బాబా రక్షక వలయం లో ఉండటం వలన మృత్యువు కోరల వరకూ వెళ్ళిపోయినా నేను బతికి బయటపడటం జరిగింది.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


ఒకరోజు మా ఆవిడ మా కాలనీలో బాబా గుడికి వెళ్ళింది. అక్కడ స్టేజీ పైన బిస్కట్స్, బ్రెడ్ పాకెట్స్ అలా పడేసి ఉన్నాయట. అది చూసి మా ఆవిడకి చాలా బాధ వేసిందట.బాబాకి బ్రెడ్ బిస్కట్స్ యేనా అని.

ఆగుడి ఎదురుగా ఒకామె వుంది. ఆవిడ అప్పట్లో రోజూ బాబాకి టిఫిన్ తీసుకువెళ్తుండేది.

అలాగా నేను కూడా బాబాకి టిఫిన్ చేసి తీసుకువెడితే చాలా బావుంటుంది అనుకుందట. కొన్నాళ్ళకి ఆఎదురుగా వుండే ఆవిడ వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు.

వెంటనే మా ఆవిడ బాబాకి రోజు రెండు చపాతీలు చేసి తీసుకెళ్లడం మొదలు పెట్టింది. ఇప్పటికీ అది కొనసాగుతోంది. అంతా బాబా దయ.

ఇటీవల 29-5-2017 న హైదరాబాద్ నుంచి డెహ్రాడూన్ లో నామ సప్తాహం చెయ్యాలని 20 మందిమి 30 వ తారీకున హజరత్ నిజాముద్దీన్ స్టేషన్లో ఉదయం 10:30 గంటలకి దిగాము.

అచ్చటి నుండి మేము డెహ్రాడూన్ వెళ్లడం కోసం ఢిల్లీ వెళ్ళవలసి వచ్చింది. సామానంతా వేరే ప్లాటుఫార్మ్ కి మార్చాము.

ఆ మార్చటంలో పోర్టర్ కొంత సామాను వదిలి వేయటంతో నేను కొంత సామాను మోయవలసి వచ్చింది. అందరూ ఢిల్లీ ట్రైన్ ఎక్కారు,

నేను నా భార్య మా తమ్ముడి కొడుకు సాయి మాత్రం ట్రైన్ ఎక్కలేదు. బాబా విగ్రహం కూడా మాతోనే ఉంది. కొంచెం సేపటికి నా చేతులు కాళ్ళు మంటలు, పోట్లతో చెమటలు పట్టాయి.

నా భార్య అది గమనించి ” ఎందుకు నీరసంగా ఉన్నారు? ఈ చెమట లేమిటి? ఏమైంది? ” అని అడిగింది.

అప్పుడు నాకు భయం వేసి, గుండె నొప్పేమో అని తలచి మా సాయిని స్టేషన్ బయటకి పంపి కొన్ని ముఖ్యమైన ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ తెప్పించుకుని, అక్కడే ప్లాట్ ఫామ్ మీదనే నా భార్యతో ఇప్పించుకున్నాను.

అప్పటికే నేను అతి కొద్ది స్పృహలో మాత్రమే ఉన్నాను. ట్రైన్ ఎక్కి ఢిల్లీ చేరుకున్నాము.

ఇంకా తగ్గకపోవడం మూలంగా హాస్పిటల్ కి వెళ్ళాలని స్టేషన్ బయటకి రావటం కోసం మెట్లు ఎక్కవలసి రావటంతో మరింత బాధ రావటంతో అక్కడే కూలబడి పోవటం జరిగింది.

డెహ్రాడూన్ వెళ్ళవలసిన వాళ్ళ టికెట్స్ నా దగ్గరే ఉండటం మూలంగా బాబా విగ్రహంతో పాటు సాయిని డెహ్రాడూన్ పంపించటం జరిగింది.

నేను నా భార్యా మిగిలాము. నా భార్య నా బాధ చూడలేక వీల్ చైర్ కోసం స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళింది.

మెట్లమీద నేను ఒంటరివాడినయ్యాను. ( బయలుదేరే ముందు ఒక ఐదుగురితో నామ సప్తాహం అయిన తర్వాత కేదార్నాథ్, బదరీనాద్ వెళ్ళాలనుకుని తోడుగా బాబా ఉంటాడని ఒక్కరమూ ఒక్కొక్క ఫోటోని దగ్గర ఉంచుకోవటం జరిగింది )

నాకు అప్పుడు నా జేబులో ఉన్న చిన్న బాబా ఫోటోని బయటకి తీసి ” నాయనా! ఏమిటీ పరిస్థితి, నన్నేం చేయదలచుకున్నావు   ఏమీ చేయలేని పరిస్థితిలో నేను ఉన్నాను. నువ్వే రక్షించాలి బాబా ” అని భాదతో వేడుకొని ఫోటోని జేబులో పెట్టుకొని స్పృహ తప్పి పడిపోయాను.

పావు గంట తర్వాత ఒక వ్యక్తితో అంబులెన్సు లో హాస్పిటల్ కి వెళ్ళటం జరిగింది. మా ఆవిడ వైజాగ్ లో ఒక డాక్టర్ ని సంప్రదించింది.

ఆయన ద్వారా మా చిన్నమ్మాయికి అల్లుడికి తెలిసిన వారు మరుసటి రోజు ఉదయానికల్లా ఢిల్లీ వచ్చేశారు.

హైదరాబాద్ వెళ్లిపోదామంటే, కాదు డెహ్రాడూన్ వెళ్లి కార్యక్రమం మొదలు పెట్టిన తర్వాత హైదరాబాద్ వెడదామని డెహ్రాడూన్ కి టికెట్స్ బుక్ చెయ్యమని చెప్పాను.

తీరా మేము వెళ్లేసరికి ఆ ఫ్లైట్ వెళ్ళిపోయింది. నాకు గుండెల్లో నొప్పి భాద పెరిగిపోవటం మూలంగా కింద పడుకుండి పోయాను.

కానీ నా పరిస్థితి విషమించి కూర్చోలేక, నుంచోలేక భాద పడుతుంటే అక్కడ ఒక ఉద్యోగి చూసి ” కింద హాస్పిటల్ ఉంది తీసుకెళ్లండి ” అని చెప్పింది.

నా అల్లుడు సెల్లార్ లో ఉన్న హాస్పిటల్ కి తీసుకెడితే డాక్టర్ చూసి పరిస్థితి చాలా విషమంగా ఉంది, అని వెంటనే అంబులెన్సు ని పిలిపించి ‘ గురుగావ్ ‘ లో ఉన్న ‘ మేదాంత ‘ హాస్పిటల్ కి తరలించారు.

అప్పటివరకు నాకు స్పృహ లేదు. హాస్పిటల్ కి చేరుకోగానే బాబా పంపినట్లుగా సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కశ్రీవాల్ అనే అయన “TO  DECCO” టెస్ట్  చేసి హార్ట్ లో బ్లాక్స్ ఉన్నాయని చెప్పారు.

బాబా గారు పలికించినట్లుగా, అతి స్వల్ప స్పృహ లో ఉన్న నేను స్టంట్ వేయండి అని చెప్పాను. వెంటనే అయన నన్ను ఆపరేషన్ దియేటర్ కి తరలించటం, యాంజియోగ్రాం చెయ్యటం,

4 వాల్వ్స్ బ్లాక్ అయ్యాయని చెప్పటం, అందులో ఒకటి 100  శాతం బ్లాక్ ఉన్నదని, తప్పనిసరిగా బైపాస్ సర్జరీ చెయ్యాలని చెప్పారు.

చివరకి స్టంట్ వెయ్యమని బాబా నా చేత పలికించటం వలనో, అయన మనసుకి బాబా నచ్చ చెప్పటం వలనో వెంటనే 100  శాతం బ్లాక్ ఉన్న వాల్వ్ కి స్టంట్ వెయ్యటం జరిగింది.

బాబా దయ వలన హాస్పిటల్ లో చేరిన అరగంట లో చికిత్స జరిగింది. తర్వాత నన్ను I.C.U లో 3 రోజులుంచారు. నాలుగవరోజు డాక్టర్స్ అనుమతితో హైదరాబాద్ రావటం జరిగింది.

ఇప్పుడు బాబా దయతోటి నా ఆరోగ్యం కుదుట పడింది. ఏ వ్యక్తికయినా  హార్ట్ ఎటాక్ వస్తే కొద్ది నిమిషాలలోనే అతని పరిస్థితి అంతం అయిపోతుంది,

కానీ 30 గంటలు కంటే ఎక్కువగా గుండె నొప్పితో భాద పడినా, నాతో బాబా ఉండటం వలన నేను బాబా రక్షక వలయం లో ఉండటం వలన మృత్యువు కోరల వరకూ వెళ్ళిపోయినా నేను బయటపడటం జరిగింది.

ఇలా బాబా నన్ను అనేక విపత్కరమైన పరిస్థితుల నుంచి రక్షిస్తూనే ఉన్నాడు. డెహ్రాడూన్ లో నామ సప్తాహం కూడా దిగ్విజయంగా బాబా దయ వల్ల పూర్తయింది.

The above telugu TEXT typed by : Mr Sai Krishna

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles