పదకొండు వాగ్దానాలే ఎందుకు?



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


బాబా ఆక్రా వచనే లేక ఏకాదశ వాగ్దానములు

ఆధ్యాత్మక పురొగతి సాధించాలన్న తపన ఉన్న భక్తుడు తన అధ్యాత్మక ప్రయాణంలో బాబా ఏకాదశ వాగ్దానాలనే జ్యోతి వెలుగులో పయనించాల్సివుంటుంది. నైతిక, సదాచార మరియూ సద్గుణ మార్గంలో పయనించి తమ ఆధ్యాత్మక ప్రగతిని సాధించాలనుకునే సాధకులను ఏకాదశ వాగ్దానాల పధం గమ్యానికి చేరుస్తుంది. ఈ అద్యాత్మక ప్రయాణం చివరికి షిరిడీకి చేరుస్తుంది. ఈ ప్రయాణంలో పదకొండు సొపానాలను, పదకొండు దశలనూ సాధకుడు దాటవలసివుంటుంది, అంతేకాదు బాబా వచనాలకి లోతైన అధ్యాత్మక అర్దాన్ని గ్రహించగలిగిన పదకొండు ముందస్తు లేదా ’జీవితాన్ని మార్చే’ అర్హతలు కూడా అవుసరమవుతాయి.

పదకొండు వాగ్దానాలే ఎందుకు?
పదకొండు వాగ్దానాలే ఎందుకున్నాయి, తొమ్మిదో మరో అంకె యో ఎందుకు కాకూడదు అని నేను ఆశ్చర్యపోతూ వుంటాను. అయిదు కర్మేంద్రియాలు,అయిదు జ్ఞానేంద్రయాలు మరియూ ఒక అంతఃకరణ చతుష్టయం ఏకాదశ వాగ్దానాలని ప్రభావితం చేస్తాయి కనుక అన్నది నాకు తట్టిన సమాధానం. వాటి సహాయంతోనే అధ్యాత్మక ప్రయాణం చేయాల్సివుంటుంది కదా! మనస్సు, మనఃస్సాక్షి, బుద్ధి మరియూ అహంకారం అనేవి అంతఃకరణ చతుష్టయం. స్పర్శ, రుచి, వాసన, దృష్టి కర్మేంద్రియాలు మరియూ చర్మము, నాలుక, ముక్కు, కన్నులు మరియూ చెవులూ జ్ఞానేంద్రియాలు. ఈ పదకొండు ఇంద్రియాల సహాయంతోనే అద్భుతమైన ఆధ్యాత్మక ప్రయాణం సాగుతుంది.

ఏకాదశ వాగ్దానాలకు చాలాలోతైన అధ్యాత్మక అర్దముంది, కేవలం ఆ వాగ్దానాలను పైపై సాహిత్య అర్దాలనే తీసికున్నట్లయితే సాధకుడు ఏమీ సాధించలేడు మరియూ ఆధ్యాత్మక ప్రయాణం ఫలవంతంకాదు. అందుచేత బాబా ప్రతిఒక్క వాగ్దానం ద్వారా చెప్పదలుచుకున్న అర్దాన్ని తెలిసికునే ప్రయత్నాన్ని చేసి వాటిపై ద్యానముంచాలి. అప్పుడు మాత్రమే మనం వాటిని మనసులో నాటుకుని మనజీవితాలలో అన్వయించుకోవడానికి ఎంతగానో ప్రయత్నించగలుగుతాము.

సాయి బాబా చాగంటి

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No :09704379333

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles