Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
” ఓం సాయి రాం”.ఇప్పుడు నేను మీకు అందివ్వబోయే బాబా వారి లీల అద్భుతం.ఆశ్చర్యం కలిగించేదిలా ఉంటుంది.ఇది ఒక విధవ రాలి కొడుకు కథ.మన మనసులను కదిలించే కథ.మీరు వినండి.
అది 1971 లో జరిగింది.ఒక స్కూల్ టీచర్,ఆమెకు ఒక కొడుకు,పదవ తరగతి చదివేవాడు.
ఆ అబ్బాయి ఫైనల్ పరీక్షలు రాస్తున్నాడు.లాస్ట్ పరీక్ష కూడా అయిపోయి ఇంటికి వచ్చాడు.
సాయంత్రానికల్లా విపరీతమైన జ్వరం వచ్చేసింది.వాళ్ళ అమ్మ అన్ని రకాల వైద్యాలు చేయించింది.జ్వరం అయితే తగ్గిపోయింది కానీ,పాపం రెండు కాళ్ళు చచ్చు పడిపోయినాయి.
అస్సలు నడవలేని పరిస్థితి.వికలాంగుడు అయ్యాడు.
ఎక్కడికైనా వెళ్లాలంటే భుజాల పైన ఎత్తుకొని వెల్లలసిందే.అన్ని రకాల వైద్యాలు చేశారు.
ఏదీ పని చేయలేదు.ఇంతలో ఆ అబ్బాయి అమ్మగారు ఎవరిద్వారా నో బాబా గురించి,ఆయన చేసే లీలలు గురించి విని,చాలా ప్రభావితురాలు అయ్యి,ఇంకా బాబా తప్పవేరే మార్గం లేదని తన కొడుకు ను తీసుకొని షిర్డీ వెళ్ళింది.
ఆ అబ్బాయి నడవలేని పరిస్థితి.అందుకే ఒక కూలివాని భుజం మీద ఎక్కించుకొని సమాధి మందిర్ పక్కనే ఒక హోటల్ లో వున్నారు.
ఆ అబ్బాయి సిగ్గుచేత సమాధి మందిర్ కు వెళ్ళేవాడు కాదు.వాళ్ళ అమ్మగారు వాడి తరపున కూడా బాబా సమాధి దగ్గర కూర్చొని విలపించేది.”
బాబా,నిన్నే నమ్ముకొని వచ్చాను,సాయి మా అబ్బాయిని బాగు చేయి బాబా” అని విలపించేది.
ఇలా మూడు రోజులు గడిచి పోయినాను.ఆమె స్కూల్ టీచర్,కావడం వలన,నాలుగవ రోజు వెనక్కు వెళ్లాల్సి వచ్చింది.
ఇంకా చివరి సారి బాబా సమాధి దగ్గర ,వాళ్ళ అబ్బాయి గురించి మొరపెట్టుకునే దానికి వెళ్ళింది.
ఇంతలో హోటల్ లో ఉన్న ఆమె కొడుకు కు ఎదురుగా సాక్షాత్ సాయి బాబా ప్రకట మయ్యాడు”
“దేర్యంగా ఉండు”..అని చెప్పి,ఆ అబ్బాయిని ఎత్తుకొని సమాధి మందిర్ దగ్గరికి తెచ్చి,ఒక స్థంభం దగ్గర నిలబెట్టారు.
చూడండి,బాబా ఎంత కృప చూపినారో ఆ అబ్బాయి మీద.ఇంతలో వాళ్ళ అమ్మ బాబా ఆరతి చూసుకొని రూమ్ కు వచ్చేసరికి,వాళ్ళ అబ్బాయి అక్కడ లేడు.
ఇంక వాళ్ళ అమ్మ దుఃఖం వర్ణనాతీతం.ఆమె దిక్కుతోచక మళ్ళీ సమాధి మందిర్ కు వెళ్ళింది బాబా ను వేడుకునే దానికి.అక్కడ స్థంభం దగ్గర వాళ్ళ కొడుకును చూసి ఆశ్చర్య పోయింది.” ఇక్కడికి ఎలా వచ్చావు? ఎవరు తెచ్చారు? అని ప్రశ్నల వర్షం కురిపించింది.అప్పుడు,ఆ అబ్బాయి చెప్పాడు”
అమ్మ,బాబా వారే నన్ను ఈక్కడికి తీసుకొని వచ్చారు” అని..ముందు ఆమె అస్సలు నమ్మలేదు.కానీ వికలాంగుడైన తన కొడుకు నడవడం చూసింది.
ఆ అబ్బాయి తనే సొంతం బాబా కు ప్రదక్షిణం చేయడం చూసింది,బాబా చేసిన ఈ అద్భుతమైన లీల ఆమెకు నమ్మక తప్పలేదు.
ఇంక ఒక నెల లోపల ఆ అబ్బాయి పూర్తిగా నడవకలిగాడు.అది అండి బాబా కృప అంటే.వాళ్ళ అమ్మ విధవరాలు.కొడుకు ను చూసి ఎంత ఆనంద పడి ఉంటుందో మనకు అర్థం అవుతుంది కదా.
అందుకే బాబా వారు ఎప్పుడు “శ్రద్ధ – సబూరి” ఇవ్వమని అడుగుతారు.నిజానికి మనం ఇస్తున్నమా? మీరే ఆలోచించండి…
” సర్వం సాయి నాతర్పణ మస్తు”
Latest Miracles:
- బాబా ఆపరేషన్ తన మీద వేసుకొని,తన భక్తుడిని రక్షించారు.
- తర్ఖడ్ కుటుంబము (తండ్రి, కొడుకు)–Audio
- ” మీ అమ్మాయికి అబ్బాయి పుట్టే అవకాశం లేదు, అయినా గాని నా శరీరంలో సగ భాగం కత్తిరించి, ఈమెకు కొడుకు పుట్టే విధంగా నేను చేస్తాను అని ” బాబా మాటిచ్చారు.
- సమస్యలలో ఉన్న తన తోటి సాయి భక్తులకు సచ్చరిత్ర, సహస్రనామ పారాయణ ద్వారా పరిష్కారం చూపించిన రాజేశ్వర రావు గారు
- తలచిన వెంటనే స్వయం గా వచ్చి తన భక్తురాలి జ్వరాన్ని తొలగించిన బాబా గారు.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments