నేను తీసుకువెళ్లిన ఫొటోలో బాబాని చూసేసరికి ధైర్యం రావటం కాదు అసలు వ్యాధి కూడా పారిపోయింది.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


మా తమ్ముడి కొడుకు సాయిమల్లికార్జున LLB చేసాడు. ఈ మధ్యనే ఉద్యోగం చేస్తున్నాడు. అతను చదువుకునేటప్పుడు నా దగ్గరే వుండి చదువుకునేవాడు.

మాకు మగపిల్లలు లేరు, ఇద్దరూ ఆడపిల్లలే కదా, మాకూ మా తమ్ముడికి ఒక్కడే అబ్బాయి, మా తమ్ముడికి ఒక అమ్మాయి కూడా వుంది. మేము వేరే వేరే ఊర్లలో కార్యక్రమాలు చేయాలంటే మాతో పాటు మావాడు కూడా వుండవలసి వచ్చేది.

కుర్రాడు కాబట్టి త్వరత్వరగా పనులు అందుకుంటాడని. వాడికీ బాబా అంటే ఇష్టమే, అందుచేత మాతో పాటు వస్తుండేవాడు. సేవ చేయటమంటే కూడా అందునా బాబా సేవ అంటే మరీ ఇష్టం.

ఒకసారి మేము బయలుదేరే సమయానికి సమయానికి వాడికి ప్రాక్టీకల్స్(mootcourty) కి తప్పని సరిగా వాడు ఉండిపోవాల్సి వచ్చింది. సెలవలు ఇచ్చేవారు కాదు.

“పెద్దనాన్నా! నేను మీతో పాటు రావటానికి అసలు కుదరదు. వీళ్ళు అసలు సెలవలు ఇచ్చేటట్లు లేరు ప్రాక్టీకల్స్ ఉన్నాయి, అవి మళ్ళీ పెట్టరట. మళ్ళీ పెట్టాలంటే 5000 రూపాయలు కట్టాలిట ” అని చెప్పాడు. 

అతను మాతో పాటు డెహ్రాడూన్ రావాలి. నేను భాదపడి బాబా ముందు నిలబడి ” బాబా వాడు నాతోటి రావాలి, నువ్వేం చేస్తావో మాకు తెలీదు ” అని అనుకున్నాను.

వెంటనే మా వాడికి ఫోన్ చేసి ” ఒరేయ్! సాయీ! నువ్వు వెంటనే బయలుదేరి వచ్చేయి. మనకి బాబా వున్నాడు. ఆయనే అన్నీ చూసుకుంటాడు, వచ్చేయి ” అని చెప్పాను.

వాడు మాతోపాటు బయలుదేరి డెహ్రాడూన్ వచ్చాడు. అక్కడ నామ సప్తాహం దిగ్విజయంగా జరుపుకుని, బయలుదేరి హైదరాబాద్ వచ్చాము.

మా వాడు కాలేజికి వెళ్ళాడు, వైస్ ప్రిన్సిపాల్ మా సాయిని పిలిచి ఊరికే ప్రాక్టికల్స్ చేసినట్లు చేసి మార్కులు వేసాడు. ఒక పైసా కూడా తీసుకోలేదు.

వాడికి ఉద్యోగం కూడా అంతే, 250 మంది క్యాంపస్ లో వుంటే, మా సాయి ఒక్కడే సెలెక్ట్ అయ్యాడు. నువ్వెలా సెలెక్ట్ అయ్యావు? కాలేజీకి సరిగా రావు, ఎప్పుడూ పూజలంటావు, భజనలంటావు, ఇదెలా సాధ్యం అని కాలేజీ లో అందరూ ఆశ్చర్యపోయారు.

ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగం అంటే అసలు సెలవలు ఇవ్వరు. అతన్ని మళ్ళీ నేను డెహ్రాడూన్ తీసుకెళ్లాలి. వీడు ఆఫీసులో అడిగాడట, నాకు సెలవు కావలి అని. సెలవు లేదు ఏమి లేదు అని కసిరి కొట్టాడట.

వీడికి మనస్సు మనస్సులా లేదు. అదేరోజు వాళ్ళ నాన్నకి వొంట్లో బాగోలేదని చాల సీరియస్ గా వుంది అని ఫోన్ వచ్చింది. రాత్రికి రాత్రి సాయి బయలుదేరి తెనాలి వెళ్ళాడు.

గుంటూరు ఆసుపత్రిలో తమ్ముడిని జాయిన్ చేసారు. మా తమ్ముడికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ తెనాలిలో ఇంట్లో ఉండిపోయాయి.

ఆ రిపోర్ట్స్ తీసుకురమ్మంటే మా వాడు బండి మీద తెనాలి నుంచి గుంటూరు వెళ్లి తీసుకు వస్తూ దారిలో ” నాన్నకి ఇలా వుంది, అవతల పెదనాన్న వాళ్ళు డెహ్రాడూన్ వెళ్తున్నారు,

ఆఫీసులో చూస్తే సెలవలు ఇవ్వడం లేదు. ఏం చేయాలి.” అని ఆలోచించుకుంటూ బండి నడుపుతున్నాడు. ఎదురుగా వచ్చే బైక్ వాడిని గుద్దేసాడు,

వీడు కింద పడ్డాడు, కానీ పెద్దగా దెబ్బలు ఏమి తగలలేదు, చిన్న చిన్న దెబ్బలే తగిలాయి. రిపోర్ట్స్ ఆసుపత్రిలో ఇచ్చి అక్కడే ఫస్ట్ ఎయిడ్ చేయించుకుని, చిన్న చిన్న బ్యాండేజీలతోనే హైదరాబాద్ వచ్చి అలానే ఆఫీసుకి వెళ్ళిపోయాడు.

మా వాడి HR చూసి ఏంటి బాబు ఇదంతా అన్నాడట. ఆక్సిడెంట్ అయ్యింది అన్నాడట బేలగా మొహం పెట్టి. సరే సరే లే ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకో, ఒక పదిరోజుల దాకా రాకు అన్నాడట.

వీడి మొహంలో మతాబులు, చిచ్చు బుడ్డీలు ఒక్కసారి వెలిగించినట్లుగా అయ్యింది. మళ్ళీ అది ఎక్కడా వ్యక్తం చేయకూడదు. అంతే ఆ దెబ్బలు లేవు, నెప్పులు లేవు. వెంటనే నాతో పాటు వచ్చేసాడు. ఇలా ఉంటాయి బాబా లీలలు.

రావడం వచ్చాడు కానీ వాళ్ళ నాన్నకి తగ్గినట్లే తగ్గి మళ్ళీ తిరగబెట్టింది. సీరియస్ అయిపొయింది, అంతే వెంటనే మా సాయి తిరిగి వచ్చేసాడు.

ఆ డెహ్రాడూన్ లో ఒకావిడ పేరు సరోజ మాతాజీ అంటారు, అక్కడ వాళ్ళకో బాబా గుడి వుంది. మేము ఎప్పుడు వెళ్ళినా ఆవిడే ఏర్పాట్లు అన్నీ చేస్తారు.

మేము మరలా తిరిగి వచ్చేటప్పుడు ఎంత మందిమి ఇక్కడి నుంచి వెళ్ళామో, అంత మందికి ( దాదాపు వంద మంది ) వాళ్ళు బట్టలు పెట్టి పంపుతారు. బట్టలతో పాటు సాయిబాబా ఫోటో కూడా ఒకటి అందరికి ఇచ్చారు.

మా సాయి వచ్చి వెళ్ళిపోయినా, ఆవిడ గుర్తుపెట్టుకొని, మా సాయికి బట్టలతో పాటు ఫోటో కూడా ఇవ్వమని పంపారు.

మేము అవి తీసుకొని హైదరాబాద్ వచ్చాక మా తమ్ముడి పరిస్థితి తెలుసుకోవడానికి ఫోన్ చేసాము.

గ్లోడర్లో రాయి ఉండిపోయింది. దాన్ని బ్లాస్ట్ చేసారు. ఆ చేయటంలో ఒక ముక్క యూరిన్ గుండా వచ్చేసింది, ఒక ముక్క యూరిన్ ట్రాక్లో ఇరుక్కుపోయింది అని అన్నారు. చాలా సీరియస్ అయిపోయింది.

మా తమ్ముడు అప్పటిదాకా చాలా భయపడుతున్నాడు. మేము హైదరాబాద్ నుంచి తెనాలి వాడిని చూడటానికి వెళ్ళాము. మేము కూడా బాబా ఫోటో మరియు ఊది తీసుకెళ్ళాము.

మా తమ్ముడి ఎదురుగా ఫోటో ఉంచాము. అది చూడగానే వాడికి ప్రశాంతం అయ్యి భయం పోయింది.

నేను, కూడా తీసుకువెళ్లిన ఊది వాడి నుదిటిన పెట్టి కొంచెం నోట్లో వేసాను. అంతే! అప్పటిదాకా ఏంతో బాధ పడుతున్నాడట. గుంటూరులో చాలా ఫేమస్ డాక్టర్ కూడా నేనేం చేయలేను, నా వల్లకాదు అని చేతులు ఎత్తేశాడు.

హైదరాబాద్ తీసుకువెళ్లి నిమ్స్ లో జాయిన్ చేయండి అని చెప్పారు. మీరు ఎక్కడా జాయిన్ చేసినా ఎటువంటి గ్యారంటీ లేదు అని చెప్పేసారు. అందుకే మా తమ్ముడు బాగా ఢీలా పడిపోయాడు.

నేను తీసుకువెళ్లిన ఫొటోలో బాబాని చూసేసరికి ధైర్యం రావటం కాదు అసలు వ్యాధి కూడా పారిపోయింది.

మర్నాడు ఉదయంకల్లా ఎటువంటి సమస్య లేకుండా అయిపొయింది. ఇప్పటికీ అతనికి ఎటువంటి బాధ లేదు. కులాసాగా వున్నాడు.

The above telugu TEXT typed by : Mr Sai Krishna

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles