఎస్4 లో ఎక్కండి అక్కడికి నేను వస్తానని చెప్పాడు. యిది వినగానె సంతోషంతో సామానంతా తీసుకొని ఎస్ 4 బోగీ దగ్గరికి బయలుదేరారు.
వెడుతూ వెడుతూ శ్రీకాంత్ మరొక్కసారి టీ.సీ.దగ్గరికి వెళ్ళి తాము షిరిడీ బాబా దర్శనానికి వెడుతున్నామనీ, తమ ముగ్గురికి కాస్త బెర్తులు యిప్పించమనీ ప్రాదేయపడ్డాడు.
ఈమాట వినగానె టీ.సీ. ఎస్4 లోకి వెళ్ళి 41,42,43 బెర్తులు తీసుకోమని చెప్పాడు.
రైలు రాత్రి గం.7.20ని.లకి బయలుదేరింది. కాని ఆ టీ.సీ. అసలు ఆబోగీలోకి రాలేదు. కాని, ఆబోగీలోకి వచ్చిన టీ.సీ. వారి టిక్కెట్లు చూసి కూడా ఏమీ అనలేదు.
పైగా ఆ టిక్కెట్టులో అతనికి ఏవిధమయిన తేడా కనపడలేదు.షిరిడీ చేరుకొన్న వెంటనే అందరూ బాబా దర్శనం చేసుకొన్నారు. జూలై 24వ.తారీకున అందరూ షాపుకి వెళ్ళి ద్వారకామాయి సాయిబాబా విగ్రహం, పాదుకలు కొని సమాధిమందిరంలోను, ద్వారకామాయిలోను చావడిలోను, పూజలు చేయించారు.
రాత్రి గం2.30ని.లకి వారు గదికి చేరుకొన్నారు. గదిలో రాజేష్ మొబైల్ లో 15 మిస్డ్ కాల్స్ ఉన్నట్లు చూశారు. రాజేష్ కి అతని భార్య, సోదరులు,సోదరిల నుంచి కాల్స్ వచ్చినట్లుగా ఉంది.
వెంటనే రాజేష్ తన యింటికి ఫోన్ చేశాడు. తల్లికి చాలా సీరియస్ గా ఉందని ఐ.సీ.యూ.లో ఉందని చెప్పారు. డాక్టర్లు కూడా ఏమీ లాభం లేదని చెప్పారట.
చాలా బాధ పండుతోందనీ మందులు కూడా పని చేయటల్లేదని చెప్పారు. కుటుంబమంతా ఆవిడ కోలుకుంటుందనే ఆశతో ఉన్నారు. రాజేష్ ని వెంటనే బయలుదేరి రమ్మన్నారు.
విమానంలో వెడదామన్నా మర్నాడు మధ్యాహ్నం గం.1.30ని.లకి గాని లేదు. తిరుగు ప్రయాణానికి రైలుకి రిజర్వేషన్ మరుసటి రోజుకి చేయించారు.
ఇక బస్సులో వెళ్లడం తప్ప మరో మార్గం లేదు. రాజేష్ ఆరోజే సాయంత్రం 4.గంటలకు బస్సులో బయలుదేరి మర్నాడు ఉదయం 11 గంటలకు బెంగళూరు చేరుకొన్నాడు.
బెంగుళూరులో దిగిన వెంటనే ఆస్పత్రికి వెళ్ళాడు.
సాయిబాబా పవిత్రమైన ఊదీ తల్లి నుదుటి మీద రాశాడు. తరువాత ఆవిడని ఎండోస్కోపీ కి తీసుకొని వెళ్ళారు. కొంతసేపటికి ఎండోస్కోపీ రిజల్ట్ లో నెగటివ్ వచ్చింది.
అంతకు ముదు వరకు బాగా ఎక్కువగా ఉన్న సుగర్ లెవెల్ కూడా మందులతో కాస్త తగ్గడం మొదలయింది. జూలై 30 గురువారము నాడు ఆవిడని ఆస్పత్రినించి యింటికి పంపించారు.
సంవత్సరం గడిచే కొద్దీ బాబా చూపుతున్న లీలలు శ్రీకాంత్ ని సాయి ప్రచార సేవకునిగా మార్చేశాయి.
బాబా అనుగ్రహంతో అతను, అతని స్నేహితుడు మునిరెడ్డి, 2009వ.సం.సెప్టెంబరు 28వ.తారీకు నాడు, విజయదశమి మ.గం.2.30ని.లకు (అనగా సాయిబాబా మహాసమాధి చెందిన సమయం) సాయి పోర్టల్ www.saiamrithadhara.com ప్రారంభించారు.
ఈ వెబ్ సైట్ లో ప్రపంచ వ్యాప్తంగా సాయిబాబాకు సంబంధించిన సమాచారాన్నంతా క్రమం తప్పకుండా సాయిభక్తులందరికీ అందిస్తున్నారు.
సాయిబాబా చెప్పిన అమృతతుల్యమైన పలుకులతో బాబా భక్తులెందరి దాహాన్నో తీరుస్తున్నారు.
బాబా మహాసమాధి చెంది 2018 దసరాకు 100 సంవత్సరములు పూర్తవుతున్న సందర్భంగా పోర్టల్ ని మరింతగా విస్తరించే పనిలో ఉన్నారు.
కన్నడ సాయి భక్తుల కోసం 2009వ.సం.నవంబరు 15వ.తేదీన www.saiamrithavani.blogspot.in కూడా ప్రారంభించారు.
కన్నడ సాయిభక్తులకి ఇది సాయి అమృతధార. ఎంతో ప్రేమతో, భక్తితో శ్రీకాంత్ మంచి పట్టుదలగా ఎప్పటికప్పుడు కొత్త విషయాలను అందిస్తున్నారు.
2012వ.సంవత్సరం లో ఆయన 10రూపాయల వెలతో ‘షిర్డీ గైడ్’అనె పాకెట్ సైజ్ పుస్తకాన్ని ప్రచురించారు. అందులో బాబా ఏకాదశ సూత్రాలు, షిరిడీలో దర్శించవలసిన ప్రదేశాలు, షిరిడీ శ్రీసాయి సంస్థాన్ గురించిన సమాచారమంతా పొందుపరిచారు.
2013 సంవత్సరం గురుపూర్ణిమనాడు ఆయన సాయి ప్రపంచానికి రెండు కానుకలు కన్నడ భాషలో ప్రసాదించారు. అవి ‘శ్రీషిరిడీ సాయిబాబా సమగ్ర కైపిడీ ‘శ్రీషిరిడీ సాయినాధ సగుణోపాసన,
పంపినవారు : శ్రీకాంత్ శర్మ
నెం.6/19, 3వ.ఫ్లోర్, 6 క్రాస్
7 మైన్ , ఎన్.ఎస్.పాల్య బీ.ఈ.ఎం.సెకండ్ స్టేజ్
బెంగళూరు – 560 076 కర్నాటక
ఈ.మైల్: srikanta68@gmail.com
మొబైల్ : (0) 9501954008
సాయిలీల ద్వైమాసపత్రిక సెప్టెంబరు-అక్టోబరు 2013 సంచికనుండి గ్రహింపబడినదిఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తుప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి.
Latest Miracles:
- బాబా “స్లీపెర్ బెర్త్ ఏర్పాటు చేసారు” మరియు “మరణం తలుపు తట్టిన భక్తుని తల్లికి తిరిగి జీవం పోసారు
- ఊధి తో అస్తమా వ్యాధి మాయం
- శిరిడి యాత్రకు బాబా ధన సహాయం
- శిరిడి యాత్రకు బాబా ధన సహాయం
- బాబాని పరిచయం చేసిన శ్రీ షిరిడీ సాయి మహత్యం ……!
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments