Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
జూన్ 4వ.తేదీ 1936 న నార్కే గారు బి. వి. నరసింహస్వామి గారితో చెప్పిన విషయాలు
1914 ప్రాంతంలో హార్దాకు చెందిన ఒక శ్రీమంతుడయిన వృధ్ధుడు ఒకామెతో షిరిడీ వచ్చాడు.
అతను క్షయ వ్యాధితో బాధ పడుతున్నాడు. షిరిడీ చేరిన ఒక నెలకు ఆరోగ్యం కాస్త మెరుగవడంతో, షిరిడీనే తన నివాసంగా చేసుకున్నాడు.
కాని రెండవ నెల చివర్లో అతని పరిస్థితి విషమించి మృత్యువు సమీపించినట్లు అనిపించింది.
అప్పుడు బాబా దగ్గరకు వెళ్ళి సహాయం కోరేందుకు, వారింట్లో మగ దిక్కు ఎవరూ లేనందువల్ల ఆయన ఇంట్లోని ఆడవాళ్ళు, వాళ్ళ స్నేహితురాళ్ళు బాబాను అడిగి ఊదీ తెచ్చిపెట్టమని నన్ను అభ్యర్ధించారు.
నేను బాబా దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి ఊదీ అడిగాను.
బాబా “ఆ వృధ్ధుడు ఈ ప్రపంచాన్ని వదలివెళ్ళడమే మంచిది. అతనికి ఊదీ ఏమి చేయగలదు? అయినా వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి తీసుకెళ్ళు” అన్నారు.
నేను ఊదీ తీసుకొని వాళ్ళకిచ్చాను. కానీ బాబా చెప్పిన విషయాలేమీ వాళ్ళకు చెప్పలేదు. అతని పరిస్థితి మరింత విషమించింది.
అప్పుడు శ్యామా బాబాతో ఆ వృధ్ధునికి అంతిమ ఘడియలు సమీపించాయని చెప్పాడు. బాబా “అతనెలా చనిపోగలడు? రేపు ఉదయానికల్లా ప్రాణం పోసుకుంటాడు” అని అన్నట్లున్నారు.
ఆ మాటలను బట్టి అతను చనిపోడని అంతా అనుకున్నారు. కానీ ఆ వృధ్ధుడు ఆ రాత్రి మరణించాడు.
అయినా వాళ్ళు శవం చుట్టూ దీపాలు వెలిగించి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు వేచి చూసారు.
కాని అతనిలో చలనం కనపడలేదు. ఇక ఆశ వదలుకొని అంత్యక్రియలు జరిపించారు. వృధ్ధుని బంధువులు, బాబా తమను నిరాశ పరిచారని భావించి షిరిడీ నుండి వెళ్ళిపోయారు. మూడు సంవత్సరాల పాటు వాళ్ళు షిరిడీకి రాలేదు.
తరువాత ఒక రోజు వృధ్ధుని బంధువొకతనికి బాబా కలలో కనిపించారు. బాబా శరీరంపై చనిపోయిన వృధ్దుని తల వుంది.
బాబా అతనికి కుళ్ళిపోయి ఉన్న ఊపిరితిత్తులను చూపించి , ‘ఇంతటి బాధనుండి ఆ వృధ్ధుణ్ణి విముక్తుణ్ణి చేశాను” అని చెప్పారు. అతను తన కల విషయం అందరికీ చెప్పాడు.
అప్పటినుండి వృధ్ధుని బంధువులు తిరిగి షిరిడీకి రావడం ప్రారంభించారు. “అతడెలా చనిపోగలడు? తిరిగి ప్రాణం పోసుకుంటాడు” అన్న బాబా మాటలు ప్రాణం శిధిల శరీరాన్ని విడిచి, మరొక కొత్త శరీరాన్ని ధరిస్తుందనే అర్ధంతో చెప్పబడిందని మనం గ్రహించాలి.
శ్రీసాయిబాబా ఈ లోకంలోను, ఇతర లోకాలలోనూ తాము నిర్వహించే విధులను గూర్చి అరుదుగా చెబుతుండేవారు.
అంతేగాక గతించినవారి ఆత్మల స్థితిగతులను కూడా తమ అదుపాజ్ఞలలో ఉంచుకున్నానని చెప్పేవారు.
ఈ జగత్తుపై తమకు గల ఆధిపత్యాన్ని తెలియచేసేవారు. బాబా ఎప్పుడూ అసత్యం పలికేవారు కాదు. అర్ధరహితంగా మాట్లాడేవారు కాదు.
వారి పధ్ధతులను గురించి బాబాను ఎరిగినవారు మాత్రమే వారి మాటలను చర్యలను అర్ధం చేసుకోగలిగేవారు. అది కూడా ఎవరిని ఉద్దేశించి పలికారో వారు మాత్రమే అర్ధం చేసుకోగలరు.
శ్రీ సాయిబాబా ఎన్నడూ ఉపన్యాసాలు, ప్రవచనాలు చేయలేదు. ఎప్పుడైనా సందర్భానుసారం కొన్ని కొన్ని పదాలతో చిన్న చిన్న వాక్యాలతోనే అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యాలను వెల్లడించేవారు.
పరిశీలనా దృష్టితో చూసే భక్తులు బాబా పలికిన కొద్ది మాటలను వారికి తోచిన విధంగా సిధ్ధాంతీకరించుకొనేవారు. అందువల్ల బాబా సిధ్ధాంతము, పధ్ధతి ఇదీ అని ఏ భక్తుడూ మొండిగా వాదించడానికి వీలుపడేది కాదు.
భగవంతుని చేరడమే లక్ష్యం, సప్తసముద్రాలను, లోకాలను దాటి దేవుని చేరుకోవాలి (అల్లా మిళణారా సప్తసముద్ర నిహాలా కరణ), భవబంధములను దాటిపోవాలి (బేడా పార్ కర్ నా) “ అనేవారు.
ఇక బాబా ఏ మతానికి చెందినవారన్న విషయానికొస్తే, నాకు తెలిసినంత వరకు వారెన్నడూ తాము ప్రత్యేకించి ఒక కులానికి, జాతికి, మతానికి చెందినవారమని చెప్పలేదు.
బాబా వీటన్నిటికీ అతీతులు. కానీ, బాబా ప్రస్తావించిన విషయాలు, ఆయన చర్యలు ఆయనకు హిందూ మతంతో గల సంబంధాన్ని తెలియపరుస్తున్నాయి.
బాబా అనుగ్రహం పొందడానికి ముందుగా కావలసినది వారిపై పూర్తి విశ్వాసం. ఒక్కసారే బాబాను దర్శించి వారి సమక్షంలో కొద్ది సమయం మాత్రమే గడిపిన భక్తులకు కూడా వారు ఆ నమ్మకాన్ని కలుగచేస్తారు.
బాబా ఒక్కొక్క భక్తునికి ఒక్కొక్క రీతిలో అనుభవాలు, నిదర్శనాలు ప్రసాదిస్తారు. దానివల్ల వారి అంతర్యామిత్వము, సర్వవ్యాపకత, త్రికాలజ్ఞత చూసిన భక్తులకు అప్పటికప్పుడు వారిపై విశ్వాసం ఏర్పడుతుంది.
అందుచేత గురువు యొక్క కృపకు పాత్రుడవాలంటే భక్తునికి ,ముందుగా కావలసినవి సత్ర్పవర్తన, పవిత్రత, నిరాడంబరత, సద్భుద్ధి.
భక్తుల అనుభవంలో బాబా సాక్షాత్తు భగవంతుడె. అందులో ఏమాత్రం సందేహం లేదు. అది భక్తుల అనుభవం.
శ్రీ సాయి అంకిత భక్తుడయిన జి. జి. నార్కే గారి గురించిన సమాచారం లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ లింక్ ద్వార సేకరించడం జరిగింది.
Latest Miracles:
- ఇతనిని నాకు పరిచయం చేయాలా? నాకితను 30 జన్మలనుండి పరిచయం-శ్రీ జి.జి. నార్కే-1–Audio
- నాకు నీ నుంచి ఎటువంటి ధనము అవసరం లేదు–శ్రీ జి.జి. నార్కే-2–Audio
- ఈ రోజు భిక్షా పాత్రను ఇతనికిచ్చి పంపించండి. ఇతను భిక్షకు వెడతాడు–శ్రీ జి.జి. నార్కే-3–Audio
- సాయిబానిస(శ్రీ రావాడ గోపాలరావు) గారి అనుభవాలు — 3
- శ్రీ సాయిబాబా అనుగ్రహమునకు శ్రీ భరద్వాజ గారు పాత్రులగుట–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments