కె .రమా దేవి, టీచర్, కోట, నెల్లూరు జిల్లా.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!  సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కి జై!!

నేను ప్రతిరోజూ సాయి బాబా సత్సంగ కేంద్రం (కో-ఆపరేటివ్ వెనుక వున్నా)లో జరుగు సత్సంగానికి వెళ్ళుతుంటాను. బాబా భక్తుల సమస్యలను పరిష్కరించి ఎలా వారిని అదుకొంటారో నాకు జరిగిన ఒక సంఘటన మీకు వివరిస్తున్నాను.

మా అబ్బాయి (22 సంవత్సరాలు) తేది 22-08-2014 న చెన్నై నుండి ఇంటికి ట్రైన్ లో వస్తున్నాడు. తన దగ్గర రెండు పెద్ద ఎయిర్ బ్యాగ్స్, ఒక చిన్న బ్యాగ్ వుంది. తడలో చిన్న పని ఉండి దిగి మరలా ఎక్కాడు. ఈ సమయంలో చిన్న బ్యాగ్ కనిపించలేదు. ఎవరైనా దొంగిలించి వుండవచ్చు. అ సంచిలో చాల ముఖ్యమైన వస్తువులున్నాయి.దానిలో పాస్పోర్ట్, కొత్త సెల్ ఫోన్ (12,000 రూపాయలు) విలువగలది. కొని నెల రోజులైంది. సాయి బాబా నామం వ్రాసిన బుక్, బ్యాంకు పాస్ బుక్, ఎటియం కార్డు, 500 రూపాయిలు డబ్బులు కలవు. మా అబ్బాయికి జాబు వచ్చింది. దాని కొరకు ఎంతో కష్టపడి పాస్ పోర్ట్ తెప్పించుకొన్నాడు. బ్యాంకు మేనేజర్ కు ఫోన్ చేసి ఎటియం కార్డు పని చేయకుండా చేసాడు. మా అబ్బాయి ఇంటికి రాకుండా సూళ్ళూరు పేటలో ట్రైన్ దిగి అక్కడ మా పెద్ద తమ్ముడి ఇంటికి వెళ్ళాడు. మా తమ్ముడుకి జరిగిన విషయం చెప్పి, అతని సహాయంతో గూడూరు, తడ పోలీస్ స్టేషన్ లో రిపోర్టు చేసారు. వారు తప్పకుండ దొరికినవెంటనే ఫోన్ చేస్తామని చెప్పారు. నేను స్కూల్లో ఉండగా మా తమ్ముడు ఈ విషయం ఫోన్ చేసి చెప్పాడు. నేను వెంటనే సాయి బాబా కు నమస్కరించి ఆ బ్యాగ్ దొరికేలా చేయమని వెడుకొన్నాను.

సాయంకాలం సత్సంగానికి వెళ్ళినప్పుడు మరలా బాబా ను, గురువుగారిని ప్రార్ధించాను. ఇంటికి వచ్చిని 10 నిముషాలు తరువాత ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఒక అమ్మాయి తమిళంలో మాట్లాడింది. నాకు పూర్తిగా అర్ధం కాలేదు. నేను ఆ అమ్మాయికి కృతజ్ఞతలు చెప్పాను. మా తమ్ముడుకి మరియు మా అబ్బయికి తమిళం వచ్చు. అందుకని వారిని ఆ అమ్మాయికి ఫోన్ చేయమని చెప్పాను.. మా తమ్ముడు మాట్లాడితే ఆ అమ్మాయి నాన్నకు అదే ట్రైన్లో ఆరోజు సాయంకాలం 7 గంటలుకు దొరికిందని చెప్పింది. తేది 27-8-2014 న అంటే మరసటిరోజు గుమ్మిడిపూడి రైల్వే స్టేషన్ లో టికెట్ కౌంటర్ దగ్గర ఉదయం 8-30 గంటలుకు ఉంటే ఆ బ్యాగ్ అందజేస్తామని చెప్పింది. మా తమ్ముడు మా అబ్బాయి మరసటి రోజు అదే సమయానికి అక్కడ వున్నారు. ఆ అమ్మాయి నాన్న ఆ బ్యాగ్ తెచ్చి ఇచ్చాడు.

మా అబ్బాయిని అన్ని వున్నాయో లేదో చూసుకొమని చెప్పాడు. జాగ్రత్తగా ఉండమన్నాడు. ఆ బ్యాగ్ లో పాస్ పోర్ట్,సాయి బాబా నామం వ్రాసిన బుక్, బ్యాంకు పాస్ బుక్,వున్నాయి. ఏ టి యం కార్డు, 500 రూపాయిలు లేవు. కానీ అతన్ని అడగలేదు. ఎవరో ఆ బ్యాగ్ దొంగిలించి ఏ టి మ్ కార్డు, 500 రూపాయిలు తీసుకొని ఆ బ్యాగ్ ట్రైన్లోనే వదిలివేసి వెళ్లిపోయి వుంటాడు.

ఆ బ్యాగ్ ఇతనికి దొరికింది. సాయి బాబా కరుణా కటాక్షాలు వలన మాకు పోయిన బ్యాగ్ మరలా దొరికింది. ఒక్కసారి పోయిన వస్తువు మరలా దొరకడం ఎంత కష్టమో అందరికీ తెలుసు. అదీ ట్రైన్ లో అయితే మరీ కష్టము.

దొరికినందుకు మా కుటంబ సభ్యులందరమూ ఎంతో సంతోషించాము. సాయి బాబా గురుజీలకు కృతజ్ఞతలు చెప్పుకున్నాము.

కె .రమా దేవి, టీచర్, కోట, నెల్లూరు జిల్లా.

సంపాదకీయం: సద్గురులీల

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No :09704379333

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles