కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ – 3



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు 

కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ – 3              

కాకా సాహెబ్ దీక్షిత్ :

శ్రీ హరి సీతారాం దీక్షిత్ (కాకాసాహెబ్ దీక్షిత్) 1864 సంవత్సరం మధ్య ప్రదేశ్ లోని ఖాండ్వా తాలూకాలో బ్రాహ్మణ వంశంలో జన్మించారు.

ఆయన ప్రాధమిక విద్యంతా కూడా ఖాండ్వాలోనూ,  హింగన్ ఘాట్ లోనూ జరిగింది.  తరువాత ఆయన ముంబాయిలోని ఆల్ఫ్స్ టన్ కాలేజీలో చేరి 19 సంవత్సరముల పిన్న వయస్సులోనే ఎల్.ఎల్.బీ. పట్టా పొందారు.

ఆ తరువాత ఆయన 21 సం.వయసులోనే న్యాయవాది పరీక్షలో విజయం సాధించి లిటిల్ అండ్ కంపెనీలో న్యాయవాదిగా చేరారు.

తరువాత తనే స్వంతంగా న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించారు.  తన చురుకైన మేధాశక్తి, తెలివితేటలతో ఎంతో  ధనాన్ని ఆర్జించారు.  

తను సంపాదించిన ధనంతో లోనావాలాలో స్వంతంగా ఒక బంగళా కట్టుకున్నారు.  ఆయనకు ఆంగ్ల భాషలోనూ అలాగే, సంస్కృతంలోనూ మంచి ప్రావీణ్యం ఉంది.  

ఆయన రామాయణం, మహాభారతం, యోగ వాసిష్ట్యం, మరియు జ్ఞానేశ్వరి చదువుతూ ఉండేవారు.  

కాలికి గాయం:

ఒకసారి కాకాసాహెబ్ దీక్షిత్ 1906 వ.సంవత్సరంలో లండన్ వెళ్ళారు.

అక్కడ వేగంగా వెడుతూన్న రైలు ఎక్కడానికి ప్రయత్నించినపుడు పట్టుతప్పి ప్లాట్ ఫారం మీద పడిపోయారు.  కాలు బెణికి బాగా గాయమయింది.  ఈకారణంవల్లే ఆయన సరిగా నడవలేకపోయేవారు.  

లండన్ లో చాలా రకాలయిన వైద్యాలు చేయించారు.  ఆపరేషన్ కూడా జరిగింది.  అయినా గాని ఆయన జీవితాంతం వరకూ కుంటుతూనే నడవాల్సి వచ్చింద్.

ఈ కాలి కుంటితనమే ఆయన అస్థిరమైన మనసుని స్థిరముగా ఉంచింది. ఆయన కుంటితనమే ఆయనను షిరిడీలో కాలు మోపేలా చేసింది.  

మానవుడికి ఏదైనా అనర్ధం  జరిగినపుడే ప్రతీ దాని మీద అయిష్టత ఏర్పడుతుంది.  కాని ఒక్కొక్కప్పుడు అటువంటి అనర్ధాలే ఎంతో ఉపయోగపడతాయి.

కాకాసాహెబ్ తన కుంటికాలితో భారత దేశానికి తిరిగి వచ్చేటప్పటికి ఆయనకు సాయిబాబా గురించి తెలియదు.  1909 సంవత్సరంలో సెలవులు గడపడానికి లోనావాలాలో ఉన్న తన బంగళాకు వెళ్ళారు.

అక్కడ తన పూర్వపు సహాధ్యాయి అయిన నానాసాహెబ్ చందోర్కర్ ని కలుసుకొన్నారు.

చదువు పూర్తయిన తరువాత నానాసాహెబ్ చందోర్కర్ ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు.

కాకా సాహెబ్ దీక్షిత్ స్వంతంగా న్యాయవాది వృత్తిని చేపట్టారు.

చాలా సంవత్సరాల తరువాత యిద్దరూ లోనావాలాలో కలుసుకున్నారు. కాకాసెహెబ్ తన కాలిగురించి నానా సాహెబ్ కి వివరంగా అంతా చెప్పారు.

“మందులన్నీ కూడా పనిచేయడం మానివేసినపుడు భగవంతుని ప్రార్ధించే ప్రార్ధనలే పని చేస్తాయి” అని నానాసాహెబ్ అన్నారు.

అందుకు కాకాసాహెబ్ “నానా, నేను నీతో పూర్తిగా ఏకీభవిస్తాను.  కాని, ఈరోజుల్లో నిజమయిన యోగిపుంగవులు అరుదుగా ఉంటారు.  

ఒకవేళ అటువంటివారిని కలుసుకోవడానికి అనుకోకుండా అవకాశం వచ్చి విజయం సాధించినా చివరికి పశ్చాత్తాప పడటానికి మాత్రమే.

(ఇక్కడ పాఠకులకి ఒక అనుమానం రావచ్చు.  నిజమైన సాధువుని /సత్పురుషుని కలుసుకొంటే పశ్చాత్తాపం పడటమేమిటి అని.

ఇక్కడ నేననుకునేది ఏమిటంటే ఒక వేళ మనం నిజమైన సాధువునే కలుసుకున్నామని భావిస్తాము.

చివరికి ఆయన నిజమైన సాధువు కాడని తెలిసిన తరువాత మనము పశ్చాత్తాప పడవలసివస్తుందని కాకా సాహెబ్ భావం అయి ఉండవచ్చు)    (దీనికి పాఠకులు ఏమంటారు?  నాభావం కరక్టేనా?  ఇద్దరిని అడిగాను.

వారు కూడా ఇదే అభిప్రాయం వెలిబుచ్చారు)

నానా సాహెబ్ ఇలా జబాబిచ్చారు. “ఒక విషయం చెప్పనీ నన్ను. అపుడు నువ్వే నిజంగా నన్ను నమ్ముతావు.  

నేనొక గురు మహరాజ్ కి శిష్యుడిని.  ఆయన పేరు సాయిబాబా.  ఆయన కోపర్ గావ్ దగ్గరనున్న చిన్న గ్రామమయిన షిరిడీలో ఉంటారు.  నువ్వు ఆయన శరణు పొందు.  

నీకాలి కుంటితనం నయమవుతుంది.  నీయొక్క మనస్సుయొక్క అస్థిరత్వం తొలగిపోతుంది.  నా ఆలోచనలని, అభిప్రాయాలని నీకు చెప్పాను.

నాగురుమహరాజ్ ఎపుడు చెపుతూ ఉంటారు —  “పిచ్చుక కాలికి దారం కట్టి ఎటువంటి శ్రమ లేకుండానే దానిని మనవద్దకు లాగవచ్చు”.  

అదే విధంగా ఈ ప్రపంచంలో నాభక్తులు ఏమూలనున్నా సరే వారిని నావద్దకు రప్పించుకొంటాను.  ఎవరికయితే అదృష్టం లేదో వారికి షిరిడీనుంచి పిలుపు రాదు.”

  ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles