కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ – 4



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు 

కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ – 4

కాకా సాహెబ్ కూడా భక్తి పరాయణుడు.  ఆయన ఎంతో ప్రావీణ్యం కలవాడు.  ఆధ్యాత్మికం గురించి బాగా తెలుసుకోవాలనే ఉత్సుకత ఉండేది.

నానా సాహెబ్ కూడా ఎంతో పాండిత్యం ఉన్నవాడు.  ఆయన ఏదీ కూడా అర్ధం లేకుండా మాట్లాడే వ్యక్తి కాడు.  నానా సాహెబ్ మాటలు విన్న తరువాత కాకా సాహెబ్ హృదయంలో బాబా మీద క్రొత్తగా ప్రేమ ఉద్భవించింది. 

భక్తి భావం పెరగడం మొదలయి,మాయ (మోహం) తొలగిపోవడం మొదలయింది. అప్పటికప్పుడే బాబాని కలుసుకుందామని నిర్ణయించుకొన్నాడు.

1910 వ. సంవత్సరంలో కాకా సాహెబ్ ఎలక్షన్  పని మీద అహ్మద్ నగర్ కి వెళ్ళవలసి వచ్చింది. 

ఆయన సర్దార్ కాకసాహేబ్ మిరికర్ గారి యింటిలో బస చేశారు.  సాయి భక్తులందరికీ మిరికర్ గారి  గురించి బాగా తెలుసు  మిరికర్ గారి కుటుంబ సభ్యులందరికీ కూడా బాబా మీద పూర్తి నమ్మకం ఉంది.

ఆరోజులలో గుఱ్ఱపు పందాలు ప్రజాదరణలో ఉన్నాయి.  ప్రజలందరూ కూడా గుఱ్ఱపు పందాలను చూడటానికి చాలా ఆసక్తిని కనపర్చేవారు.  సర్దార్ మిరికర్ గారు కూడా కాకాసాహెబ్ తో గుఱ్ఱపు పందాలకి వెళ్ళారు.

ఆక్కడ వారు కోపర్ గావ్ మామలతదారయిన సర్దారు బాలసాహెబ్ మిరికర్ గారిని కలుసుకొన్నారు.  సర్దార్ మిరికర్, బాలా సాహెబ్ మిరికర్ గారు యిద్దరూ అన్నదమ్ముల పిల్లలు. ఈలోపులో నానా ఫాన్సే, అప్పా గాడ్రే యిద్దరూ కూడా వచ్చారు.

అందరూ కలిసి బాబా లీలలను ఒకరికొకరు చెప్పుకోవడం ప్రారంభించారు.  “బాబాకు అంకిత భక్తుడయిన మాధవరావు దేశ్ పాండే అహ్మద్ నగర్ లో ఉన్నారు” అని నానా ఫాన్సే చెప్పారు.

గుఱ్ఱపు పందాల నుంచి వచ్చిన తరువాత మిరికర్ గారు మాధవరావుని తీసుకొని రమ్మని తన సేవకుడిని పంపారు.  ఆయన రాగానే కాకా సాహెబ్ గారు ఎంతో ఆనందంతో ప్రేమగా మాధవరావుగారిని కౌగలించుకొన్నారు.

మాధవరావుగారు “.బాబా దయ వల్ల మా అత్తగారి ఆరోగ్యం బాగుంది. 

బాబా దర్శనం వల్ల వచ్చే అధిక లాభం మాట అటుంచి  నేనిక్కడ వుండే అవసరం లేదు.   నేను ఈ రోజు రాత్రి రైలుకు బయలుదేరతాను ” అన్నారు. 

షిరిడీ, కోపర్ గావ్ కి ఎక్కువ దూరంలో లేదని కాకా సాహెబ్ భావించారు.  ఎన్నికలకు సంబంధించిన పని ఏరోజైనా చేసుకోవచ్చు.  

సాయిబాబా  గారిని కలుసుకునే బంగారం లాంటి అవకాశం నాకు లబించబోతోంది.  దీనిని నేను వదులుకోకూడదని కాకా సాహెబ్ భావించారు.  వారు రాత్రి10.గంటలకు అహ్మద్ నగర్ లో రైలు ఎక్కి కోపర్ గావ్ లో రైలు దిగేటప్పటికి ప్లాట్ ఫారం మీద నానా సాహెబ్ చందోర్కర్ గారు ఉన్నారు.

“పిచ్చుకకు దారం కట్టి లాగినట్లుగా సాయిబాబా తన భక్తులని లాగుతారని నేను చెప్పలేదా” అని నానా సాహెబ్ గారు అన్నారు. ముగ్గురూ కూడా ఆనందంలో మునిగి పోయి దత్తాత్రేయుల వారిని దర్శించుకొని షిరిడీ వెళ్ళడానికి టాంగా మాట్లాడుకున్నారు.

కాకా సాహెబ్ ద్వారకామాయిలోనికి అడుగు పెట్టగానే శ్రీసాయిబాబా “ఓ! స్వాగతం లంగ్డా కాకా” అన్నారు.

శ్రీసాయిబాబా ఆయనను ‘లంగ్డాకాకా’ అని పిలవడం మొదలుపెట్టినప్పటినుండీ షిరిడీలోని మిగతావారు కూడా ఆయనను కాకాసాహెబ్ అని పిలవనారంభించారు. 

కాకా సాహెబ్ శ్రీసాయిబాబా దర్శనంతో అమితానందభరితుడై కాన్వాస్ మీద గీచిన చిత్రంలా నిశ్చలంగా ఉండిపోయాడు. (కాకా సాహెబ్ మొదటగా షిరిడీ నవంబరు 2, 1909 న దర్శించారు)

వాడా నిర్మాణం: 

షిరిడీలో ఆయన ఉన్న కొద్దికాలం సాఠేవాడాలో బస చేశారు.  కాని అక్కడ చాలా అసౌకర్యంగా ఉండటంతో, భగవంతుడు తనకు అంతులేని సంపదనిచ్చాడని దానిని ఆ భగవంతునికే ఉపయోగించాలని నిశ్చయించుకున్నారు.

కాకా సాహెబ్ తన మనసులో ఉన్న కోరికను శ్రీసాయిబాబాకు విన్నవించుకొని, తాను చేసే సత్కార్యానికి బాబావారి అనుమతి కోరాడు. సరిగా సాఠేవాడాకి ఎదురుగా నున్న చిన్న స్థలాన్ని కొన్నాడు.  

బాబావారి అనుమతితో, డిసెంబరు 10, 1910సంవత్సరంలో దీక్షిత్ వాడ నిర్మాణం ప్రారంభమయి, నాలుగు నెలల తరువాత పూర్తి అయింది.

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles