Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
శ్రీ సాయి అంకిత భక్తులు – ప్రొఫెసర్ శ్రీ జి.జి. నార్కే
ఎంతో కాలం తర్వాత 1916 వ.సంవత్సరంలో నార్కే షిరిడీకి వచ్చారు.
రాగానే బాబాకు ఎవరెవరు ఏయే సేవలు చేస్తున్నారని విచారించారు. న్యాయవాది యైన వామనరావు పటేల్ బాబా తరఫున గ్రామంలో భిక్షాటన చేస్తున్నట్లుగా చెప్పారు.
ఆమాట వినగానే నార్కే కాస్త అసూయ పడ్డారు. బాబా తరఫున భిక్షను అడిగే సేవను నాకెందుకు ప్రసాదించకూడదు అని తన మనసులో అనుకున్నారు. కాని బయటకు ఎవరికీ చెప్పలేదు.
అప్పుడే ద్వారకామాయిలో బాబాను దర్శించుకునే సమయం ఆసన్నమయింది.
నార్కే గారికి దుస్తులను కూడా మార్చుకునే సమయం లేకపోవడం చేత సూటు, బూటు, ఫాంటు, కోటు, నెత్తి మీద టోపీల తోనే మశీదుకు వెళ్ళి బాబాను దర్శించుకున్నారు.
ఆ సమయంలో ఒక భక్తుడు వామనవారువును భిక్షకు పంపించమంటారా అని మూడు సార్లుగా బాబాను అడుగుతూనే ఉన్నాడు.
ఉన్నట్లుండి బాబా నార్కే వైపు చూపుతూ, “ఈ రోజు భిక్షా పాత్రను ఇతనికిచ్చి పంపించండి. ఇతను భిక్షకు వెడతాడు” అని అన్నారు.
ఆ రోజు నార్కేగారు సూటు, బూటు, కోటు, నెత్తిమీద టోపీ ఈ వేషంలో బాబా తరఫున భిక్షకు బయలుదేరి భిక్షను తెచ్చాడు. ఆ తరువాత నాలుగు నెలలు మామూలు దుస్తులు ధరించి మధ్యాహ్నం వేళలో బాబా తరఫున భిక్షకు వెళ్ళారు.
అంత కాలంపాటు భిక్షకు వెళ్ళినది ఆయన ఒక్కరే. బాబా ఆయననే భిక్షకు వెళ్ళడానికి ఎందుకని ఎన్నుకున్నారో ప్రజలు అర్ధం చేసుకోలేకపోయారు.
ఆయన మనసులో ఉన్న కోరికను బాబా తెలుసుకొన్నారు కాబట్టే, బాబా ఆయనకు తనకు సేవ చేసుకునే భాగ్యాన్ని కలిగించారు. బాబా తరఫున మధ్యాహ్నం వేళలో భిక్షకు వెళ్ళే భాగ్యాన్ని ఆయన చాలా తక్కువ మందికి ఇచ్చారు.
ఆఖరికి 1917వ.సంవత్సరంలో పూనా విశ్వవిద్యాలయంలో భూగర్భ శాస్త్రానికి సంబంధించిన కోర్సు ప్రారంభమయింది.
అందులో ఆ శాస్త్రాన్ని భోధించేందుకు ఒక ప్రొఫెసర్ కావాలని పత్రికా ప్రకటన ఇచ్చారు విశ్వవిద్యాలయం వారు.
ఆ ఉద్యోగానికి దరఖాస్తు చేయమంటారా అని బాబాను సలహా అడిగి ఆయన అనుమతితో దరఖాస్తు పంపించారు. ఎంతో మంది అభ్యర్ధుల పోటీ ఎక్కువగా వుంది.
పైగా పలుకుబడి కలవారి సిపర్సులు తీసుకోని రావడంతో అతని పరిస్తితి క్లిస్తాతరమయింది.
అతడు షిరిడి నుంచి వెళ్ళిన తరువాత బాబా అక్కడున్న వారిని “నార్కే ఎక్కడికి వెళ్ళాడు” అని అడిగారు.
నార్కే ఉద్యోగ ప్రయత్నం కొరకు పూనా వెళ్ళినట్లు చెప్పగానే, బాబా “అల్లా అనుగ్రహిస్తారు” అన్నారు. తరువాత “నార్కే కు పిల్లలున్నారా” అని బాబా విచారించగా, అతనికి చాలామంది పిల్లలు పుట్టారు.
కానీ ఎవ్వరు ఎక్కువ కాలం బ్రతక లేదని అక్కడి వాళ్ళు చెప్పారు. అప్పుడు కూడా బాబా “అల్లా అనుగ్రహిస్తారు ” అని ఆశీర్వదించారు.
బాబా చెప్పినట్లే మంచి జీతంతో ఆయన 1918 లో ఆ విశ్వవిద్యాలయంలో భూగర్భ, గనుల శాస్త్రంలో ప్రొఫెసర్ గా నియమితులయ్యారు. 1919 లో ఆ ఉద్యోగం పర్మినెంటు అయింది.
బాబా ప్రతి పట్టణానికి చివర ‘పూనా’ అని ఎందుకని జత చేస్తూ చెప్పేవారో ఇపుడాయనకి అర్ధమయింది.
ఆ తరువాత కలిగిన బిడ్డలు అందరు క్షేమంగా ఉన్నారు. ఇవన్నీ బాబా క్రుపాశీస్సుల వలన మాత్రమే సాధ్యము అయ్యాయి.
ఆ విధంగా ఆయన తన సంపాదనతో ఒక మంచి బంగళాను కొనుక్కుని భార్యా పిల్లలతో సుఖంగా జీవించారు. (ఆయనకు నలుగురు కొడుకులు). బాబాగారి సర్వవ్యాపకత్వానికి ఉదాహరణ ఆయనకు ప్రత్యక్ష అనుభవమయింది.
బాబా భక్తులందరిలోను ఉన్నత విద్యాభ్యాసం చేసిన వ్యక్తి నార్కేగారు ఒక్కరే.
ఆయనకు మంచి సూక్ష్మ దృష్టి కలవారనే గుర్తింపు ఉంది. బాబా ను దగ్గరనుండి నిశితంగా పరిశీలించే అవకాశం ఆయనకు కలిగింది.
దాని వల్ల బాబాను బాగా అర్ధం చేసుకొన్నారు. అంతటి ఉన్నత విద్యావంతుడు బాబా భక్తుడు అయినా నార్కేగారి నుంచి, బాబాతో ఆయన అనుభవాలను, బాబాగారి అతీంద్రియ శక్తులను గురించి తెలుసుకోవడానికి, 1936 లో నరసింహస్వామి గారు ఆయనను ఇంటర్వ్యూ చేశారు.
ఆ ఇంటర్వ్యూలో, తన గత నాలుగు జన్మల వివరాలను బాబా గారే మసీదులో భక్తులందరి సమక్షంలో చెప్పారని అన్నారు.
కాని బాబా చెప్పిన ఈ విషయాలు నార్కేకు సంబంధించినవని ఎవరూ అర్ధం చేసుకోలేకపోయారు. మరికొంత మంది అదంతా అసందర్భంగా మాట్లాడిన మాటలుగా భావించారు.
బాబాకున్న ప్రత్యేకమయిన కళ ఏమిటంటే ఆయన చెప్పే విషయం ఎవరి గురించయితే చెబుతున్నారో వారికే అర్ధమయేలా చెప్పడం.
మిగిలినవారికి వారు చెప్పే మాటలు అర్ధమయ్యేవి కావు. బాబా ఈలోకంలోనే కాదు విశ్వాంతరాళంలో కూడా అదృశ్య రూపంలో పర్యటిస్తూ అక్కడి విషయాలను నియంత్రిస్తూ ఉండేవారని నరసింహస్వామీజీ గారి ఇంటర్వ్యూలో చెప్పారు.
అదృశ్య శరీరంతో తాను విశ్వాంతరాళంలో పర్యటిస్తూ ఉండేవాడినని బాబా తరచు నాతో చెబుతూ ఉండేవారని చెప్పారు నార్కే.
ఉదయం వేళలలో బాబా ధుని ముందు కూర్చొని తరచుగా ఎవరితోనో మాట్లాడుతున్నట్లుగాను, లేకపోతే కొన్ని పనులు చేయమని వారిని ఆజ్ఞాపిస్తున్నట్లుగాను సంజ్ఞలు చేసేవారని చెప్పారు.
మసీదులో ఉన్నవారితో తాను క్రితం రోజు రాత్రి సుదూర ప్రాంతాలకు ఎక్కడకు వెళ్ళినది, అక్కడ ఏమి చేసినది ఇటువంటి విషయాలు కూడా చెబుతూ ఉండేవారని, ఆ తరువాత విచారిస్తే బాబా చెప్పిన విషయాలు నిజమేనని నిరూపితమయ్యాయని కూడా నార్కే గారు తన ఇంటర్వ్యూలో చెప్పారు.
సర్వం సాయినాథర్పాణమస్తు
Latest Miracles:
- నాకు నీ నుంచి ఎటువంటి ధనము అవసరం లేదు–శ్రీ జి.జి. నార్కే-2–Audio
- ఇతనిని నాకు పరిచయం చేయాలా? నాకితను 30 జన్మలనుండి పరిచయం-శ్రీ జి.జి. నార్కే-1–Audio
- అతనెలా చనిపోగలడు? రేపు ఉదయానికల్లా ప్రాణం పోసుకుంటాడు–శ్రీ జి.జి. నార్కే-4–Audio
- ‘‘రేపు నీ ఇంటికి భిక్షకు వస్తున్నాను.’’
- అర్ధాలే వేరు…! …..సాయి@366 ఆగస్టు 31….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments