Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
ఒక పేరు తెలియని భక్తుని అనుభవం:-
సాయి భక్తులకు నా నమష్కారం, నేను ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం లో ఉన్నప్పుడు, నా ప్రియ మిత్రుడి వలన షిర్డీ సాయి బాబా లీలల గురించి తెలిసింది. అతను చాలా గొప్ప బాబా భక్తుడు. నా మిత్రుడు చెప్పినప్పటి నుండి నేను సాయిబాబా భక్తుడిగా మారిపోయాను. ఇప్పుడు బాబా మా కుటుంబం యొక్క ఇష్ట దైవం. నేను మీకు ఇటీవలే జరిగిన ఒక అనుభవం మీకు తెలియజేస్తును.
కొన్ని రోజుల క్రితం నా తల్లికి కాళ్ళు వాపులు వచ్చాయి. అప్పుడు ఆమె ఒక వైద్యుడిని సంప్రదించి, అన్ని వైద్య పరీక్షలను చేయించుకుంది. మెడికల్ పరీక్షలు పూర్తై రిపోర్ట్స్ వచ్చాయి. ఆ రిపోర్ట్స్ నేను చూసినప్పుడు నేను చాలా భయపడ్డాను. మూత్రపరీక్ష యొక్క రిపోర్ట్స్ లో మూత్రంలో అధిక ప్రోటీన్ ఉనికి ఉంది. మూత్రంలో ప్రోటీన్ అంటే మూత్రపిండాల ఫిల్టర్లు దెబ్బతిన్న ఒక ప్రారంభ సంకేతం.
హైదరాబాదులోని ఏదైనా మూత్రపిండ నిపుణుడిని సంప్రదించడము మంచిదని, అప్పుడే మీరు మంచి చికిత్స పొందుతారని డాక్టర్ నా తల్లికి చెప్పారు. మరుసటి రోజు మేము అప్పటివరకు చేసిన వైద్య పరీక్షల రిపోర్ట్స్ తో హైదరాబాద్ వచ్చి కిడ్నీ స్పెషలిస్ట్ ని సంప్రదించాము.
అతను పాత రిపోర్ట్స్ చూసి నాతో “ఈ రిపోర్ట్స్ ప్రకారం, మీ తల్లి మూత్రపిండాలు దెబ్బ తిన్నాయి” అని చెప్పారు. కానీ మరింత ఖచ్చితముగా నిర్ధారణ చేయడం కోసం మళ్ళి వైద్య పరీక్షలను మా వద్ద చేయవలిసి ఉంటుంది అని చెప్పారు.
అందువలన మేము మెడికల్ పరీక్షా కేంద్రానికి వెళ్ళాము. పరీక్షి కోసం నా తల్లి వేచి ఉంది. అప్పుడు నేను బాబాని “నా తల్లికి ఏ ఆరోగ్య సమస్య లేకుండా చుడండి బాబా” అని ప్రార్ధించి ఒక గ్లాసు నీటిలో షిర్డీ సాయి ఊధిని కలిపి నా తల్లికి త్రాగటానికి ఇచ్చాను.
తర్వాత ఆమె అన్ని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. మెడికల్ రిపోర్టులు వచ్చిన తర్వాత మళ్ళీ డాక్టర్ని కలుసుకున్నాము. డాక్టర్ “మీ తల్లి మూత్రపిండలలో ఏ సమస్య లేదు అన్నారు. ఆమె మూత్రంలో ఏ ప్రోటీన్ లేదు, మూత్రపిండాలు చక్కగా పని చేస్తున్నాయి. పాత రిపోర్ట్స్ తప్పు. మీ తల్లి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు” అని చెప్పారు.
ఆ తరువాత నా కన్ఫర్మేషన్ కోసం ఒక వైద్యుని “నా తల్లికి కాళ్ళ వాపుకు ఎందుకు వచ్చాయి” అని ప్రశ్నించాను. అతను “మీ తల్లి రక్తపోటు ఔషధం మరియు నిద్ర మాత్రలు తీసుకోవడం వలన ఆ ఔషధం యొక్క అధిక డోష్ వలన ఆమె కాళ్ళు ప్రభావితమై వాపులు వచ్చాయి అని బదులిచ్చాడు.
డాక్టర్ నుండి ఈ పదాలు విన్న వెంటనే నా ముఖం మీద చిరునవ్వు వచ్చింది. ఆ సమయంలో నా కళ్ళ నుండి కన్నీళ్లు వచ్చాయి. నేను సాయి బాబాకు చాలా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. నిజంగా సాయి బాబా మనకు ఏది మంచిదో అది చేస్తారు. ప్రపంచములో ఏ మూలకు మనం వెళ్ళిన బాబా కంటికి రెప్పల కాపాడుతుంటారు.
చాలా చాలా కృతజ్ఞతలు సాయి బాబా, జై సాయి రామ్.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- ఊధి తో అస్తమా వ్యాధి మాయం
- నేను తీసుకువెళ్లిన ఫొటోలో బాబాని చూసేసరికి ధైర్యం రావటం కాదు అసలు వ్యాధి కూడా పారిపోయింది.
- ఊధి తీర్ధ సేవనంతో వ్యాధిమాయం
- బాబా దయతో ఉబ్బసం వ్యాధి నయం
- వ్యాధిని మాయం చేసిన బాబా
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments