పటానికి ఎదురుగా కాళ్ళు పెట్టుకొని పడుకోవద్దు–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


This Audio Prepared by Mrs Lakshmi Prasanna

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

తన పేరు చెప్పడానికి ఇష్టపడని, బొంబాయిలో నివసిస్తున్న సాయి భక్తుని అనుభవం.

1946 వ. సంవత్సరంలో నేను, బొంబాయిలోని మద్రాసీ హిందూ హొటల్ లో మరొక ప్రముఖ జ్యోతిష్కుడు హస్తసాముద్రికునితో ఒకే గదిలొ కలసి ఉన్నాను.

ఆగదిలోకి ఆయన కోసం ఎంతో మంది సందర్శకులు వస్తూ ఉండేవారు. మొదట్లో ఆయనకు సాయిబాబా అంటే నమ్మకం లేదు.

ఎప్పుడో సమాధి పొందిన గురువు గురించి, శక్తిని వృధాగా ఖర్చు చేస్తూ, కాలాన్ని వెచ్చిస్తున్నావని నాతో తరచూ అంటూ ఉండేవాడు.

సాయి, నేడు జీవించి ఉన్న ఏ గురువుకన్నాకూడా ఇప్పటికీ చాలా శక్తిమంతుడని నేను చెప్పినపుడు, అంతకన్నా ఎక్కువ శక్తిమంతుడు కాకాపోతే నేను చెప్పినదానిని నమ్మనని చెప్పాడు.

ఒకరోజున ఆయన వద్దకు జ్యోతిష్య సంబంధమయిన విషయాలు అడగటానికి వచ్చిన సందర్శకులు ఉన్నప్పటికీ, ఆయనకు బాబా తన శక్తివంతమైన కళ్ళతో తనవైపు చూస్తూ నిలుచుని ఉండటం కనిపించింది.

ఆయన ఆశ్చర్యంతో బాబాను చూడటానికి బయటకు వెళ్ళారు. గదిలో గోడకు నేను తగిలించిన బాబా పటం నా ముఖానికి ఎదురుగా నా పాదాలకు ఎత్తులో ఉంది. బాబా నన్ను ఉద్దేశ్యించి, ఇలా చెప్పారు.

చూడు ఈ మనిషి. వాడు నాభక్తుడినని చెప్పుకొంటాడు.

వాడి పాదాలు నాపటానికి ఎదురుగా కనిపించేలా పెట్టుకుని పడుకుంటున్నాడు. నాపటానికి ఎదురుగా కాళ్ళు పెట్టుకొని పడుకోవద్దని వాడికి చెప్పు”. ఇలా చెప్పి బాబా అదృశ్యమయారు.

బాబా అక్కడ ప్రత్యక్షమయి తనతో మనోహరంగా మనసుకు నాటేటట్లు మాట్లాడటం ఆయనను చాలా ఆశ్చర్యచకితుడిని చేసింది.

బాబా జీవించి లేరు అనే అర్ధరహితమైన భావన ఆయన మదిలోనించి తొలగించుకొన్నారు. తాను ప్రత్యక్షంగా బాబాను చూశారు. నన్ను తన భక్తునిగా నామీద ఎంతో మక్కువ కనపరచారు.

ఆ జ్యోతిష్కుడు తనకోసం వచ్చిన వారినందరినీ పంపి వేశారు. నేను గదిలోకి రాగానె ఆయన చాలా ఉద్విగ్నతతో జరిగిన యదార్ధాలన్నిటినీ వివరంగా చెప్పారు.

గోడమీద బాబా పటం ఎక్కడ ఉన్నదో అక్కడనె ఉంచి, నా పాదాలు ఆయనవైపు ఉండకుండా వుండేటట్లుగా మంచం దిశను మార్చేయమని ఆయన నన్ను పట్టుబట్టారు.

వెంటనె మేము మంచం దిశను మార్చి పెట్టాము. ఈ సంఘటనతో ఆయన కూడా బాబాకు అంకిత భక్తుడయారు.

సాయిసుధ.
మార్చ్, 1950, ఏప్రిల్, 1950
సౌజన్యంతో.

ఈ సమాచారం   http://telugublogofshirdisai.blogspot.co.ke/  లింక్  ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles