దేవ్ బాబా – దభోల్కర్ యొక్క మనవడు – రెండవ బాగం….



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

దేవ్ బాబా  – దభోల్కర్ యొక్క మనవడు – రెండవ బాగం….

యుక్త వయస్సు వచ్చాక, అతను కుర్లా మున్సిపల్ కిర్దీ కేంద్రలో శారీరక విద్య బోధకుడిగా చేరారు. తన ఆధ్యాత్మిక స్వభావం వలన విద్యార్ధులు అందరిని తన సొంత వారిలా అభిమానముతో, ప్రేమ మరియు శ్రద్ధతో చుసుకోనేవారు.

కానీ విద్యార్థుల లో ఒక ప్రత్యేక శాఖ నుండి వచ్చిన కొంతమంది విద్యార్ధులు ఇతర శాఖల నుండి వచ్చిన విద్యార్థులపట్ల దేవ్ బాబా అనుకూలంగా ఉంటున్నారని భావించారు. ఈ ఆలోచన అతనికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేసే విధంగా దారితీసింది.

ఆధ్యాత్మికం నుండి దూరంగా ఉంటూ చాలా మంది సమస్యలకు సమాధానాలు ఇచ్చే తోటి బోధకుడు, ఒక ప్రత్యేక వర్గం యొక్క విద్యార్ధులకు అనుకూలంగా ఉంటున్న దేవ్ బాబాకు మంచి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. దీని గురించి తెలిసుకొన్న కొందరు శ్రేయోభిలాషిలైన ఉపాధ్యాయులు దేవ్ బాబాని హెచ్చరించారు.

దేవా బాబా  “ఓహో, కానీ అతను రేపు పాఠశాలకు రాడు” అన్నారు. ఆ తరువాత తెలిసింది ఏమిటంటే అతడు సాయంత్రం ఈత కోసం వెళ్లి మునిగిపోయి చనిపోయాడు.

ఈ సంఘటన తో సాయి బాబా తనకి సిద్ధులను ఇచ్చారని దేవ బాబా గ్రహించారు. ఈ సంఘటన అతని మనస్సుపై గొప్ప ప్రభావాన్ని చూపింది.  అతను తన జీవితాన్ని పూర్తిగా ఆధ్యాత్మికతకు మరియు దేవునికి సేవ చేయడానికి అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు.

అతను అనేక పవిత్రమైన ప్రదేశాలు, మరియు అనేక తీర్థయాత్రల సందర్శనాల తరువాత అతను హిమాలయాలకు వెళ్లి హఠ యోగను అభ్యసించారు.

1945 లో అతని తల్లి తీవ్రంగా అనారోగ్యంతో ఉంది, త్వరలోనే ఆమె మరణిస్తుందని తెలిసి ఆమె జీవితంలోని చివరి రోజులలో జపం చేయమని ఆమెకు ఒక మంత్రాన్ని ఇచ్చారు.

తరువాత అతను షిర్డీకి వెళ్లి శ్రీ సాయి సత్చరిత్ర  పారాయణ ప్రారంభించాడు. సాయి బాబా వారు ఆధ్యాత్మిక పురోగతి కోసం పోతీ (పవిత్రమైన బుక్స్) పఠనం లేదా పారాయణ చేయమని అనేకమంది భక్తులను ప్రోత్సహించేవారు. పారాయణ మద్యలో ఉండగా అతని తన తల్లి పరిస్థితి తీవ్రంగా ఉందని టెలిగ్రామ్ ద్వారా సందేశం వచ్చింది.

సమాధి మందిరంలో దేవ్ బాబా బాబాను వెళ్ళాలా, వద్ద అని అడిగారు. అవును అని ఆయనకు జవాబు లభించింది. అయితే అంత తక్కువ సమయంలో అంత దూరం ఎలా వెళ్ళాలి అని అతనికి అనిపించింది. సమయం చాలా తక్కువగా ఉండి, దూరం ఎక్కువగా ఉన్నప్పుడు సాయిబాబా తన తల్లిని సందర్శించమని ఎందుకు చెప్పారు అని అతను ఆలోచనలో పడ్డారు.

మరుక్షణం ఆశ్చర్యకరంగా బాబా అతని ముందు నిలబడి ఉన్నారు. అతను బాబా మహాసమాధి తరువాత సాయి బాబా దర్శనం పొందడానికి అదృష్టవంతుడు.  బాబా ఒక గుర్రాన్ని తెచ్చారు మరియు సుక్ష్మ శరీరం ధరించి  తనతో పాటు వెంబడించమని కోరారు. క్షణాలలో వారు ఇద్దరూ దదార్ లో ఇంటికి చేరుకున్నారు.

తన తల్లిని కలుసుకుని సాయి బాబా స్వయంగా ఆమెను గమ్యం చేర్చుటకు అక్కడ ఉన్నారని హామీ ఇచ్చి, ప్రశాంతంగా వెళ్ళమని వీడ్కోలు పలికారు. తరువాత ఆమె ప్రశాంతమైన మరణాన్ని పొందింది.

దేవ్ బాబా షిరిడికి తిరిగి వచ్చి తన పారాయణ పూర్తీ చేసారు. అతను తన తల్లి మరణించిందని, అప్పుడు తాను ఆమె ప్రక్కనే ఉన్నానని ప్రజలకు చెప్పినప్పుడు ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అదే సమయంలో అతనిని ఇక్కడ  శిర్దిలో ప్రజలందరూ చూసారు. అతడు ఎక్కడికి కదలకుండా పారాయణ చేస్తూ ఉన్నారట.

1952 లో ఆయన కిషోరీ బాయిని వివాహం చేసుకున్నారు. ఈ జంట వారి పూర్వీకుల నివాసమైన అమ్బర్నాథ్ నివాసానికి వెళ్లారు. మొదటి అంతస్తులో 1967 లో ఒక మందిరము నిర్మించి సాయి బాబా యొక్క ఏడు లోహాల మిశ్రమం తో తయారు చేయబడిన విగ్రహము స్థాపించి,  ప్రాణ ప్రతిష్ట చేసారు.

చాలా మంది దేవ్ బాబాకు ఆకర్షించబడ్డారు. వారందరిని అతను తన ఇష్ట దైవమైన సాయి బాబా మార్గంలో నడిపించారు. తన సమాధి తరువాత మతపరమైన ఆచారాలు లేదా వేడుకలు నిర్వహించకూడదని తన బంధువులను ముందుగానే చెప్పి గురువారం, మే 25, 1994 వైశాఖ వైద్యం అపారా ఏకదశి రోజు సమాధి చెందారు.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles