ఇప్పుడు నా భర్తకి గండం ఏమిలేదు. అది బాబా నాకు చెబుతున్నట్లుగా అనిపించింది.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


నేను కంగారుగా మా చెల్లికి ఫోన్ చేస్తే ఆమె వచ్చింది. హాస్పిటల్ కి వెళ్ళాము. అక్కడ మేము వెళ్ళే సరికి, మా వారు ICU లో వున్నారు.

అప్పుడు మాకు తెలిసిన విషయం ఏమిటంటే, ఉదయం మా వారు హాస్పిటల్ కి రాగానే డాక్టర్ చూసాక బయటికి వచ్చి కూర్చుంటే అక్కడే పని చేస్తున్న ఒకాయన వచ్చి “సుబ్బ రామయ్య గారు మీరేంటి ఇక్కడ ఇలా వున్నారు,” అని అంటే గుండెలో నొప్పిలాగా వచ్చింది.

మా ఇంటిదగ్గర హాస్పిటల్ లో చూపించుకుంటే కామినేని కి వెళ్ళి చూపించుకోమన్నారు.

ఇక్కడ డాక్టర్ చూసాక యాంజియోగ్రాం చేయాలంటున్నారు. అది చేయాలంటే డబ్బుకావాలి, మా వాళ్ళు రావాలి, మా అబ్బాయి వస్తున్నాడు అని చెప్పారాయన.

ఆయన లోపలికి వెళ్ళి ఈయన మాకు చాలా కావాల్సిన మనిషి డబ్బులు పే చేసేస్తారు వెంటనే యాంజియోగ్రామ్ కి ఏర్పాట్లు చేయండి అని చెప్పారుట.

వాళ్ళు సరేనని ఆయన్ని ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్ళారుట. యాంజియోగ్రామ్ చేసారు.

మూడు వాల్వులు బ్లాక్ అయ్యాయి అని డాక్టర్ చెప్పారట, వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు.

ఈ లోపల నేను మా చెల్లెలు వెళ్ళాము. ICU లో పడుకోబెట్టారు, రాత్రయింది, మా అమ్మ వచ్చింది ICU లోకి మనల్ని వెళ్ళనియ్యరు, రాత్రంతా నువ్వు ఇక్కడ ఎందుకు, మళ్ళీ ఉదయాన్నే రావచ్చు సీతా ఇంటికి వేడదాంరా అంది, నేనురాను అన్నాను.

నిన్ను లోపలికి రానివ్వరమ్మా ఎక్కడున్నా ఒకటే, రా తల్లి అంది. సరేనని నేను ఇంటికి బయలుదేరి వెళ్ళాను.

పడుకున్నా కానీ నాకు నిద్ర రావటంలేదు. లేచాను స్నానం చేశాను. బాబా కి పూజ చేశాను.

గురుచరిత్ర నంతా పారాయణ చేసాను. బాబా సమాధానం కోసం గురుచరిత్ర పుస్తకాన్ని తెరిచాను.

అందులో సావిత్రి అన్న ఆవిడ, ఆవిడ భర్త కోసం, ప్రాణాలు ఇవ్వమని నృసింహ సరస్వతి స్వామి దగ్గరకు తీసుకువెడుతుంది. ఆయన ఆవిడ భర్తకి ఆయుష్యునివ్వటం, అదీ 30 సం|| లు. ఆ సంఘటన వచ్చింది.

నేను బాబాకేసి చూసాను, బాబా ముందు మందార పూలు నేను ఇంతకముందు పూజ చేసిన పూలు పడ్డాయి. అంతే నాకు బాగా దైర్యం వచ్చింది.

 ఇప్పుడు నా భర్తకి గండం ఏమిలేదు. అది బాబా నాకు చెబుతున్నట్లుగా అనిపించింది.

హాస్పిటల్ కి వెళ్ళాను, కూడా ఖడ్గమాలా స్తోత్రం తీసుకువెళ్ళాను. నేను చదువుతూనే వున్నాను, తెల్లారింది, డాక్టర్లు వస్తున్నారు.

ఆయన్ని చూస్తున్నారు వెడుతున్నారు, వాళ్ళలో వాళ్ళు ఏవో మాట్లాడుకుంటారు. మేము విషయం అడిగితె – ఇప్పుడే ఆపరేషన్ చేసేయాలని ఒకళ్ళు, ఆరునెలల తర్వాతైనా పర్వాలేదని ఒకళ్ళు, ఒక ఏడాది సమయం అయినా పర్వాలేదని ఒకళ్ళు, ఇలా పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు.

ఈ లోపల మౌలానా బాబాగారు, మీ వారినీ ఎలాగైనా బయటకు తీసుకువచ్చేయండి ఆయనకి గండం తీరిపోయింది. ఇంక పర్వాలేదు అని కబురు చేసారు.

బయటికి తీసుకురావటం అంటే పార్క్ లోంచి తీసుకురావడం కాదుకదా! కార్పొరేట్ హాస్పిటల్ అది, నేను వెళ్ళి మాకు ఆపరేషన్ అంటే వ్యవధి కావాలి, డబ్బు కూడా చూసుకోవాలి, ఎంత డబ్బు అవసరమవుతుంది అని అడిగితే – సుమారుగా 2 లక్షలు అవసరం పడతాయి అన్నారు.

సరే డాక్టర్ గారు యిప్పుడు డిశ్చార్జ్ చేయండి, మేము తొందరలోనే డబ్బు సమకూర్చుకొని మీకు ఫోన్ చేస్తాము, అప్పుడు మాకు డేట్ ఇద్దురుగాని అని చెప్పాను, వాళ్ళు వప్పుకున్నారు.

మేము ఆయన్ని ఇంటికి తీసుకువచ్చేసాము.  ఆ తర్వాత కేర్ హాస్పిటల్ కి తీసుకువెళ్ళాము. వాళ్ళు అక్కడ మళ్ళీ యాంజియోగ్రాం చేసారు. మళ్ళీ ఆపరేషన్ అని మొదలు పెట్టారు.

ఒక డాక్టర్ కి చెప్పి డబ్బుచూసుకోని మళ్ళీ వస్తామని అక్కడి నుండి వచ్చేసాము.

ఒకసారి యాంజియోగ్రాం చేసాక తిరిగి హార్ట్ పేషంట్ కి యాంజియోగ్రాం చేయాల్సిన పనిలేదు, వాళ్ళు మా దగ్గర డబ్బులు గుంజటానికి చేసారు.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles