Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
దేవ్ బాబా – దభోల్కర్ యొక్క మనవడు – మొదటి బాగం….
దేవ్ బాబా అలియాస్ అనంత్ ప్రభు వాల్వేకర్. ఇతను హేమాద్ పంత్ యొక్క మనవడు. ఇతను రాజారాం కాకా మరియు కృష్ణబాయి అలియాస్ సీతాబాయిల కుమారుడు (హేమండ్ పంత్ లేదా దభోల్కర్ కుమార్తె).
సీతాబాయి గర్భధారణ సమయంలో సీతాబాయి అనారోగ్యంతో తన తల్లిదండ్రుల ఇంటిలోనే ఉన్నారు. దభోల్కర్ గర్భవతి కుమార్తె యొక్క అనారోగ్యం మీద చాలా శ్రద్ధ చూపించారు మరియు అందరు భక్తులు ఏమి చేస్తారో అదే చేసారు.
అతను షిర్డీకి వెళ్లి తన గురువు మరియు దేవుడు అయిన బాబాకు తన కూతురి పరిస్తితి ఆందోళనగా చెప్పారు. సాయి బాబా అతనికి “కాన్పు ఇబ్బంది లేకుండా సుఖ ప్రసవం అవుతుంది. ఆమె మగ బిడ్డకు జన్మనిస్తుంది” అని హామీ ఇచ్చారు.
దభోల్కర్ సాయి బాబా యొక్క హామీతో ఇంటికి తిరిగి వచ్చాడు. రాజారామ్ విఠల్ భక్తుడు, సంత్ ధ్యానేశ్వర్ వంటి కొడుకుని ప్రసాదించమని తన ఇష్ట దేవతని గట్టిగా ప్రార్ధించారు.
ఏప్రిల్ 13, 1918న కాన్పు సమయంలో రాజారాం మరియు దభోల్కర్ ఇద్దరూ ఆత్రుతగా వెలుపల ఉన్నారు. కొంతసేపటికి సీతాబాయి బిడ్డకు జన్మనిచ్చింది. తన కుమార్తెను మరియు అప్పుడే జన్మించిన బిడ్డను చూడడానికి గదిలోకి ప్రవేశించిన దబోల్కర్ తన కళ్ళకు ముందు ఉన్న దృశ్యాన్ని చూచి నమ్మలేకపోయారు.
తల్లి బిడ్డని తాకలేదు, దగ్గరకు తీసుకోకుండా గదిలో ఒక మూలకు విసేరివేసింది. అప్పుడే జన్మించిన శిశువుకు ఎటువంటి తల్లి ప్రేమ లాలన లేకుండా గది మూలలో తల్లికి దూరంగా ఉన్న ఆ బిడ్డను చూసి ఆశ్చర్యపోయారు దబోల్కర్. మరో ఆశ్చర్యకరమైన విషయం పుట్టిన బిడ్డ తల చుట్టూ కాంతి వలయం మరియు శరీరం చుట్టూ ఒక రకమైన ప్రకాశం కనిపించింది.
తల్లి బిడ్డని తాకేందుకు భయపడింది, మరియు చాలా అవసరమైన తల్లి సంరక్షణ మరియు పోషనను ఇవ్వడానికి నిరాకరించింది. తల్లి యొక్క ప్రవర్తన దభోల్కర్ కి చాలా ఆందోళన కలిగించింది. దభోల్కర్ బిడ్డను తీసుకొని షిర్డీకి పరుగెత్తారు. అతను నేరుగా ద్వారకామాయికి వెళ్లి సాయిబాబా యొక్క పాదాల ముందు బిడ్డని ఉంచి ఆందోళనతో అన్ని వివరాలను వివరించారు.
ఇంతలో సాయి బాబా బిడ్డని ఎత్తుకొని, తన ఒడిలో పెట్టుకొని తమ మృదువైన చేతులతో తట్టారు. తర్వాత సాయిబాబా తమ బొటనవేలును బిడ్డ నోటిలో ఉంచి బిడ్డకు పాలు పట్టారు. బాబా బొటనవేలు నుండి పాలు దారగా వచ్చాయి. అత్యంత అద్భుతమైన ఆ దృశ్యం చూసి సాయిబాబాతో సుదీర్ఘ కాలం గడిపిన భక్తులు ఆశ్చర్యపోయారు. సాయి బాబా యొక్క మరొక అద్భుతం ఈ సంఘటన.
దైవ కృప దేవ్ బాబాతో ఎప్పుడు ఉండేది. దేవ్ బాబా యొక్క ప్రాథమిక విద్య మరాఠి భాషలో సాగింది. తరువాత అతను విల్సన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చేరారు. పాఠశాలకుజరు కావడము రెగ్యులర్ గా ఉండేది కాదు. ఆయన సమీపంలోని స్వామి సమర్థ మఠానికి ఆకర్షితుడై దైవిక సంబంధమైన ఆలోచనలు మరియు ధ్యానంలో కాలం గడిపేవాడు.
రేపు తరువాయి బాగం….
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- దేవ్ బాబా – దభోల్కర్ యొక్క మనవడు – రెండవ బాగం….
- బాబా యొక్క ఆశీర్వాదాల వల్ల నేను నా B.ed పరీక్ష పాస్ అయ్యాను
- తమ యొక్క సగుణ రూపాన్ని చూసేందుకు దృష్టిని ప్రసాదించారు బాబా–Audio
- బాబా యొక్క సర్వవ్యాపకత్వం
- అబ్దుల్ బాబా మూడవ బాగం…..
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments