నేనిప్పుడు బాబా యొక్క నిజమైన ప్రసాదాన్ని పొందాను–బాబావారితోతార్ఖడ్ కుటుంబము-25–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు 


This Audio prepared by Mr Sri Ram



అబా పన్షికర్ నుంచి సాయి ప్రసాదం

యిక మామూలు క్రమంలో వాస్తవ సంఘటనలు ముందున్నాయి. మా బంగళా బ్లూ ప్రింట్ ని మేము తయారు చేసినప్పుడు, పూజ చేసుకోవడానికి, థ్యానానికి ఒక చిన్న పాలరాతి మందిరం కూడా ఉండాలని నిర్ణయించుకున్నాము.

మందిరం తయారయింది, దానిలోకి నిలువెత్తు సైజు బాబావారి రంగుల చిత్రపటం ఉంచాలని బలమైన కోరిక కలిగింది. మేము చాలా ప్రయత్నం చేశాము కాని దొరకలేదు.

అది ఏప్రిల్ నెల 1993. బొంబాయి మార్చ్ నెలలో విషాదకరమైన బాంబు పేలుళ్ళను చవి చూసింది. ప్రజలంతా అపరిచితుల నెవరితోనైనా మాట్లాడటానికి భయపడేవారు.

ఒక రోజున సాయంత్రం పొద్దు పోయాక ఒక అపరిచిత వ్యక్తి మా యింటి తలుపు బెల్ మోగించాడు.

నా భార్య తలుపు వద్దకు వెళ్ళింది. ఆ అపరిచిత వ్యక్తి ప్రత్యేకంగా నన్నే కలుసుకోవాలని పట్టుపడుతున్నాడు. అతను నా పేరు చెప్పలేకపోవడంతో నా భార్య అతని గురించి కొంచెం అనుమాన పడింది.

అప్పుడు నేను కల్పించుకోవడంతో నన్నతను గుర్తు పట్టాడు.

షిరిడీలో లెండీ బాగ్ లో తామిద్దరమూ కలుసుకున్నామని గుర్తు చేసి, తనకక్కడ బాబా అనుభవాన్ని కూడా చెప్పినట్లు చెప్పాడు. అప్పుడు నాకు స్పష్టంగా బోథపడింది.

అతను పూనా సాయి మందిరంలో సామాజిక సేవకుడు. అతనిని యింట్లోకి రావడానికి అనుమతించాను.

అప్పుడది రాత్రి భోజనం చేసే సమయం కనుక మేమతనిని భోజనం చేయమన్నాము. దానికతను అంగీకరించాడు. మేము మాట్లాడుకుంటున్నపుడు నేనతనిని సాయిబాబా రంగుల చిత్రపటం కావాలనే నా కోరికను వెల్లడించాను.

మేము కనక రంగుల చిత్రపటం కోసం చూస్తూ ఉండినట్లయితే, ఒక చిత్రకారుడి నుంచి నిలువెత్తు చిత్ర పటానికి రంగులు వేసినది పొందవచ్చని వెంటనే సమాథానమిచ్చి, అప్పుడే అబా పన్షికర్ మాకు సహాయం చేయగలరని చెప్పాడు.

మరాఠీ రంగస్థలం మీద ప్రముఖ నటుడయిన ప్రభాకర్ పన్షికర్, అతని తమ్ముడయిన అబా పన్షికర్ ఫోన్ నంబరు అతని వద్ద ఉంది.

నేనాయనకి ఫోన్ చేసి లండన్ లో ఉన్న అబా పన్షికర్ నెంబరు తీసుకుని ఫోన్ చేశాను. రంగుల చిత్రపటం గురించిన నా కోరికను విని, అతను తాను మే నెలలో బొంబాయి వస్తున్నానని, తనను తన తమ్ముడు ఉండే చోట ప్రభాదేవి వద్ద కలుసుకోవచ్చనీ సమాథానమిచ్చాడు.

నేను మే నెల దాకా నిరీక్షించి ఒక శనివారం సాయంత్రానికి కలుసుకోవడానికి అనుమతి తీసుకున్నాను.

మేమంతా, అనగా నాభార్య కుందా, మా అమ్మాయి సుజాల్, నా కుమారుడు మహేంద్ర అందరమూ కలిసి 22, మే, 1993 న. వెళ్ళాము. నాకతని గురించి అసలు తెలీదు.

మా ముందు కాషాయ వస్త్రాలు థరించి మెడలో రుద్రాక్ష మాలతో ఒకాయన మాముందు కనిపించాడు. అబా పన్షికర్ గారు తనను తనను పరిచయం చేసుకున్నారు.

నేనాయనకు చేతులు జోడించి ‘నమస్కారం’ చేసి నా కుటుంబాన్ని పరిచయం చేశాను.

పూలదండ, కోవా ఏమీ తేకుండా ఉట్టి చేతులతో ఎలా వచ్చారని ఆయన కొంచెం మందలించారు. ఆయన మాకోసం చిత్రపటం తెచ్చినట్లు నాకసలెప్పుడూ చెప్పకపోవడంతో నేను కొంచెం ఆశ్చర్యపోయాను.

ఏమయినప్పటికీ నా తప్పును మన్నించమని వెంటనే సిథ్థివినాయక మందిర ప్రాంతానికి వెళ్ళి పూలదండ, కొన్ని కోవా బిళ్ళలు కొన్నాను.

ఆయన లోపలికి వెళ్ళి తనతో కూడా ఏనుగు సైజంతగ ఉన్న చిత్రపటాలను వుంచే పెట్టిని తీసుకునివచ్చారు.

దానిని తెరచి డ్రాయింగ్ పేపరు చుట్టను తీశారు. ఆయన ఆ చుట్టను విప్పారు. దాని మీద ప్రసిథ్థమైన సింహాసనం మీద కూర్చుని సాయి తన నిత్యమైన చిరునవ్వుతో మాముందున్నారు.

ఆయన సలహామీద, 1 మీ.మీ.దళసరి కోడక్ పేపరు మీద చిత్రించబడ్డ రంగుల చిత్రపటానికి దండవేసి అందరికీ కోవా పంచాను.

అబా గారు దాని మీద సందేశం యిలా రాశారు, “వీరేంద్ర, కుందా, సుజాల్, మరియు మహేంద్ర కు” — అబా పన్షికర్ నుంచి సాయి ప్రసాదం”… కింద సంతకం చేశారు.

అప్పుడాయన “మీ నిథిని తీసుకోండి” అన్నారు. పాఠకులారా అది నా జీవితంలో బంగారు క్షణమంటే నమ్మండి. ఏమి చేయడానికి నాకు నోట మాట రాలేదు.

. నేను నా పర్సులోని రూ.1,001/- తీసి ఆయనకిచ్చాను. కాని దానినాయన అంగీకరించలేదు.

తాను బాబా ఫోటోలు అమ్మనని చెప్పారు. లండన్ లో సాయి మందిరానికి విరాళంగా తీసుకోమని చెప్పాను.

అయిష్టంగానే ఆయన ఒప్పుకుని, చేతితో తీసుకోకుండా దానిని బల్లమీద పెట్టమన్నారు.

ఆయన మా గత చరిత్ర గురించి అడిగారు. సాయిబాబాతో మా నాన్నగారికున్న అనుబంథం గురించి చెప్పాను.

నేను చెప్పినది వినగానే నన్నాయన కౌగలించుకుని తానా రోజు తన జీవితంలో అమితమైన ఆనందాన్ని పొందానని చెప్పారు. ఆయన ఉద్విగ్న్నతతో లోపలికి వెళ్ళి రూపాయి నాణాలు రెండు తెచ్చి నాకిచ్చారు.

నేను వాటిని తీసుకుని ఆయన ముందు సాష్టాంగ పడి “నేనిప్పుడు బాబా యొక్క నిజమైన ప్రసాదాన్ని పొందాను” అన్నాను. ఆయన దీనికర్థమేటని అడిగారు.

“ఈ రెండు నాణాలు బాబాగారి విశ్వవ్యాప్తకమైన సందేశం అనగా ‘శ్రథ్ఠా’ మరియు ‘సబూరీ’ , ఆయన ఉన్న కాలంలో ప్రపంచం మొత్తం వ్యాపించిందని” చెప్పాను.

నా వివరణతో అబా సంతోషంలో మునిగిపోయారు. ఆయన కళ్ళనుంచి ఆనంద భాష్పాలు జాలువారుతూండగా, తానారోజు ఒక నిజమైన సాయి భక్తుడిని కలుసుకున్నానని గట్టిగా ఆలింగనం చేసుకున్నారు.

అప్పుడు ఆబా మాకు తన కథను చెప్పారు. ఆయన తండ్రి, గిర్గావ్ లో ఉన్న గణపతి మందిరం ప్రథాన పూజారి. తనకి 8 సం.వయసప్పుడు ఒక ముస్లిం ఫకీరు వారి యింటి ఆవరణలోకి వచ్చి సాయిబాబా ఫోటొనిచ్చారు.

ఆబా, ఆఫకీరుతో తాను బ్రాహ్మణుల కొడుకుననీ, యింటిలో ముస్లిం బాబా ఫొటోను పెట్టనివ్వరనీ అన్నాడు. ఆపుడాఫకీరు, “బేటే, అబ్ తూ యిసే మత్ లే తేరీ కిస్మత్ మే లిఖాహై తూ ఇస్కీ జిందగీ భర్ సేవా కరేగా జోర్ ఇస్కే ఫోటో లోగోంకో బతా కరేగా” (అబ్బాయి, యిప్పుడు నువ్వీ ఫొటోని తీసుకోలేకపోవచ్చు,

కాని నీ భవిష్యత్తుని చదవగలను. నువ్వు నీ జీవితాంతమూ ఆయన సేవ చేస్తావు. ఆయన చిత్రాలని నువ్వు ప్రజలకు పంచుతావు).

ఆయన భవిష్యత్ సూచనలు నూటికి నూరుపాళ్ళు యధార్థం. ఆబా గారు తమ చరమదశ వరకు సాయిబాబా సేవలో ఉనారు. నేను మిమ్మల్ని మన్నించమని కోరుతున్నాను.

నేను ఆయనని కీర్తిశేషులు అబా పన్షికర్ అని సంబోథిస్తాను, కారణం ఆయన మనమథ్యన లేరు.

విలువైన ఆ చిత్రపటాన్ని లామినేషన్ చేయించి దానికి చెక్క ఫ్రేము తయారు చేయించాను. 1993 సం.ఒక గురుపూర్ణిమ నాడు, వన్ గాన్ లోని మా ‘విజ్యోత్’ బంగళా లో చిన్న సాయిమందిరంలో దానిని ప్రతిష్టించాము. అప్పటినుంచి మేము మా గురుపూర్ణిమని అక్కడే సామాన్యంగా యింటిలో జరుపుకునే పథ్థతిలోనే జరుపుకుంటాము.

యిది నా స్వంత చిన్న అనుభవం. నాకు కోరిక పుట్టినప్పుడెల్లా షిరిడీ వెడుతూ ఉంటాను. యిప్పుడు నేను పదవీ విరమణ చేసి, సుఖంగా జీవిస్తున్నాను. మేమిప్పుడు బాబాని ఒకటే ప్రార్తిస్తున్నాము.

మా పిల్లలకు కూడా సాయిభక్తులే జీవిత భాగస్వాములుగా రావాలని, తార్ఖడ్ కుటుంబంలో లార్డ్ సాయి మీద ప్రేమ, భక్తి అలా నిరంతరం కొనసాగుతూ ఉండాలనీ ప్రార్థిస్తున్నాను.

ఆఖరుగా నేను సాయి భక్తులందరినీ కోరేదేమంటే సాయిబాబా మనకిచ్చిన మహా మంత్రాలయిన ‘శ్రథ్థ, సబూరీ, ‘ అనగా నమ్మకం, సహనం, వీటిని మరవవద్దని. యదార్థంగా వీటికే కట్టుబడివుంటే ఈ రెండు మంత్రాలూ మీ కోరికలను తప్పక నెరవేరుస్తాయి.

అపరిమితమైన నమస్కారములతో ఉచితమైన రీతిలో మనమెప్పుడు నిత్యం ప్రేమించే మన సాయికి  అభివాదములు సమర్పించుకుంటూ ఈ గ్రంథాన్ని ముగించదలచుకున్నాను.

ఇక వీరేంద్ర తర్కాడ్ గారు వారి ఫ్యామిలీ కి  చెందిన మరి కొన్ని లీలలు సాయి సచ్చరిత్ర లో వచ్చిన వాటి గుర్చి రేపటి భాగం లో చెపుతారు  …

ఈ సమాచారం http://telugublogofshirdisai.blogspot.in/ ద్వార సేకరించబడింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

One comment on “నేనిప్పుడు బాబా యొక్క నిజమైన ప్రసాదాన్ని పొందాను–బాబావారితోతార్ఖడ్ కుటుంబము-25–Audio

kishore Babu

Very long miracle…vary nice narration…very nice voice presentation…Thank you Sri Ram ji
Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba🙏🙏🙏🙏

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles