బాబా యొక్క మిరాకిల్



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

పేరు తెలియని ఒక భక్తుని అనుభవం

ప్రతి గురువారంనాడు బాబాను సహస్రనామర్చనాతో పూజించడం నాకు అలవాటు, దానితోపాటు అంగ పూజ మరియు అష్టోత్తర పూజ చేస్తాను. ఇందుకోసం, ప్రతి నామం కు ఒక్కో పువ్వు చొప్పున కనీసం పన్నెండు వందల పువ్వులు అవసరమవుతాయి. 

ఒకసారి శీతాకాలంలో గురువారం పూజకు నేను ఉదయం పూలు సేకరించడము మర్చిపోయాను. సాయంత్రం సూర్యాస్తమయంకు కొంచెం ముందు మాత్రమే జ్ఞాపకం వచ్చింది. ఆలస్యం అవటం వలన పువ్వులు లేవు.

ఏమైనప్పటికీ పుష్పలకు బదులు తులసి దళాల ను వాడవచ్చు. అదృష్టవశాత్తూ మా పొరుగు ప్రాంతంలో తులసి పొదలు ఉన్నాయి. చీకటి పడిన తర్వాత మన సంప్రదాయం ప్రకారం తులసి దళాలు తీయకూడదు.

కాబట్టి, నేను నా ఫ్రెండ్స్ తో పాటు చీకటి పడే లోపే తులసిని సేకరించము. అందరం సేకరించిన తులసి దళాలను లెక్కిస్తే సుమారు ఏడు వందల మాత్రమే వచ్చాయి. అప్పుడు నేను మిగతా నామాలను అక్షాతలతో పూర్తీ చేద్దామని నిర్ణయించుకున్నాను.

అయితే, నేను పూజా ప్రారంభించినప్పుడు, నేను కొరత గురించి మరచిపోయి ప్రతి నామంకు ఒక తులసి దళంతో పూజ మొదలుపెట్టాను. పూజ అనంతరం ప్రసాదం పంచుకున్న తర్వాత నా దృష్టి ట్రే లో ఉన్న తులసి దళాల మీదికి వెళ్ళింది. చూస్తే ట్రై లో తులసి మిగిలేవుంది.

మిగిలిన వాటిని లెక్కిస్తే దాదాపు మూడు వందల దాక ఉన్నాయి. ఇదెలా సాధ్యమని నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నేను ఇంకేమి వివరించగలను, అది అంత బాబా లీలా.

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles