బాబా యొక్క అనంత కోటి అనుగ్రహ కిరణాల్లో ఒక కిరణం నాపై ప్రసరింప చేసినట్లున్నారు.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


నా పేరు భాను మాకు ఒక educational  institute ఉంది. మేము వనస్థలిపురం లో ఉంటాము. మాది మామూలు మధ్యతరగతి కుటుంబం.

మేము మొత్తం ఐదుగురు సంతానంలో ముగ్గురు అక్కల తర్వాత నేను, మా చదువుల కోసం మా నాన్న హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు.

ఒక వైపు ఐదుగురి చదువుల ఖర్చులు, ఆర్ధిక సమస్యలు పైగా అమ్మకి  అనారోగ్యము – లివర్ మరియు కిడ్నీ వ్యాధి చికిత్స కి చాలా డబ్బు  ఖర్చు అయ్యేది.

ప్రాణాంతక వ్యాధి – అమ్మ ఎక్కువ కాలం బ్రతకదు అని డాక్టర్స్ చెప్పేసారు. ప్రైవేట్ ఆసుపత్రిలో  చికిత్స చేయిద్దామంటే అంత స్థోమత లేదు. అసలు ఇంటి అద్దెలకి మా స్కూల్ ఫీజులకే  నాన్న జీతం సరిపోయేది కాదు.

ఇక అమ్మ చికిత్స కెలా? అమ్మను చూస్తూ అందరం ఏడ్చేవాళ్ళం.  కష్టాలే కదా మనుషులని భగవంతుడి వైపు నడిపించేవి సహజంగా.

ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు  ప్రతి గురువారం దిల్ సుఖ్ నగర్ సాయి బాబా గుడికి వెళ్లి దర్శనం చేసికొని, పులిహోర  ప్రసాదం తీసుకువచ్చి  ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి కూడా పంచేవాడిని.

నాన్నకి కొంతైనా ఆర్ధిక భారం తగ్గిద్దామని ఇంటర్ అయిపోగానే  నేను ట్యూషన్లు చెప్పడం మొదలు పెట్టాను.

చిన్నప్పటినుంచి సినిమా పాటలు పాడే అలవాటు బాగా ఉండేది. అప్పుడప్పుడు శ్రీ సాయి బాబా మహత్యం  సినిమా పాటలు కూడా పాడుకునే వాడిని

నిజానికి నేను ఆ సినిమాను నేను ఎన్నోసార్లు T . V లో చూసాను, షిర్డీ గురించి, బాబా గురించి బాబా చేసే లీలల గురించి కొంత తెలిసింది.

అంతే తప్ప షిర్డీ సాయి సచ్చరిత్ర పారాయణం అంటే తెలియదు. బాబా తత్వం తెలియదు, శరణాగతికి అర్థం తెలియదు, బాబా భజనలు రావు, సాయి హారతులు పాడటం తెలియదు.

నిజం చెప్పాలంటే ఒక్కోసారి బాబా సాయంత్రం హారతిలో వినిపించే ”రూసో మమ ప్రియ”విని ఈ రుసోలు, పుసోలు మనకెక్కడ నోరు తిరుగుతుందిలే అని నవ్వుకొనే వాడిని.

ఈ మరాఠీ పదాలు పలకడం అసాధ్యం అనిపించింది కానీ, అసాధ్యాలను సులువుగా సుసాధ్యాలుగా మలిచే సర్వ శక్తి మంతుడు సర్వ సమర్థుడూ అయిన శ్రీ షిర్డీ సాయిబాబా గారు ఛాలెంజ్ గా తీసుకున్నారేమో,

పరమ దయామయులైన బాబా యొక్క అనంత కోటి అనుగ్రహ కిరణాల్లో ఒక కిరణం నాపై ప్రసరింప చేసినట్లున్నారు.

మా కున్న ఆర్ధిక సమస్యలని, అమ్మ ఆరోగ్య సమస్యల్ని, వాటి భారాన్ని నా భుజాలపై నుండి తన భుజాల పైకి మార్చుకున్నారు బాబా.

అంచలంచెలుగా నన్ను తన వైపుకు తిప్పుకున్నారు. బాబా నిరంతరం నాపై తన ప్రేమను చూపుతుంటే ఆనందంతో కృతజ్ఞతా భావంతో ఇక సినిమా పాటలు పాడటం,వినడం ఆగిపోయాయి.

ఇప్పుడు బాబా హారతులు, చక్కటి భజనలు నిత్య సాధనాలు అయినాయి.

బాబా యొక్క సచ్చరిత్ర పారాయణం చేస్తే మంచి జరుగుతుందని  మన కోరిక నెరవేరుతుందని ఒక భక్తురాలి వల్ల తెలుసుకొని అమ్మ ఆరోగ్యం గురించి శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారి శ్రీ సాయి లీలామృతం పుస్తకం పారాయణం ఒకటి, రెండు సార్లు చేశాను.

బాబా గురించి అప్పుడప్పుడే నాకు అవగాహన కలుగుతున్న రోజులవి. ”మనకున్న కళలను భగవంతుడికి అర్పిస్తేనే అది సార్ధకం అవుతుంది” అని పారాయణ పుస్తకంలో చదివాక బాబా హారతులు కూడా నేను నేర్చుకొని పడితే బావుంటుంది అనిపించింది.

కొన్ని రోజులకి నేను నా స్నేహితుడు కలిసి 2000 వ సంవత్సరంలో మొదటిసారి షిర్డీ వెళ్ళాము.

2001  లో మళ్ళీ వెళ్ళాము, ఆ దారిలో బస్సులో కూర్చొని మాట్లాడుకుంటూ  ”మనిద్దరం ఇంత చిన్న వయసులో ఈ విధంగా ట్యూషన్స్ చెప్పుకుంటూ డబ్బు కోసం కష్టపడుతున్నాము,

షిర్డీ లో బాబా లాగా మనకు ఎవరైనా కనపడి మన భవిష్యత్తు ఎలా ఉంటుందో చెబితే బావుంటుంది కదా!” అని అనుకున్నాము. ఇంకా ఏవేవో మాట్లాడుకున్నాము..

షిర్డీ చేరాము బాబా దర్శనం చేసికొని, భోజనం చేసి, గదికి వచ్చి పడుకొని సాయంత్రం ధూప్ హారతికి వెళదామని ఎంతో ఆనందముతో క్యూ కాంప్లెక్స్ కి  చేరుకున్న.

హారతి అప్పటికే నాకు వినబడుతోంది, అదేంటి ? ఇంత త్వరగా హారతి మొదలై పోయింది. అనుకుంటూ ఒకరిని అడిగితే చలికాలం సూర్యాస్తమయం త్వరగా అవుతుంది కాబట్టి హారతి త్వరగా మొదలౌతుంది అని చెప్పారు.

The above miracle has been typed by: Mrs. Rajarajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles