Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
రామ కృష్ణ G. కొఠారి 1908లో జన్మించారు. ఆయన పటారీ ప్రభు కులానికి చెందినవాడు. అతని తల్లిదండ్రులు మొట్టమొదట 1911లో షిర్డీని సందర్శించారు. ఆ సందర్శనలో, బాబా ద్వారకామయి యొక్క కట్టడా దగ్గర నిలబడి భక్తులకు ఊధిని పంపిణీ చేస్తూ ఉండటం వారు చూశారు. ఆ దృశ్యం చూసి వారి హృదయం భక్తితో నిండిపోయి, మనసులో బాబా పట్ల ప్రేమ ఉప్పొంగింది.
వారి ఇంటికి తిరిగివచ్చిన తరువాత, వారు బాబా యొక్క ఛాయాచిత్రాన్ని పూజించడం ప్రారంభించారు (ఇది శ్యామారావు జైకర్ చిత్రలేఖనం యొక్క ముద్రణ). వారు భజనలను చేయడం ప్రారంభించారు. అలా ఏర్పడిన భజన మండలి (సమూహం)ని ‘సాయి లాజ్’ అని పిలిచారు.
1913లో అతని తండ్రి న్యుమోనియాతో తీవ్రంగా అనారోగ్యం పాలయ్యారు. డా. నాయక్ అతడికి చికిత్స చేశారు, కానీ రోగి కోలుకోవడం సందేహాస్పదంగా ఉంది,.అతను కోలుకొనే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని కుటుంబం సభ్యులతో చెప్పారు. మరియు అతనికి ఈ వ్యాధి వలన మరణం సంభవించవచ్చు అని కూడా చెప్పారు. ఇది విని రోగి భార్య తన భర్త కోలుకుంటే ఆమె షిరిడి కి ‘పాదయాత్ర’ (నడక) చేసి బాబా కి ధన్యవాదాలు తెలుపుకుంటాను అని బాబాని ప్రార్ధించింది.
రాత్రంతా భజనలు చేయడానికి భజన మండలి వారి ఇంటికి వచ్చి , భజనలు చేస్తున్నారు. ఇలా ఉండగా రోగి పరిస్తితి విషమించింది. వైద్యుడుని రాత్రి 10 గంటలకు కబురు పెట్టారు. వైద్యుడు రోగికి ఇంజెక్షన్ మరియు మందులు ఇచ్చారు. కాని రోగి భార్యతో 12.00 గంటలకు ఆమె భర్త మరణించవచ్చు అని చెప్పారు.
ఇది విన్న బంధువులు, భగవత్ గీతాను రోగికి మంచి జరగాలని చదవడం మొదలుపెట్టారు. అదే సమయంలో బాబా యొక్క భజనులు కూడా కొనసాగాయి. సుమారు 11.00 గంటల సమయంలో రోగి శ్వాస తీసుకోవడంలో చాలా కష్టపడ్డాడు.
రోగి భార్య అతని పరిస్థితి చూసి, ‘బాబా నా భర్తను రక్షించు’ అని అని రోదించింది. ఈ సంక్షోభం 1.00 గంట వరకు కొనసాగింది. డాక్టర్ ను మళ్లీ పిలిచారు. అతను మళ్ళీ రోగికి ఇంజెక్షన్ ఇచ్చి, సంక్షోభం ముగిసినట్లు వారికి హామీ ఇచ్చారు
.
భజనులు తెల్లవారి 4.00 గంటలు వరకు కొనసాగాయి. భజన మండలి మరియు బంధువులు ఆమె భర్త గండం గడిచి అతడు బ్రతికనట్లేనని ఆమెకు హామీ ఇచ్చి, అందువల్ల ఆమె ప్రతిజ్ఞ ప్రకారం, ‘పాదయాత్ర’ (పాదాల యాత్రికులు) కోసం ఆమెను సిద్ధంగా ఉండమని చెప్పారు.
ఆ సమయం నుండి రోగి స్థిరంగా కోలుకుంటూ, కొన్ని క్షణాలలో పూర్తిగా కోలుకున్నాడు.. కాబట్టి కుటుంబం మరియు భజన మండలి షిర్డీ యాత్రను ప్రారంభించారు.
కోపార్గావ్ వద్ద, కుటుంబం ఐదు ఎడ్లబండ్లను వారిని షిర్డీకి తీసుకువెళ్ళడానికి అద్దెకు తీసుకున్నారు. కానీ భార్య బండిలో కూర్చో లేదు. ఆమె కాళ్ళు వాచిపోయి మరియు గాయపడినప్పటికీ, ఆమె కేవలం ఆ బండ్ల వెనుక నడవసాగింది.
షిర్డీ నుండి కొంచెం దూరంలో మార్గం ముల్లు మరియు గోతులతో ఉంది. కనుక ఆమెకు ఆ మార్గంలో నడవడం చాలా కష్టంగా ఉండి ఒక చెట్టు క్రింద వెళ్లి విశ్రాంతి తీసుకుంది.
ఆమె అక్కడ గొర్రెల కాపరి యొక్క వస్త్రంతో, తెల్ల గడ్డంతో ఉన్న ఒక వ్యక్తిని గమనించింది. అతను ఆమెను సమీపించి “మీ ప్రతిజ్ఞ బాబా చేత ఆమోదించబడింది, అందువలన తల్లి మిగిలిన దూరాన్ని ఎడ్లబండి లో వెళ్ళండి” అని చెప్పారు. ఆ స్వరంలోని ఆప్యాయతను ఆమె విన్నది కానీ ఆమె తన మ్రొక్కుబడికి కట్టుబడి, మిగిలిన మార్గాన కూడా నడక సాగించింది.
ఆమె ద్వారకామాయి చేరుకున్నప్పుడు బాబా తన భక్తులతో కూర్చొని, బాబా నానా సాహెబ్ తో “నేను ఈ స్త్రీని మద్య దారిలో కలుసుకొని, ఆమెని బండిలో వెళ్ళమని చెప్పను, కాని ఆమె నా మాట వినలేదు, అరె చూడు ఆ తల్లి కాళ్లు ఎలా గాయపడి, వాచిపోయి ఉన్నాయి! కానీ సాయంత్రానికల్లా నయమైపోతాయి” అని అన్నారు.
బాబా వాక్కు సత్యం. సాయంత్రానికల్లా ఆమె కాలి గాయాలు, వాపులు అదృశ్యమయ్యాయి.
కొద్ది రోజులు వారు షిర్డీలో ఉండి బాబా యొక్క దీవెనలు మరియు ఊధితో ఇంటికి తిరిగి వచ్చారు.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- శిరిడీ లో శ్రీ రామ జన్మోత్సవాలు – శ్రీ రామ నవమి సంబరాలు
- How can he die? In the morning he will come back to life. G.G Narke
- నారాయణ కృష్ణ పెండ్సే
- శ్రీ రామ మారుతీ మహరాజ్
- బాబా యొక్క ఆశీర్వాదాల వల్ల నేను నా B.ed పరీక్ష పాస్ అయ్యాను
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments