తర్ఖడ్ కుటుంబము (తండ్రి, కొడుకు)–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్ద సద్గురు సాయినాధ్ మహరాజ్‌ కీ జై!!

This Audio prepared by Mr Sreenivas Murthy

  1. Art-3 తర్ఖడ్ కుటుంబము 3:26

రామచంద్ర ఆత్మారామ్ పురఫ్ బాబాసాహెబు తర్ఖడ్ యొకా నొకప్పుడు ప్రార్థనసమాజస్థుడైనను బాబాకు ప్రియభక్తుడు.

వాని భార్యాపుత్రులు కూడ బాబాను మిగుల ప్రేమించుచుండిరి. తల్లితో కూడ కొడుకు షిరిడీకి పోయి యచ్చట వేసవిసెలవులు గడుపవలెనని నిర్ణయించిరి.

కాని కొడుకు కిష్టపడలేదు. కారణ మేమన తన తండ్రి ప్రార్థన సమాజమునకు చెందినవాడగుటచే ఇంటివద్ద బాబాయెక్క పూజ సరిగా చేయకపోవచ్చునని సంశయించెను.

కాని తండ్రి, పూజను సక్రమముగా చేసెదనని వాగ్దానము చేయుటచే బయలుదేరెను. అందుచే శుక్రవారము రాత్రి తల్లి, కొడుకు బయలుదేరి షిరిడీకి వచ్చిరి.

ఆ మరుసటిదినము శనివారమునాడు తండ్రియగు తర్ఖడ్ త్వరగా లేచి, స్నానముచేసి,

పూజను ప్రారంభించుటకు పూర్వము బాబా పటమునకు సాష్టాంగనమస్కారము చేసి లాంఛనమువలె కాక కొడుకు చేయునట్లు పూజను సక్రమముగా నెరవేర్చెదనని ప్రార్ధించెను.

ఆనాటి పూజను సమాప్తిచేసి నైవేద్యము నిమిత్తము కలకండను అర్పించెను. సమయమందు దానిని పంచిపెట్టెను.

ఆనాటి సాయంత్రము, మరుసటిదినము ఆదివారము పూజయంతయు సవ్యముగా జరిగెను. దానికి మరుసటిదినము సోమవారము కూడ చక్కగా గడిచెను.

ఆత్మారాముడు ఎప్పుడిట్లు పూజచేసియుండలేదు. పూజయంతయు కొడుకునకు వాగ్దానము చేసినట్లు సరిగా జరుగుచున్నందుకు సంతసించెను.

మంగళవారమునాడు పూజనెప్పటివలె సలిపి కచేరికి పోయెను. మధ్యాహ్నభోజనమునకు వచ్చినప్పుడు తినుటకు ప్రసాదము లేకుండెను.

నౌకరును అడుగగా, ఆనాడు ప్రసాదమర్పించుట మరచుటచే లేదని బదులు చెప్పెను. ఈ సంగతి వినగనే సాష్టాంగనమస్కారము చేసి, బాబాను క్షమాపణ కోరెను.

బాబా తనకు ఆ విషయము జ్ఞప్తికి తేనందకు నిందించెను. ఈ సంగతులన్నిటిని షిరిడీలోనున్న తన కొడుకునకు వ్రాసి బాబాను క్షమాపణ వేడుమనెను. ఇది బాంద్రాలో మంగళవారము 12 గంటలకు జరిగెను.

అదే సమయమందు మధ్యాహ్మహారతి ప్రారంభించుటకు సిద్ధముగా నున్నప్పుడు,

బాబా యాత్మారాముని భార్యతో “తల్లీ! బాంద్రాలో మీ యింటికి ఏమయిన తినే ఉద్దేశముతో పోయినాను. తలుపు తాళమువేసియుండెను. ఏలాగుననో లోపల ప్రవేశించితిని. కాని తినుట కేమిలేక తిరిగి వచ్చితిని” అనెను.

అమెకు బాబా మాటలు బోధపడలేదు. కాని ప్రక్కనేయున్న కుమారుడు ఇంటివద్ద పూజలో నేమియో లోటుపాటు జరిగినదని గ్రహించి యింటికి పోవుటకు సెలవు నిమ్మని బాబాను వేడెను.

అందులకు బాబా నిరాకరించెను. కాని పూజను అక్కడనే చేయుమనెను. కొడుకు వెంటనే తండ్రికి షిరిడీలో జరిగినదాని నంతటిని వ్రాసెను. పూజను తగిన శ్రద్ధతో చేయుమని వేడుకొనెను.

ఈ రెండు ఉత్తరములు ఒకటికొకటి మార్గమధ్యమున తటస్థపడి తమతమ గమ్యస్థానములకు చేరెను. ఇది ఆశ్చర్యకరము కదా!

సంపాదకీయం: శ్రీ సాయి సత్ చరిత్రము

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు

మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles