“వెయ్యేల , వాదోపవాదాలకు మూలం అహంకారమే కదా ” అన్నారు సాయి .



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా

Author:Kota Prakasam Garu

ఎందుకే మనసా ఎగిసి ఎగిసి పడేవు ఏమున్నది నీలో అని మిడిసిపాటు పడేవు.

***

వినే విద్యార్థులు వందమంది ఉన్నా,బోధించే ఉపాద్యాయుడు ఒక్కడే ఉంటాడు తరగతిగదిలో ..

అందరినీ ఉద్దేశించి సంవచ్ఛరం పొడుగునా చెప్పేపాఠాలు ఒకటే అయినా , విని పరీక్షరాసిన విద్యార్థులందరూ ఒకేవిధంగా మార్కులు పొందలేరు ..

గ్రంధాలు అనేకం ఉన్నా , అందులొ కొన్నింటినైనా చకచకా చదివి అర్ధంచేసుకోను ఒక జీవితకాలం సరిపోదు ..

ఆకాశంలో తటస్థంగా ఉన్న నక్షత్రాలను లెక్కపెట్టడం తేలికౌతుందేమోకాని, ఎదిగే మనసుకు అవగాహన కుదిరేకొద్దీ ఏరోజుకారోజు నేర్చే విషయాలు కొత్తగా స్ఫూర్తినిస్తూనే ఉంటాయి ..

ఒక ప్రవచనంలో గంటసేపు కూర్చుని ఎంత శ్రద్ధగా చెవులు రిక్కరించివిన్నా, విన్నది విన్నట్టుగా గుర్తుపెట్టుకొని మననంచేసుకోడం ఎవరికీ సాధ్యపడకపోవొచ్చు ..

మహాభారతంలో అర్జునుడితో సమానంగా విలువిద్యలో నైపుణ్యం సంపాదించాడు ఆయన కుమారుడు అభిమన్యుడు ..

పద్మవ్యూహంలో ఎలా చేధించుకు వెళ్ళాలో అధ్యయనంచేశాడుకానీ , తిరిగి అందులోంచి ఎలా తిరిగి బయటపడాలో ఆ మర్మం తెలియకుండానే అడుగుపెట్టి , యుద్దంలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు.

సగం తెలిసీ తెలియక అజ్ఞానంతో వాదనకు దిగితే , ఉన్నగౌరవం కాస్తా ఉట్టికెక్కుతుందని ఈ కధలో అర్థమౌతుంది ..

మనసులోని భావాన్ని ఒకరితోఒకరు పంచుకొంటే , చర్చలవలన భావదోషాలేవో సవరించుకొనే అవకాశం కలుగుతుంది ..

తెలిసినకొద్దికే , మొండి వాదనతో రచ్చగెలవాలని ప్రయత్నిస్తే అహంకారం పెరగడంతప్ప , లోతైన విషయాలను గ్రహించే అవకాశానికి దూరంకావలసి వొస్తుంది ..

వెయ్యేల , వాదోపవాదాలకు మూలం అహంకారమే కదా ” అన్నారు సాయి ..

ఇందరికి ఆరాధ్యుడైన ఆయన జీవన శైలిని గమనిస్తే , ఆయన ఉన్నంతకాలం ఎక్కడా బేషజాలు , అహాన్ని ప్రదర్శించక , నా నిజభక్తులకు నేనుఎన్నడూ దాసానుదాసుడనే అన్నారు ..

ఆయన బోధలు నిజస్పూర్తినిస్తే , మనసు వినయంగా ఆయన మార్గాన్ని అనుసరించే పనిలోపడుతుంది ..

అల్పజ్ఞానంతో మిడిసిపాటుపడితే అహంకారంతో అజ్ఞానం మిగులుతుందితప్ప , ఆయన ఆశయాలకు తగ్గ మార్గానికి ఎన్నటికి చేరువకావడం దుర్లభమే అని పెద్దలమాట …

జయ్ గురు సాయి సమర్థ
***

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles