సద్గురు సాయినాథుని సాక్షాత్కారం, యోగయ్య, కోట, నెల్లూరు జిల్లా.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై! సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కి జై!!

నేను గత 15 సంవత్సరములుగా జేమ్స్ గార్డెన్ లోని సాయిబాబా మందిరంలో రాత్రి పూట పడుకుంటున్నాను. ఉదయం నుండి సాయంత్రం వరకు డ్యూటీకి వెళతాను. కొత్త మందిరం ప్రారంభోత్సవం అయిపోయినది. బాబా గురూజిల పెద్ద ఫోటోలు మందిరంలో క్రిందపెట్టి ఉన్నారు. ఆ ఫోటోల ముందు ప్రతి రోజు నిద్రపోతాను.

ఒక రోజు రాత్రి నేను పడుకొనే ముందు, బాబా! ” ప్రతి రోజు మీ సన్నిధిలో నేను పడుకుంటున్నాను. నాకు ఒక్క రోజు కూడా కనపడలేదే” అనుకున్నాను. ఆ రోజు రాత్రి రామకృష్ణ సర్ ఫోన్ చేసి ఈ రోజు రాత్రి ఇసుక వాళ్ళు నీకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసినప్పుడు మందిరం తలుపులు తియ్యి అని చెప్పినారు. సరే అలాగే వాళ్ళు ఫోన్ చేయగానే తలుపు తీస్తాను అని చెప్పినాను. నేను పోయి మాములుగానే నిద్రపోయినాను. రాత్రి 12 గంటలకు ఫోన్ రింగ్ అయ్యింది. నేను లేచి తలుపులు తీశాను. వాళ్ళు ఇసుక తోలేసి వెళ్లి పోయినారు. నేను మళ్లీ తలుపులకు తాళం వేసి పడుకున్నాను. మళ్లీ రెండవసారి 3 గంటలకు రెండవ త్రిప్పు ఇసుక వచ్చింది. నాకు మరల ఫోన్ చేశారు. నేను లేచే సరికి గోడ మీద కాలు పెట్టి ఒక అతను అరుస్తున్నట్లుగా కనిపించింది. నేను లేచి ఏమయ్యా నీకు అంత తొందరా? అని అడుగుతున్నాను. కానీ అతను కదలకుండా నిలుచున్నాడు. నేను ఏమయ్యా గోడ దూకి రావటం ఎందుకు? నేను వస్తాను కదా అని చెబుతున్నాను. కాని అతను కదలకుండానే వున్నాడు. ఏందిరా ఇతను ఎంత చెప్పినా కదలడం లేదు, మాట్లాడంలేదు అని అతనిని చూస్తూ ఉన్నాను. తలకు గుడ్డకట్టుకొని వున్నాడు. మనిషి నలుపు శరీరం అంతా మట్టి అయ్యివుంది.

అసలు బండివాడా? ఇంకెవరైనానా అని ఆలోచన వచ్చి ప్రక్కనే ఉన్న సెల్ తీసుకోని లేచేసరికి బాబా ఫోటో నీడ కనబడింది. ఒక్కసారి నా ఒళ్ళు ఝాల్లుమని కరెంటు షాక్ కొట్టినట్లయింది. వాస్తవంగా బండి అతను బయట అరుస్తునాడు, లేచి పోయి తలుపులు తీసినాను. వాళ్ళు ఇసుక తోలి వెళ్ళిపోయినారు. ఇప్పుడు కూర్చొని బాబా ఏ రూపం లో అయిన రావచ్చు! మనం కనుక్కోగలమా? అని అనిపించిది. అప్పుడు బాబా ఫోటో వేపు తిరిగి నమస్కరించి బాబాని నమ్ముకుంటే నిరంతరం మన తోనే వుంటారు. మన వాళ్ళను గూడా జాగ్రత్రగా చూసుకొంటారు అనుకొన్నాను.

యోగయ్య, కోట, నెల్లూరు జిల్లా.

సంపాదకీయం: సద్గురులీల
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No :09704379333

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles