సద్గురు సాయినాథుని కృపాజల్లులు. ఎన్. రాజ్యలక్ష్మి ,హైదరాబాద్



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!

శ్రీ సాయిబాబా మాకు దారి చూపిన మహానుభావుడు. బాబా దయ వల్లే ఈ రోజు మేము ఎంతో ఆనందంగా ఉన్నాము.

మా వారు ఉద్యోగానికి స్వచ్చంద పదవి విరమణ ఇచ్చినారు. ఆ సమయంలో పిల్లలు చిన్న వయసులో ఉన్నారు.

నేను చాలా బాధపడినాను. కానీ బాబా దయవల్ల నాకు తెలయకుండానే నా పిల్లలు ఇద్దరు ఇంజనీరింగ్ పుర్తిచేచారు. ఇదీ నా అనుభూతికి ఒక నీదర్శనం. నెల్లూరులో మా ఇంటి దగ్గర బాబా మందిరం ఉంది.

నేను ప్రతిరోజూ నాలుగు ఆరతులకు వెళ్ళేదాన్ని. ఒక రోజు నాకు కలలో బాబా మండపం పైకిరా అని చేయిపట్టుకొని లాగారు.

పైకి ఎక్కేలోగా మెలుకువ వచ్చింది.నెల్లూరు నుండి హైదరాబాద్ పిల్లల చదువు కోసం రావాల్సి వచ్చింది.

ఇప్పుడు నేను “బాబా! మీ మందిరం దగ్గరగా ఇల్లు దొరకాలి.

మీ సేవ చేసుకోవాలి అని పాదాలు పట్టుకొని వెడుకొన్నాను. నా మొరను ఆలకించి బాబా హైదరాబాదులోని బాగ్ అంబర్ పేటలోని తన మందిరానికి దగ్గరగానే ఇల్లు ఇప్పించి తన సేవ చేసుకొనే భాగ్యాన్ని కల్పించారు.

ప్రతి రోజు ఉదయం 5:30 గం:లకు వెళ్లి అన్ని సేవలు చేస్తాను.

ఒక రోజు రాత్రి కలలో బాబా మండపం ఫైన పాదాల దగ్గర నిద్రపోయాను. తెల్లవారిపోయింది.

స్వాములందరు వచ్చి మందిరం తలుపులు తెరిచారు. వెంటనే మెలుకువ వచ్చింది. మళ్లీ క్రిందకు వచ్చి పడుకొన్నాను. నిద్రపట్టలేదు.

అప్పుడు కలలో నుండి మేలుకొని చూచేటప్పటికి నేను మా ఇంట్లోనే ఉన్నాను. సద్గురు శ్రీ సాయినాథుని పల్లకి సేవ, నగర సంకీర్తనలలో కూడా పాల్గొంటునాను.

బాబా అనుగ్రహమే లేకపోతే నేను అసలు ఈ మందిరానికి వచ్చేదానినే కాదు. నా పిల్లలు ఇద్దరు కూడా బాబా భక్తులే. నేను ఎన్నో సంవ్సతరములనుండి శ్రీ సాయిసచ్చరిత్ర పారాయణ చెస్తునాను.

ఒక రోజు కలలో విష్ణుసహస్రనామావళి చదువు అని వినిపించిది. లేచి చూసేడప్పటికీ ఎవరు లేరు. ఇది బాబా లీలే అనుకొంటున్నాను.

ఎన్. రాజ్యలక్ష్మి
న్యూ నల్లకుంట, హైదరాబాద్.

సంపాదకీయం: సద్గురులీల

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No :09704379333

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “సద్గురు సాయినాథుని కృపాజల్లులు. ఎన్. రాజ్యలక్ష్మి ,హైదరాబాద్

admin

మనము ఎప్పుడు అయితే బాబా ని మనస్సుపుర్తిగా నమ్ముతామో అప్పుడు బాబా మన జీవితం మనకు బారం కాకుండా సులభమయిన మార్గం లో నడిపిస్తారు.

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles