జ్యోతేంద్ర తర్ఖడ్



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


శ్రీ సత్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై …సద్గురు సాంబశివ గురుదేవా కీ జై ..
జ్యోతేంద్ర తర్ఖడ్ అనే 14 సంవత్సరాల బాబా భక్తుడి షిరిడి యాత్ర లో జరిగిన ఒక లీల …జ్యోతేంద్ర షిరిడి డి కి వెళ్ళగా అక్కడ కలరా వుందని తెలుస్తుంది..అతడికి బాబా యందు అమితమైన విశ్వాసం ఉండెను. తనకి బాబా ఎపుడు తనని కాపాడుతారని తెలుసు. అతను మాములు గానే బాబా పనుల్లో నిమగ్నంయ్నాడు..అతను ద్వారకామాయి లో లాంతరు వెలిగించేవాడు. ..ఒక రోజు ద్వారకామాయి లో ప్రవేశిస్తుండగా బాబా మిక్కిలి కోపంతో అరవసాగాడు.అతన్ని ఏడు ముక్కలు చేసి ద్వారకామాయి లోనే పాతి పడతానని తిట్టసాగాడు..దానితో అతను చాలా భయపడ్డాడు ..తనవల్ల ఏమైనా తప్పు జరిగిందేమోనని బాబాని క్షమాపణ వేడుకున్నాడు.దానికి బాబా యింకా కోపించాడు..తర్వాతా తిరిగి జ్యోతేంద్ర తో తన కాళ్ళు పిసకమని ఆదేశించాడు.

అతను చాలా భక్తి పూర్వకం గా బాబా కాళ్ళు పిసకసాగాడు..ఇంతలో ఒక దుష్ట ప్రవృత్తి గల స్త్రీ అతడి కి అక్కడ కనిపించింది..ఆమె ఎంత్త భయంకరంగా వుందంటే వర్ణించడానికి అతడికి పదాలు రాకుండెను..అతని భీతావహుడాయి బాబా కాళ్ళు పిసకడం ఆపివేసి బాబా కాల్లాని గట్టిగా పట్టుకుని నిష్చేష్టుడాయి ఉండిపోయాడు..బాబా ఆ స్త్రీ తో ఏదో మాట్లాడ సాగాడు..వారి సంభాషణ జ్యోతేంద్ర కి అస్సలు వినిపించలేదు..యిదంతా చస్తూ అతడు భయం తో మూర్చ పోతాడు ..

తనకిస్ప్రుహ వచేసరికి బాబా అతని తల నిమ్రుతూ లేవమని చెప్తుంటాడు..బాబా అతడితో “అరె తమ్ముడు ..నేను నిన్ను కాళ్ళు పిసకమన్నాను ..కానీ నువ్వు నా కాళ్ళని ఎంత గట్టిగా పట్టుకున్నవంటే నీ గోళ్ళు నా కాళ్ళకి గుచ్చుకున్నాయి. యింతకీ నువ్వు ఏం చూసావో చెప్పు.”…అన్నాడు..అప్పుడు అతడు బాబా నాకు అలాంటి భయంకర దృశ్యాలు ఎందుకు చుయించారు అని అన్నాడు..అపుడు బాబా “ఆమె ఒక దారిద్ర దేవత..నిన్ను తీసుకేల్దామని వచ్చింది.కానీ నేనీ అలా జరగనివ్వను . నేను ఆమెను తిప్పి పంపించాను”.అని సముదాయించాడు..అప్పుడు అతని మనసు శాంతించి తన శిరస్సు బాబా చరనాలపై ఉంచాడు.

సంపాదకీయం: సద్గురులీల
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No :09704379333

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “జ్యోతేంద్ర తర్ఖడ్

Bhaskar Sai p

Great Miracle By Baba

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles